ETV Bharat / state

మల్లన్నసాగర్‌ కాలువకు గండి - దుండగుల పనిపై అనుమానాలు - MALLANNA SAGAR WATER ISSUE

మల్లన్న సాగర్ జలాశయ ఉప కాలువకు గండి - వృథాగా పోతున్న గోదావరి జలాలు - దుండగుల పనేనని రైతుల ఆరోపణలు - విచారణ చేపడుతున్న నీటిపారుదలశాఖ

Mallanna Sagar Project Sub Canal Distributary Water Issue
Mallanna Sagar Project Sub Canal Distributary Water Issue (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 14, 2025, 5:47 PM IST

Mallanna Sagar Project Sub Canal Distributary Water Issue : సిద్దిపేట జిల్లా దుబ్బాక పురపాలికలోని మల్లయ్య పల్లి శివారులో మల్లన్న సాగర్ జలాశయ 14.5 కిలోమీటర్ల ఉప కాలువ 4 ఎల్ డిస్ట్రిబ్యూటరీ కాలువకు గండి పడింది. కాలువ నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఫలితంగా యాసంగి కోసం వదిలిన గోదావరి జలాలు వృథాగా పోతున్నాయి. యాసంగి సీజన్‌లో సాగునీరు అందించడానికి ప్రభుత్వం ఇటీవల నీటిని విడుదల చేసింది. ఈ క్రమంలో బలవంతపూర్, చెల్లాపూర్, మల్లయ్యపల్లి, కమ్మర్ పల్లి, పోతారం, అచ్చుమాయపల్లి, గంభీర్ పూర్ గ్రామాల మీదుగా కాలువ ద్వారా సాగునీరు అందుతుంది. కాలువను కొంతమంది దుండగులు కావాలనే ధ్వంసం చేశారని ఆయా గ్రామాలకు రైతులు ఆరోపిస్తున్నారు.

మరికొంతమంది రైతులు మాత్రం బలహీనమైన ఆనకట్ట, నీటి ప్రవాహం తాకిడికి కాలువ కొట్టుకుపోయిందని వాదిస్తున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామన్నారు. గోదావరి నీళ్లు ఉధృతంగా ప్రవహించడంతో దుబ్బాక - మల్లయ్యపల్లి గ్రామాల మీద మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాకపోకలను మళ్లించడానికి స్థానిక పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

మల్లన్నసాగర్‌ కాలువకు గండి - వృథాగా పోతున్న గోదావరి జలాలు (ETV Bharat)

బూరుగడ్డ నల్ల చెరువుకు మళ్లీ గండి - నరకప్రాయంగా ప్రయాణం - Road Damage At Nallacheruvu

మరమ్మతు పూర్తి చేసి నీళ్లు వదిలారో లేదో మళ్లీ గండి పడింది - Paleru Left Canal Breached

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.