Realme P3 Series Launched: రియల్‌మీ తన P3 సిరీస్‌ను దేశీయ మార్కెట్లో ఇవాళ లాంఛ్ చేసింది. కంపెనీ ఈ సిరీస్‌లో 'రియల్‌మీ P3 ప్రో 5G', 'రియల్‌మీ P3x 5G' అనే రెండు మోడల్స్‌ను తీసుకొచ్చింది. ఈ రెండింటినీ 6000mAh బ్యాటరీ ప్యాక్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉన్న డిస్ప్లేతో లాంఛ్ చేసింది. ఈ రెండు ఫోన్లూ వైఫై, బ్లూటూత్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ సదుపాయాలతో వస్తున్నాయి. అంతేకాక వీటి కొనుగోలుపై కంపెనీ మంచి ఆఫర్లను కూడా అందిస్తోంది. ఈ సందర్భంగా రియల్‌మీ రిలీజ్ చేసిన ఈ రెండు కొత్త స్మార్ట్ఫోన్ల ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్లతో పాటు ఆఫర్ల వివరాలను తెలుసుకుందాం రండి.
1. 'రియల్‌మి P3x 5G' స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే: ఈ ఫోన్‌లో 6.7-అంగుళాల ఫుల్ HD ప్లస్ LCD స్క్రీన్ ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz.
ప్రాసెసర్: కంపెనీ దీనిలో ప్రాసెసర్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 6400 చిప్‌సెట్‌ను అందించింది.
ఆపరేటింగ్ సిస్టమ్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ రియల్‌మీ UI 6 OS పై రన్ అవుతుంది.
కెమెరా సెటప్: ఇది f/1.8 ఎపర్చరుతో 50MP OMNIVISION OV50D మెయిన్ కెమెరా, 2MP సెకండరీ కెమెరాను కలిగి ఉంది. ఇక ఈ ఫోన్‌లో సెల్ఫీ అండ్ వీడియో కాలింగ్ కోసం 8MP కెమెరా సెన్సార్ ఉంది.
బ్యాటరీ: రియల్‌మీ ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీని అందించింది. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.
కలర్ ఆప్షన్స్: ఈ ఫోన్ దేశీయ మార్కెట్లో మూడు రంగుల్లో అందుబాటులో ఉంది.
- లూనార్ సిల్వర్
- మిడ్‌నైట్ బ్లూ
- స్టెల్లార్ పింక్
'రియల్‌మి P3x 5G' వేరియంట్స్: కంపెనీ ఈ ఫోన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది.
- 6GB RAM + 128GB స్టోరేజ్
- 8GB RAM + 128GB స్టోరేజ్
వేరియంట్ల వారీగా ధరలు:
- 6GB RAM + 128GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ ధర: రూ. 13,999
- 8GB RAM + 128GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ ధర: రూ. 14,999
రియల్‌మీ P3x 5Gపై ఆఫర్: రియల్‌మీ ఈ P3x 5G స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ రూ.1000 తగ్గింపు ఇస్తోంది.
సేల్స్: దేశీయ మార్కెట్లో ఫిబ్రవరి 28 నుంచి వీటి విక్రయాలు ప్రారంభమవుతాయి. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1000 వరకు తగ్గింపు పొందొచ్చు.

2. 'రియల్‌మీ P3 Pro 5G' స్పెసిఫికేషన్స్:
డిస్ప్లే: ఈ ఫోన్‌లో 6.83-అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ AMOLED స్క్రీన్ ఉంది. దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఇది 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తోంది.
కెమెరా సెటప్: ఫొటోస్ అండ్ వీడియోస్ కోసం ఈ ఫోన్‌లో 50MP సోనీ IMX896 ప్రైమరీ కెమెరా ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో వస్తుంది. దీంతోపాటు ఇందులో 2MP సెకండరీ కెమెరా కూడా ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్ ముందు భాగంలో 16MP సోనీ IMX480 సెన్సార్ ఉంది.
ప్రాసెసర్: కంపెనీ ఈ ఫోన్‌లో ప్రాసెసర్ కోసం క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్‌ను అందించింది.
ఆపరేటింగ్ సిస్టమ్: ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 బేస్డ్ రియల్‌మీ UI 6.0 పై నడుస్తుంది.
బ్యాటరీ: ఈ ఫోన్‌లో 6000mAh బ్యాటరీ ఉంది. ఇది 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చింది.
ఏఐ ఫీచర్లు: కంపెనీ ఈ ఫోన్‌లో ఏఐ బెస్ట్ ఫేస్, ఏఐ ఎరేజ్ 2.0, ఏఐ మోషన్ డెబ్లర్, ఏఐ రిఫ్లెక్షన్ రిమూవర్ వంటి AI ఫీచర్లను కూడా అందించింది.
ప్రొటెక్షన్: డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం ఈ ఫోన్ IP68+IP69 రేటింగ్‌తో వస్తోంది.
కలర్ ఆప్షన్స్: రియల్‌మీ ఈ ఫోన్‌ను మూడు కలర్ ఆప్షన్లతో అందుబాటులోకి తీసుకొచ్చింది.
- గెలాక్సీ పర్పుల్
- నెబ్యులా గ్లో
- సాటర్న్ బ్రౌన్
వేరియంట్స్: మార్కెట్లో ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
- 8GB RAM + 256GB స్టోరేజ్
- 12GB RAM + 256GB స్టోరేజ్
వేరియంట్ల వారీగా ఈ ఫోన్ ధరలు:
- 8GB RAM + 128GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ ధర: రూ. 23,999
- 8GB RAM + 256GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ ధర: రూ. 24,999
- 12GB RAM + 256GB స్టోరేజ్‌తో ఈ ఫోన్ ధర: రూ. 26,999
రియల్‌మీ P3 Pro 5Gపై ఆఫర్: ఈ రియల్‌మీ P3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై వినియోగదారులు రూ. 2,000 బ్యాంక్ ఆఫర్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్ పొందొచ్చు.
సేల్స్: మార్కెట్లో వీటి సేల్స్ ఫిబ్రవరి 25 నుంచి ప్రారంభం కానున్నాయి. రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ నుంచి వీటిని కొనుగోలు చేయొచ్చు. ఎంపిక చేసిన క్రెడిట్ కార్డుల సాయంతో కొనుగోలు చేస్తే రూ.2వేలు తగ్గింపు పొందొచ్చు.
'రియల్‌మి P3x 5G' వర్సెస్ 'రియల్‌మీ P3 Pro 5G': స్పెసిఫికేషన్స్ అండ్ ప్రైస్

'లో కాస్ట్' విత్ 'నో కోడ్'- జొమాటో నుంచి కస్టమర్ సపోర్ట్ AI ప్లాట్‌ఫామ్!
సముద్ర గర్భంలోకి మనుషులు- 6వేల మీటర్ల లోతులో పరిశోధన- 'మత్స్య-6000' టెస్ట్ సక్సెస్