SOT Police Seized 600 KG Adulterated Paneer in Secunderabad : సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా నకిలీ పన్నీరు పట్టుబడింది. పక్కా సమాచారంతో ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించగా, మచ్చ బొల్లారంలోని ఓ గోదాములో 600 కిలోల నకిలీ పన్నీరు బయటపడింది. దీంతో ఎస్వోటీ పోలీసులు 600 కిలోల నకిలీ పన్నీర్ జప్తు చేశారు. అలాగే గోదామును సీజ్ చేశారు.
పన్నీరు శాంపిల్స్‌ను ల్యాబ్ పంపిన ఎస్వోటీ పోలీసులు : నటరాజ్ మిల్క్ ట్రేడర్స్ పేరుతో గత కొన్నాళ్లుగా యథేచ్చగా నకిలీ పన్నీరు క్రయ విక్రయాలు జరుగుతున్నట్లు ఎస్వోటీ పోలీసులు తెలిపారు. పాల పౌడర్, పామాయిల్, ఇతర రసాయనాలను ఉపయోగించి పన్నీరు తయారు చేస్తున్నట్లు వారు గుర్తించారు. నకిలీ పన్నీర్‌ను ఓ గోదాము కేంద్రంగా తయారు చేస్తూ గుట్టుచప్పుడు కాకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బేగంబజార్‌కు చెందిన విశాల్ అనే వ్యక్తి ఈ నకిలీ పన్నీరు తయారి కేంద్రాన్ని నడిపిస్తున్నట్లు గుర్తించారు. ఎస్వోటీ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని అల్వాల్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన అల్వాల్ పోలీసులు, వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నారు. నకిలీ పన్నీరు శాంపిల్స్‌ను తీసుకున్న ఎస్వోటీ పోలీసులు ల్యాబ్‌కు పంపారు.
ప్లమ్ కేక్‌లో రమ్! - ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడ్డ బాగోతం
కిచెన్‌లో బొద్దింకలు, ఎలుకలు - ఆ బేకరీలో కేకులు తింటే హాస్పిటల్‌కు వెళ్లడం గ్యారెంటీ!