ETV Bharat / offbeat

గాడ్స్​ ఓన్​ కంట్రీకి IRCTC సూపర్ ప్యాకేజీ - కేరళ ప్రకృతి సోయగాల్లో తడిసి ముద్దైపోవచ్చు! - IRCTC KERALA HILLS AND WATER TOUR

తక్కువ ధరకే ఆరురోజుల టూర్​ వింటర్​లో ఆ నేచర్ అందాలు చూడాల్సిందే!

IRCTC Kerala Hills and Water Tour
IRCTC Kerala Hills and Water Tour (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 5, 2024, 1:38 PM IST

IRCTC Kerala Hills and Water Tour : పచ్చని కొండలు, ప్రకృతి అందాలకు కేరాఫ్​ అడ్రస్.. కేరళ. అందుకే చాలా మంది ఈ గాడ్స్ ఓన్ కంట్రీని విజిట్​ చేసేందుకు ఇష్టపడుతుంటారు. మరీ ముఖ్యంగా వింటర్​ సీజన్​లో.. మంచుతో కప్పబడిన పచ్చని కొండలు, జలజల పారే జలపాతాలను సందర్శించాలని ఆరాటపడుతుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్​లో ఉన్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​ చెబుతోంది.. ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్​. కేరళ అందాలను ఆస్వాదించేందుకు ఓ అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు, ఏఏ ప్రాంతాలు సందర్శించవచ్చు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

IRCTC టూరిజం "కేరళ హిల్స్​ అండ్​ వాటర్స్​" పేరుతో ఈ ప్యాకేజీ ఆపరేట్ చేస్తోంది. ఈ ప్యాకేజీ 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. ఈ ట్రిప్​లో మున్నార్, అలెప్పీతో పాటు పలు టూరిజం స్పాట్లు కవర్​ చేయవచ్చు. హైదరాబాద్​ నుంచి ట్రైన్​ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీ ఉంటుంది. సూచించిన తేదీల్లో ప్రతి మంగళవారం టూర్​ అందుబాటులో ఉంటుంది. ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 12:20 గంటలకు శబరి ఎక్స్​ప్రెస్ (Train No.17230) బయలుదేరుతుంది. ఆ రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
  • రెండో రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎర్నాకులం రైల్వే స్టేషన్​కు చేరుకుంటారు. అక్కడ్నుంచి మున్నార్ వెళ్తారు. అక్కడ ముందుగానే బుక్​ చేసిన హోటల్​లోకి చెకిన్ అవుతారు. ఆ తర్వాత.. సాయంత్రం మున్నార్ ​టౌన్​లో పలు ప్రదేశాలు సందర్శిస్తారు. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
  • మూడో రోజు ఉదయం ఎరవికులం నేషనల్​ పార్క్​(Eravikulam National Park)ను విజిట్​ చేస్తారు. ఆ తర్వాత టీ మ్యూజియం, మెట్టుపెట్టి డ్యామ్​తో పాటు ఏకో పాయింట్​ను సందర్శిస్తారు. ఆ రాత్రి కూడా మున్నార్​లోనే బస చేస్తారు.
  • నాలుగో రోజు హోటల్ నుంచి చెక్​ అవుట్​ చేసి అలెప్పీకి వెళ్తారు. హోటల్​లో చెకిన్ అయిన తర్వాత.. బ్యాక్​ వాటర్​ ప్రాంతానికి వెళ్తారు. అక్కడ ఆరోజు మొత్తం ఎంజాయ్​ చేస్తారు. ఆ రాత్రి అలెప్పీలో బస చేస్తారు.
  • ఐదో రోజు హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి ఎర్నాకులం వస్తారు. ఉదయం 11.20 నిమిషాలకు శబరి ఎక్స్​ప్రెస్​(Train No.17229)లో హైదరాబాద్​కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
  • ఆరో రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకోవటంతో టూర్ ముగుస్తుంది.

ధర వివరాలు చూస్తే: ఒకటి నుంచి ముగ్గురు ప్రయాణికులకు ధరలు చూస్తే..

  • కంఫర్ట్​లో సింగిల్ షేరింగ్ కు రూ. 34,480గా ఉంది. ట్విన్​ షేరింగ్​ రూ.19,910, ట్రిపుల్​ షేరింగ్​ రూ .16,260గా ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.10,730, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.8,420గా ఉంది.
  • స్టాండర్డ్​లో సింగిల్ షేరింగ్ కు రూ. 31,750గా ఉంది. ట్విన్​ షేరింగ్​ రూ.17,180, ట్రిపుల్​ షేరింగ్​ రూ .13,530గా ఉంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.8,000, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.5,690గా ఉంది. గ్రూప్​ బుకింగ్​పై ధరలు తగ్గే అవకాశం ఉంటుంది.

ప్యాకేజీలో కవర్​ అయ్యేవి ఇవే:

  • హైదరాబాద్​ - ఎర్నాకులం- హైదరాబాద్​ ట్రైన్​ టికెట్లు
  • ప్యాకేజీని బట్టి లోకల్​ ట్రాన్స్​పోర్ట్​కు వెహికల్​ అరేంజ్​ చేస్తారు.
  • బ్రేక్​ఫాస్ట్​తో కలిపి 3 రోజులు హోటల్​ అకామిడేషన్​ ఉంటుంది.
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​ ఉంటుంది.
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ డిసెంబర్​ 10వ తేదీన అందుబాటులో ఉంది.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

IRCTC మహా కుంభమేళా ప్యాకేజీ - తక్కువ ధరలోనే అయోధ్య, వారణాసి కూడా!

ఒకే ట్రిప్​లో అజంతా, ఎల్లోరా, మినీ తాజ్​మహల్​ - IRCTC సూపర్​ ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.