ETV Bharat / state

'అమెరికాలో చదువుకుంటారో - ఉద్యోగం చేస్తారో మీరే తేల్చుకోండి! - రెండూ అంటే కుదరవిక' - SOFTWARE JOBS IN AMERICA

అమెరికాలో చదువా? ఉద్యోగమా నిర్ణయించుకోవాలంటున్న డాక్టర్‌ ఫణి - చదువుకుంటూ ఉద్యోగమంటే అమెరికాలో కుదరదు - నైపుణ్యాలకు తగ్గట్లుగా వేతనాలు

JOBS IN AMERICA
Software Jobs In America (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 17, 2025, 12:09 PM IST

Software Jobs In America : అమెరికాకు వెళ్లాలంటే ఉద్యోగమా? చదువా? అనేది ముందుగా ఆలోచించుకోవాలని జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థుల సంఘం టెక్సాస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ ఫణి రాజుకుమార్‌ అన్నారు. ఉద్యోగం కావాలనుకుంటే ఫలానా అంశంలో నైపుణ్యం, వృత్తి అనుభవం ఉందని నిరూపించుకోవాలని తెలిపారు. చదువు కోసం యూనివర్సిటీలకు వెళ్లి, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాలు చేయడానికి కుదరదని అన్నారు. అమెరికాలో ఈ నిబంధనలు ఏళ్లుగా ఉన్నాయని, వాటి అమలుకు ఇప్పుడు ట్రంప్‌ కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆయన హైదరాబాద్​కు వచ్చిన​ సందర్భంగా ఈ వివరాలు తెలియజేశారు.

వృత్తి నిపుణులకు మేలు : వృత్తి నిపుణులకు వారి నైపుణ్యాలకు తగ్గట్లుగా వేతనాలివ్వాలని ట్రంప్‌ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. దీనివల్ల వృత్తి నిపుణులకు ఎంతో మేలు కలుగుతుంది. ఉన్నత విద్య అనంతరం సాఫ్ట్‌వేర్‌ సంస్థల్లో ఉద్యోగం కోసం చాలా మంది కన్సల్టెంట్లను ఆశ్రయించి వివిధ సంస్థల్లో పని చేస్తున్నారు. ఒక ఉద్యోగికి అమెరికా నిబంధనల మేరకు రోజుకు వంద డాలర్ల జీతం ఉంటే కన్సల్టెన్సీల ద్వారా చేరిన వారికి 40 డాలర్లు మాత్రమే అందుతుంది. ట్రంప్‌ తాజా ఆదేశాలతో కన్సల్టెన్సీల పాత్ర ఏమీ ఉండదు. సంస్థలు అమెరికా నిబంధనల మేరకు ఒకేవిధంగా వేతనాలు ఇస్తున్నాయి. తప్పుడు అనుభవ పత్రాలతో ఉద్యోగం చేస్తున్న వారి పనితీరును కూడా పరిశీలిస్తున్నాయి.

అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు : అమెరికాలో లక్షల సంఖ్యలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలున్నాయి. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఎంఎస్‌ చదువుకునేందుకు అమెరికా వెళ్తున్న విద్యార్థులు రెండేళ్ల చదువు పూర్తయ్యాక ‘నేను ఈ విభాగంలో స్పెషలిస్టును. ఇందులో నాకు అపారమైన నైపుణ్యాలున్నాయని దరఖాస్తు చేసుకుంటే చాలు. ఆరు నెలలు లేదా ఏడాదిలోగా రాజమార్గంలో మంచి వేతనంతో ఉద్యోగం వస్తుంది. బహుళజాతి సంస్థల్లో, ఐటీ కంపెనీల్లో ఉద్యోగం రాగానే ఆరు సంవత్సరాల వీసా ఉంటుంది. మరిన్ని నైపుణ్యాలు పెంచుకుంటే అలాగే అమెరికాలో ఉండొచ్చు.

పీహెచ్‌డీ పూర్తయ్యాక ఉన్నత హోదా : పరిశోధకులయ్యేందుకు అమెరికా వెళ్తే పీహెచ్‌డీ పూర్తయ్యాక ఉన్నత హోదా లభిస్తుంది. రెండేళ్లు ఎంఎస్‌ పూర్తి చేశాక ప్రముఖ విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తుకు చేసుకుంటే సీటు లభిస్తుంది. ప్రతి విశ్వవిద్యాలయంలో పరిశోధక విద్యార్థికి కనిష్ఠంగా 2 వేల డాలర్లు, గరిష్ఠంగా 5 వేల డాలర్లు ఉపకార వేతనం లభిస్తుంది. మూడేళ్లలో పీహెచ్‌డీ పూర్తైతే ఏడాదిలోపే బోధకులుగా, లేదంటే ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలుగా ఉన్నత హోదా ఉద్యోగాలు కచ్చితంగా లభిస్తాయి.

అమెరికా వీసా 'డ్రాప్ బాక్స్' రూల్స్​ ఛేంజ్​! భారతీయులపైనే ఎక్కువ ఎఫెక్ట్​!

అమెరికా నుంచి మూడో విమానం- అమృత్​సర్​కు 112మంది భారతీయులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.