ETV Bharat / state

మనం ఏం మారలేదు - కొత్త ఏడాది 6 రోజుల్లోనే 120 సైబర్‌ కేసులు, అందులో 30 న్యూడ్ కాల్స్! - HYDERABAD REGISTERS 120 CYBER CASES

2025 తొలి వారంలో మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో 120 సైబర్‌ కేసులు - మహిళలనే లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు - మెల్లగా పరిచయం పెంచుకుని మహిళలను బురిడీ కొట్టిస్తున్న కేటుగాళ్లు

CYBER CRIME CASES IN HYDERABAD
120 CYBER CASES REGISTERED IN (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 23 hours ago

2025 Cyber Crimes In Hyderabad : కొత్త ఏడాది 2025లో సరికొత్త ఎత్తులతో సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సామాన్యుల అవసరాలు, సగటు కుటుంబాల ఆర్థిక ఇబ్బందులు, సాధారణ మహిళల భయాలను ఆసరాగా చేసుకొని దొరికినంత దోచుకుంటున్నారు. ఈ ఏడాది తొలి 6 రోజుల్లోనే హైదరాబాద్​లోని మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఏకంగా 120 సైబర్‌ కేసులు నమోదయ్యాయి. వీటిలో 20 నుంచి 30 వరకు నగ్న వీడియోలు, డిజిటల్‌ అరెస్ట్‌లే ఉండటం గమనార్హం.

  • హైదరాబాద్​కు చెందిన ఓ యువతికి స్నాప్‌చాట్‌లో గుర్తుతెలియని యువకుడు పరిచమయ్యాడు. మంచి మాటలతో దగ్గరై ఆ యువతి నగ్నవీడియోలు సేకరించాడు. విదేశాల నుంచి అక్రమంగా వచ్చిన బంగారం ఆమె పేరిటే ఉన్నట్టు భయాందోళనలకు గురిచేశాడు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తానంటూ దశల వారీగా రూ.65 లక్షలు కొట్టేశాడు.

మహిళలే లక్ష్యంగా : పెద్ద పెద్ద చదువులు లేకున్నా ఎంతో కొంత తమ కుటుంబానికి అండగా ఉండాలనేది చాలామంది మహిళల మనసులో ఉంటుంది. ఇంటివద్ద ఉంటూనే డబ్బు సంపాదించవచ్చంటూ యాడ్స్ కనిపించగానే వాటిని నమ్మి మోసపోతున్నారు. హైదరాబాద్​లో నమోదవుతున్న సైబర్‌ కేసుల్లో 30 శాతం మంది బాధితులు మహిళలు, యువతులే ఉన్నారు. సికింద్రాబాద్‌కు చెందిన ఓ మధ్య వయస్కురాలిని కొత్త తరహాలో సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించారు.

ముంబయి సీపోర్ట్​కు చేరిన నౌకలో ఆమె పేరిట మాదకద్రవ్యాలు, పేలుడుపదార్థాలు వచ్చాయంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. అరెస్ట్‌ చేసేందుకు కస్టమ్స్‌, పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారంటూ ఆ మహిళను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఒంటిపై పుట్టుమచ్చలు రికార్డు చేయాలంటూ ఆమెను నగ్నంగా ఉండేట్టు చేసి వీడియో తీశారు. వాటిని బయటపెడతామంటూ బెదిరించి రూ.20 లక్షలు వసూలు చేశారు. నగరంతోపాటు బెంగళూరు, తమిళనాడుల్లోనూ ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయని పోలీసులు వెల్లడించారు. పోలీస్, కస్టమ్స్, సీబీఐ, ఈడీ, ఎన్‌ఐఏ అంటూ చెప్పగానే మహిళలు చాలా భయానికి గురవుతున్నారు.

ఒకే మోసం అనేక రూపాలలో : సోషల్ మీడియా, వాట్సాప్‌ లింకులు, మ్యాట్రిమోనీ వెబ్‌సైట్ల ఫోన్‌ సందేశాలకు స్పందించిన మహిళలు, యువతులను ఈ కేటుగాళ్లు చాలా తెలివి ఉపయోగించి మరీ బురిడీ కొట్టిస్తారు. సోషల్ మీడియాలో తాము విదేశాల్లో ఉన్నత స్థానంలో స్థిరపడ్డామంటూ పరిచయమవుతారు. కొన్నిసార్లు ఫేక్ ప్రొఫైల్‌తో యువతులను మాయ చేస్తారు. తమ గాలానికి చిక్కిన వారితో స్నేహం, ప్రేమ, పెళ్లి అంటూ దగ్గరవుతారు. ఇద్దరి మధ్య కాస్త క్లోజ్​నెస్ పెరిగాక నగ్నవీడియోలు, ఫొటోలు సేకరించి వాటిని ఇంటర్​నెట్​లో పెడతామంటూ బెదిరించి పెద్దఎత్తున నగదు వసూలు చేస్తున్నారు. తమకు ఎదురైన ఈ సమస్యను ఎవరితో చెప్పుకోవాలో తెలియక బాధితులు నేరగాళ్లకు డబ్బులిచ్చి బయటపడుతున్నారు.

"పురుషులు, మహిళలనే తేడా లేకుండా అందరూ సైబర్‌ మోసగాళ్ల బారిన పడుతున్నారు. ఏ ఇన్వెస్టిగేషన్​ సంస్థలు డిజిటల్‌ అరెస్ట్‌లు చేయవు. బ్యాంకు అకౌంట్స్​ గురించి వివరాలు అడగరనేది గుర్తించాలి. సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యే వ్యక్తులతో వివరాలు తెలియకుండానే వ్యక్తిగత ఫొటోలు, వీడియోలను పంచుకుంటున్నారు. వాటితో అమాయక మహిళలను బెదిరించి నగదు వసూలు చేస్తున్నారు. వీడియోలు, నగ్న ఫొటోలతో బెదిరింపులకు పాల్పడితే అస్సలు భయపడొద్దు. వారి ఆదేశాలకు తలొగ్గి ఎలాంటి డబ్బులివ్వొద్దు. బాధితులు వెంటనే టోల్‌ఫ్రీ నంబరు 1930కు ఫిర్యాదు చేయండి" -కవిత దార, డీసీపీ, హైదరాబాద్ సైబర్‌క్రైమ్‌

విరాళాలు ఇస్తామంటూ వచ్చే లింకులను నమ్మకండి - ఎందుకో చెప్పిన సైబర్ క్రైమ్ పోలీసులు

నయా స్కామ్​- మీ అకౌంట్​లో ఫ్రీగా రూ.5వేలు డిపాజిట్​- ఆనందంతో క్లిక్ చేస్తే అంతా ఖాళీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.