ETV Bharat / offbeat

సమ్మర్​ స్పెషల్​ : పుచ్చకాయతో​ అద్దిరిపోయే ఐస్ క్రీమ్ - రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! - WATERMELON ICE CANDY

- ఎండల్లో కూల్​ కూల్​గా వాటర్ మెలన్ ఐస్ క్యాండీ - ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా!

Watermelon
Watermelon Ice Candy (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 18, 2025, 6:19 PM IST

Watermelon Ice Candy Recipe : మార్చి రాకముందే పగటిపూట ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే చాలా మంది ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు, డీహైడ్రేషన్ బారినపడకుండా ఎక్కువగా పుచ్చకాయలను తింటుంటారు. అయితే, వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయను నేరుగా తినడమే కాకుండా ఓసారి ఇలా ఐస్​ క్రీమ్ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. పైగా ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా చేసుకునే ఈ ఐస్ క్రీమ్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం ఉండదు! మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ వాటర్ ​మెలన్ ఐస్ క్యాండీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • చిన్న పుచ్చకాయ - 1
  • చక్కెర - రుచికి తగినంత
  • యాలకుల పొడి - పావుటీస్పూన్
  • నిమ్మకాయ - అర చెక్క
  • ఉప్పు - రుచికి సరిపడా

పుచ్చకాయ లోపల ఎర్రగా పండిందో లేదో - ఇలా తెలుసుకోండి!

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా పుచ్చకాయను ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత అందులోని గుజ్జుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తొక్కలను పడేయాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని కట్ చేసుకున్న పుచ్చ ముక్కలను గింజలతో సహా వేసుకోవాలి. ఆపై అందులో చక్కెర వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అక్కడక్కడా చిన్న చిన్న పీసేస్ ఉన్నా ఏం పర్వాలేదు.
  • మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్​లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అందులో యాలకుల పొడి వేసుకొని గింజలు పడకుండా నిమ్మకాయ పిండుకోవాలి. అలాగే ఉప్పు వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఇప్పుడు చిన్న చిన్న టీ గ్లాసులు తీసుకొని వాటిల్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న పుచ్చకాయ మిశ్రమాన్ని పోసుకోవాలి.
  • అనంతరం ఆ టీ-గ్లాసులను పైన అల్యూమినియం ఫాయిల్​తో కవర్ చేయాలి. ఇలా చేయడం ద్వారా స్టిక్ అనేది మిడిల్​లో కరెక్ట్​గా ఉంటుంది.
  • ఆ తర్వాత అల్యూమినియం ఫాయిల్ మధ్యలో చిన్నగా కట్ చేసి అన్ని గ్లాసులలో ఐస్ స్టిక్స్ పెట్టుకోవాలి.
  • ఇప్పుడు అల్యూమినియం ఫాయిల్​తో కవర్ చేసి, స్టిక్స్ పెట్టిన టీ గ్లాసులను డిఫ్రిడ్జ్​లో కనీసం 8 గంటల పాటు ఉంచాలి.
  • 8 గంటల తర్వాత ఆ టీ గ్లాసులను బయటకు తీసి వాటిపై ఉండే అల్యూమినియం ఫాయిల్ తీసేయాలి. ఆపై వాటిని నార్మల్​ వాటర్​లో 5 సెకన్ల పాటు ఉంచాలి. ఆ తర్వాత వాటిని తీస్తే ఐస్ క్యాండీ పర్ఫెక్ట్​గా వస్తుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే చల్ల చల్లని "పుచ్చకాయ ఐస్ క్యాండీలు" రెడీ!
  • ఒకవేళ మీ దగ్గర అల్యూమినియం లేకపోతే గ్లాసులను ఫ్రిడ్జ్​లో ఉంచిన రెండు గంటల తర్వాత స్టిక్స్​ని మధ్యలో పెడితే సరిపోతుంది. ఆ తర్వాత మరో ఆరు గంటలు ఫ్రిడ్జ్​లో ఉంచి తీసుకుంటే చాలు.

ఇంజెక్షన్‌ చేసిన పుచ్చకాయను ఎలా గుర్తించాలి? - మీకు తెలుసా ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.