ETV Bharat / lifestyle

సింగిల్స్ గెట్ రెడీ! 'యాంటీ వాలెంటైన్స్ వీక్' వచ్చేసింది- రోజుకో స్పెషల్ గురూ! - ANTI VALENTINE WEEK 2025 FULL LIST

-ఫ్లర్ట్ చేయాలంటే ఆ రోజు బెస్ట్! ఎప్పుడు ఏం స్పెషల్ ఉందో తెలుసా? -లవర్స్​కే కాకుండా సింగిల్స్, బ్రేకప్ అయినవారికో వారం!

Anti Valentine Week
Anti Valentine Week (Getty Images)
author img

By ETV Bharat Lifestyle Team

Published : Feb 14, 2025, 5:00 PM IST

Anti Valentine Week 2025 Full List: మీరు సింగిలా? వారం రోజుల పాటు ప్రేమికుల హడావుడి, సంతోషాన్ని చూసి చికాకు పడుతున్నారా? ఇక దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. ఎందుకంటే ఫిబ్రవరిలో లవర్స్​తో పాటు సింగిల్స్, లవ్ బ్రేకప్ అయినవారి కోసం కూడా ఓ వారం ఉంది. వాలెంటైన్స్ వీక్ వ్యతిరేకంగా యాంటీ వాలెంటైన్స్ వీక్ కూడా నిర్వహిస్తుంటారు. దీనిని ప్రేమికుల రోజు ముగిసిన మరుసటి రోజు నుంచే జరుపుకొంటారు. ఈ వారాన్ని సింగిల్​గా ఉన్నవారితో పాటు అప్పుడే రిలేషన్​షిప్ నుంచి బయటకు వచ్చిన వారు ఎంజాయ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ వారంలో ఏ రోజు ఏ ప్రత్యేకత ఉంది? దాని వెనుక ఉన్న ప్రాముఖ్యం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స్లాప్ డే (ఫిబ్రవరి 15): మీకు ఎక్స్ లవర్ ఉందా? రిలేషన్​షిప్​ నుంచి బయటకు వచ్చాక.. వారికో గుణపాఠం చెప్పాలని అనుకుంటున్నారా? అయితే, ఈ రోజు మీ కోసమే! మీ జ్ఞాపకాలను చెరిపివేసి దానికి గుర్తుగా భాగస్వామిని సున్నితంగా చెంప దెబ్బ కొట్టాలని చెబుతున్నారు. అలానీ, హింసకు దారి తీయకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.

Anti Valentine Week
స్లాప్ డే (Getty Images)

కిక్ డే (ఫిబ్రవరి 16): యాంటీ వాలెంటైన్ వీక్​లో రెండో రోజు కిక్ డే. ఈరోజు మీ లవర్ జ్ఞాపకాలన్నింటినీ ఒక కిక్​ ఇచ్చి వదిలించుకోవాలట. మీ భాగస్వామి ఇచ్చిన కానుకలను దూరం పెట్టడమే కిక్ డే ప్రత్యేకత.

Anti Valentine Week 2025
కిక్ డే (Getty Images)

పర్ఫ్యూమ్ డే (ఫిబ్రవరి 17): యాంటీ వాలెంటైన్స్ వీక్​లో మూడో రోజు పర్ఫ్యూమ్ డే. బ్రేకప్ బాధ నుంచి బయటకు వచ్చి మీపై మీరు దృష్టి సారించడం, మిమ్మల్ని మీరు మంచిగా చూసుకోవడమే దీని ఉద్దేశం. ఈ రోజున చాలా రోజులుగా కొనాలనుకుంటున్న మీకు ఇష్టమైన పర్ఫ్యూమ్ కొట్టుకుని కొత్త పరిమళాలను అనుభవించాలని చెబుతున్నారు.

Anti Valentine Week
పర్ఫ్యూమ్ డే (Getty Images)

ఫ్లర్ట్ డే (ఫిబ్రవరి 18): సింగిల్​గా ఉండి బోర్ కొట్టిందా? ఒకసారి మళ్లీ మీ ఎక్స్ లవర్​తో మాట్లాడాలని ఉందా? అయితే, ఈ యాంటీ వాలెంటైన్స్ వీక్​లో నాలుగో రోజు మీదే! ఇప్పటివరకు వారు అనుభవించిన భయాలను వదిలి ఎక్స్​తో ఫ్లర్ట్ చేస్తారని అంటున్నారు.

Anti Valentine Week 2025
ఫ్లర్ట్ డే (Getty Images)

కన్ఫెషన్ డే (ఫిబ్రవరి 19): యాంటీ వాలెంటైన్స్ వీక్​లో ఐదో రోజు కన్ఫెషన్ డే. ఈ రోజు మీరు చాలా కాలంగా చూస్తున్న ఇష్టమైన వ్యక్తికి.. మీలోని భావాలను పంచుకోవాలట. ఇంకా మీరు గతంలో ఎవరినైనా ఇబ్బంది పెట్టి ఉంటే వారి వద్దకు వెళ్లి తప్పును ఒప్పుకోని క్షమాపణాలు చెప్పాలని సూచిస్తున్నారు.

Anti Valentine Week 2025
కన్ఫెషన్ డే (Getty Images)

మిస్సింగ్ డే (ఫిబ్రవరి 20): లవర్, క్లోజ్ ఫ్రెండ్, క్రష్ ఎవరినైనా సరే మీరు మిస్ అవుతున్నారా? అయితే, ఈ మిస్సింగ్ డే మీ కోసమే! ఈరోజు మీరు చెప్పాలనుకుంటున్న విషయాలను, మీ మనసులోని భావాలను వారితో చెప్పాలట.

Anti Valentine Week
మిస్సింగ్ డే (Getty Images)

బ్రేకప్ డే (ఫిబ్రవరి 21): యాంటీ వాలెంటైన్స్ వీక్​లో చివరి రోజు బ్రేకప్​ డే. మీరు టాక్సిక్ రిలేషన్​షిప్​లో ఉన్నారా? ఆ బంధం నుంచి బయట పడాలని అనుకుంటున్నారా? ఈరోజే వెంటనే ఆ బంధానికి గుడ్​ బై చెప్పి సంతంత్రంగా, ఆనందంగా జీవించాలని అంటున్నారు.

Anti Valentine Week 2025
బ్రేకప్ డే (Getty Images)

వాలెంటైన్స్ డేకి ఈ 6 పనులు అసలు చేయకూడదట! అవేంటో మీకు తెలుసా?

కిస్ డే, హగ్ డే ఎప్పుడో తెలుసా? వాలంటైన్స్ వీక్ ప్రత్యేకతలేంటో తెలుసుకోండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.