ETV Bharat / offbeat

"మంచు కురిసే వేళలో కశ్మీరీ లోయలో" - IRCTC అద్భుతమైన ప్యాకేజీ - ధర కూడా తక్కువేనండోయ్​! - IRCTC MYSTICAL KASHMIR TOUR PACKAGE

-బడ్జెట్​ ధరలోనే ఐఆర్​సీటీసీ ప్యాకేజీ -ఆరు రోజుల పాటు మంచు కొండల్లో తడిసిపోవచ్చు

IRCTC MYSTICAL KASHMIR TOUR PACKAGE
IRCTC Kashmir Tour package (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Nov 8, 2024, 4:46 PM IST

IRCTC Mystical Kashmir Winter Special Ex Hyderabad Tour: ఉత్తర భారతదేశంలో తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో కశ్మీర్‌ ఒకటి. చుట్టూ మంచు పర్వతాలు.. ఎత్తైన కొండలు.. వాటి మధ్యలో రోప్‌ జర్నీ.. ఆ ఫీలింగ్ మాటల్లో వర్ణించలేము.​ మరి మీరు కూడా ఆ ఫీలింగ్​ను పొందాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఇండియన్​ ర్వైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​(IRCTC) సూపర్ ప్యాకేజీ అందిస్తోంది. మరి టూర్​ ప్రయాణం ఎన్ని రోజులు? ధర ఎంత? ఏయే ప్రదేశాలు కవర్​ అవుతాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

"మిస్టికల్​ కశ్మీర్​ వింటర్​ స్పెషల్​ ఎక్స్​ హైదరాబాద్​" పేరిట ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్‌ నుంచి విమానం ప్రయాణం ద్వారా ఈ టూర్​ మొదలవుతుంది. ఈ టూర్​ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగుతుంది. ఈ టూర్​లో భాగంగా గుల్​మార్గ్​, పహల్గామ్‌, సోన్‌మార్గ్‌, శ్రీనగర్​లోని పలు ప్రదేశాలు విజిట్​ చేస్తారు. మరి ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటిరోజు మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్‌ నుంచి ఫ్లైట్ (6E- 6253) ​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. సాయంత్రానికి శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి పికప్​ చేసుకుని.. ముందుగానే బుక్‌ చేసిన హోటల్​కి తీసుకెళ్తారు. అక్కడ చెకిన్​ అయ్యి తర్వాత ఆ సాయంత్రం షాపింగ్​ కోసం ఫ్రీ టైమ్​ ఉంటుంది. ఆ రాత్రికి శ్రీనగర్​లో డిన్నర్​, స్టే ఉంటుంది.
  • రెండో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత బంగారు గడ్డి మైదానంగా పేరొందిన సోన్‌మార్గ్‌కు వెళ్తారు. అక్కడ మంచుతో కప్పిన ఎత్తయిన కొండలు, మంచుతో కప్పిన రోడ్లను చూసి మైమరిచిపోవచ్చు. ఈ పర్యటనలో తాజ్వాస్ గ్లేసియర్‌ (హిమానీనదం) ప్రధాన ఆకర్షణగా ఉంటుంది. వీటిని చూసిన తర్వాత శ్రీనగర్‌కు వచ్చి హోటల్లో స్టే చేస్తారు.
  • మూడో రోజు బ్రేక్​ఫాస్ట్​ తర్వాత ఉదయం గుల్‌మార్గ్‌కు బయల్దేరుతారు. అక్కడ పూలతో నిండిన రోడ్ల మార్గం ద్వారా ప్రయాణించి గుల్‌మార్గ్‌ గోండోలాకు చేరుతారు. అక్కడ రోప్‌వే ప్రయాణం మైమరిపిస్తుంది. దానికి ఖర్చులు యాత్రికులే భరించాల్సి ఉంటుంది. అక్కడ ఎంజాయ్​ చేసిన తర్వాత తిరిగి శ్రీనగర్​కు చేరుకుని ఆ రాత్రికి అక్కడ బస చేస్తారు.
  • నాలుగో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత పహల్గామ్‌కు ప్రయాణం ఉంటుంది. సముద్ర తీరానికి 2440 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతంలో ఉండే లోయ అందాలను వీక్షించాక.. తిరుగు ప్రయాణంలో కుంకుమపువ్వు పంట అందాలు, అవంతిపూర్ శిథిలాలు వీక్షించొచ్చు. ఆ రోజు రాత్రి పహల్గామ్‌ హోటల్‌లోనే భోజనం చేసి అక్కడే స్టే చేస్తారు.
  • ఐదో రోజు టిఫెన్ తర్వాత​ శ్రీనగర్‌కు చేరుకుంటారు. అక్కడ ఆదిశంకరాచార్య మందిరాన్ని దర్శించుకుంటారు. ఆ సాయంత్రం సూర్యాస్తమయాన్ని వీక్షించటానికి సాయంత్రం దాల్‌ సరస్సుకు తీసుకెళ్తారు. అక్కడున్న చార్‌-చినార్‌ (ప్లోటింగ్‌ గార్డెన్స్‌) వీక్షించొచ్చు. అయితే ఇక్కడ రుసుములు యాత్రికులే చెల్లించాలి. అనంతరం హౌస్‌బోట్‌లోకి చెకిన్​ అయ్యాక ఆ రాత్రికి అక్కడే బస ఉంటుంది.
  • ఆరో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత హౌస్​బోట్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి మొఘల్ గార్డెన్స్, బొటానికల్ గార్డెన్ విజిట్​ చేస్తారు. అక్కడి నుంచి శ్రీనగర్​ ఎయిర్​పోర్ట్​కు బయలుదేరుతారు. ఆ సాయంత్రానికి శ్రీనగర్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

ప్యాకేజ్‌ ఛార్జీలు..

  • కంఫర్ట్​లో సింగిల్‌ షేరింగ్‌ కావాలంటే ఒక్కొక్కరికీ రూ.43,670 చెల్లించాలి. ట్విన్‌ షేరింగ్‌ అయితే రూ.41,710, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీ అయితే రూ.41,050 పే చేయాలి.
  • 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు ఒకరికి విత్‌ బెడ్‌ అయితే రూ.37,130, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.34,830 పే చేయాలి. 2 నుంచి 4 సంవత్సరాల చిన్నారులకు రూ.27,990 చెల్లించాలి.

ప్యాకేజీలో ఏమేం ఉంటాయ్‌?

  • ఫ్లైట్​ టికెట్లు(హైదరాబాద్​ / శ్రీనగర్​ / హైదరాబాద్​)
  • హోటల్​ అకామిడేషన్​
  • ఆరు రోజులు అల్పాహారం, రాత్రి భోజనం కవర్ అవుతుంది.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర ఆహారపదార్థాలన్నీ యాత్రికులే చూసుకోవాలి.
  • విమాన ప్రయాణంలో ఎటువంటి ఆహారం తీసుకున్నా యాత్రికులే చెల్లించాలి.
  • పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు ఉంటే టూరిస్టులే చెల్లించాలి.
  • ప్రస్తుతం ఈ టూర్​ నవంబర్​ 21, డిసెంబర్​ 21, 27వ తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

IRCTC సూపర్​ ప్యాకేజీ - బ్యాంకాక్​లో ఫుల్​ ఎంజాయ్​ చేయవచ్చు! - సఫారీ వరల్డ్ టూర్ కూడా!

కార్తికమాసం స్పెషల్​ - అరుణాచలం TO తంజావూర్ - రూ.14వేలకే IRCTC సూపర్​ ప్యాకేజీ!

కార్తికమాసం స్పెషల్​ - శ్రీశైలం దర్శించుకునేందుకు IRCTC సూపర్​ ప్యాకేజీ - పైగా యాదాద్రి వెళ్లొచ్చు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.