IRCTC Spiritual Telangana with Srisailam: శనివారం(నవంబర్ 2) నుంచి కార్తీక మాసం మొదలుకానుంది. ఈ మాసంలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతుంటాయి. అయితే ఈ కార్తికంలో ద్వాదశ జ్యోత్యిర్లింగాలు దర్శించుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. కనీసం ఒక్క జ్యోతిర్లింగాన్ని అయినా దర్శించాలని భావిస్తుంటారు. మరి మీరు కూడా అదే ప్లాన్‌లో ఉన్నారా? మీకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ గుడ్‌న్యూస్ చెబుతోంది. 12 జ్యోతిర్లింగాలలో ఒక్కటైనా శ్రీశైలం ఆలయాన్ని దర్శించుకునేందుకు ప్యాకేజీ తీసుకొచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
ఐఆర్‌సీటీసీ టూరిజం "Spiritual Telangana with Srisailam" పేరుతో ఈ టూర్ ప్యాకేజీని అందుబాటులో తీసుకొచ్చింది. ఈ టూర్ 3 రాత్రులు, 4 పగళ్లు ఉంటుంది. ఈ టూర్ ప్రతీ ఆదివారం, సోమవారం, బుధవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. రోడ్డు మార్గం ద్వారా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తారు. ఈ ప్యాకేజీలో శ్రీశైలం, యాదాద్రి పుణ్యక్షేత్రాలు సహా హైదరాబాద్‌లోని పలు పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. ప్రయాణ వివరాలు చూస్తే..
- మొదటి రోజు హైదరాబాద్/ సికింద్రాబాద్/కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులను ఐఆర్‌సీటీసీ సిబ్బంది పికప్ చేసుకుంటారు. అనంతరం హోటల్‌లో చెకిన్ అవ్వాలి. ఆ తర్వాత చార్మినార్, సలార్‌జంగ్ మ్యూజియం, లుంబిని పార్క్ సందర్శిస్తారు. ఆ తర్వాత హోటల్‌కు చేరుకుంటారు. ఆ రాత్రికి హైదరాబాద్‌లో బస ఉంటుంది.
- రెండో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి జర్నీ స్టార్ట్ అవుతుంది. మార్గమధ్యలో బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. శ్రీశైలం చేరుకున్న తర్వాత మల్లిఖార్జున స్వామి దర్శనం ఉంటుంది. అనంతరం అక్కడి స్థానిక ఆలయాలను దర్శించుకున్న తర్వాత తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. ఆ రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేస్తారు.
- మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత బిర్లా మందిర్‌కు తీసుకెళ్తారు. ఆ తర్వాత గోల్కోండ కోటను సందర్శిస్తారు. మధ్యాహ్నం లంచ్ తర్వాత అంబేడ్కర్ విగ్రహంతో పాటు స్థానికంగా ఉన్న పలు సందర్శనీయ ప్రదేశాలను చూపిస్తారు. మూడో రోజు రాత్రికి హైదరాబాద్‌లోనే బస చేస్తారు.
- నాలుగో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ చెక్ అవుట్ చేయాలి. ఆ తర్వాత యాదాద్రికి వెళ్తారు. అక్కడ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనంతో పాటు సురేంద్రపురి కూడా విజిట్ చేస్తారు. తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకోవడంతో ప్రయాణం ముగుస్తుంది.
ధరల వివరాలు: హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ టూరిజం ప్యాకేజీ ధరలను చూస్తే..
- సింగిల్ షేరింగ్‌కు రూ. 37,200, డబుల్ షేరింగ్‌కు రూ. 19,530, ట్రిపుల్ షేరింగ్‌కు రూ. 14,880గా నిర్ణయించారు.
- 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే చిన్నారులకు విత్ బెడ్‌తో రూ. 9,780, విత్ అవుట్ బెడ్‌తో రూ. 9,780 గా నిర్ణయించారు.
ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- హోటల్ అకామిడేషన్
- 3 డిన్నర్, 2 బ్రేక్‌ఫాస్ట్
- ప్యాకేజీ షేరింగ్‌ను బట్టి ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్
- ట్రావెల్ ఇన్సూరెన్స్
- ప్రస్తుతం ఈ ప్యాకేజీ నవంబర్ 6వ తేదీ నుంచి అందుబాటులో ఉంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు.
హైదరాబాద్ To శ్రీలంక - రామాయణ ఇతిహాసాలు చూసేందుకు - IRCTC సూపర్ ప్యాకేజీ!
అటు ఆధ్యాత్మిక దర్శనాలు - ఇటు పర్యాటక ప్రదేశాలు - IRCTC అద్భుత ప్యాకేజీ! ధర కూడా తక్కువేనండోయ్!