ETV Bharat / offbeat

దేవభూమికి IRCTC సూపర్ ప్యాకేజీ - తక్కువ ధరకే 8 రోజుల టూర్! - GREEN TRIANGLE OF UTTARAKHAND

-తక్కువ ధరకే ఉత్తరాఖండ్ చుట్టేసి రావొచ్చు -ఒకే టూర్​లో అటు ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఇటు పర్యాటక ప్రాంతాలు

IRCTC Green Triangle of Uttarakhand Package
IRCTC Green Triangle of Uttarakhand Package (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 25, 2024, 3:12 PM IST

IRCTC Green Triangle of Uttarakhand Package : దేవభూమి ఉత్తరాఖండ్​ ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ప్రముఖ దేవాలయాలు, మతిపోగొట్టే కొండలు, లోయలు, రమ్యమనోహరమైన లొకేషన్లకు ఉత్తరాఖండ్​ పెట్టింది పేరు. అందుకే ఈ దేవభూమిని దర్శించుకోవాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. అందులో మీరు కూడా ఉన్నారా? అయితే మీలాంటి వారి కోసం ఇండియన్​ రైల్వే క్యాటరింగ్​ అండ్​ టూరిజం కార్పొరేషన్ అద్భుతమైన టూర్​ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఒకే టూర్​లో అటు ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఇటు పర్యాటక ప్రదేశాలు చూసేలా ప్యాకేజీని ఆపరేట్​ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ ధర ఎంత? ఏఏ ప్రదేశాలు కవర్​ అవుతాయి? ప్రయాణం ఎప్పుడు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

IRCTC టూరిజం "గ్రీన్​ ట్రయాంగిల్​ ఆఫ్​ ఉత్తరాఖండ్"​ పేరుతో ​ప్యాకేజీని తీసుకొచ్చింది. మొత్తం 7 రాత్రులు, 8 పగళ్లుగా ఈ టూర్​ ఉంటుంది. హైదరాబాద్​ నుంచి ట్రైన్​ జర్నీ ద్వారా ఈ టూర్​ ఆపరేట్​ చేస్తున్నారు. నైనితాల్​, అల్మోరా, ముక్తేశ్వర్​, దిల్లీ వంటి ప్రదేశాలు ఈ ప్యాకేజీలో భాగంగా విజిట్​ చేయవచ్చు. ప్రకటించిన తేదీల్లో ప్రతీ మంగళవారం అందుబాటులో ఉంటుంది. ప్రయాణ వివరాలివే..

  • మొదటి రోజు ఉదయం 6 గంటలకు హైదరాబాద్​ నుంచి ట్రైన్(నెం 12723)​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఆ రోజు మొత్తం ప్రయాణం ఉంటుంది.
  • రెండో రోజు ఉదయానికి దిల్లీ చేరుకుంటారు. అక్కడి నుంచి పిక్​​ చేసుకుని హోటల్​కు చేరుకుంటారు. అక్కడ ఫ్రెషప్​ అయ్యి బ్రేక్​ఫాస్ట్ పూర్తైన తర్వాత చెక్​ అవుట్​ అయ్యి..​ కార్బెట్​ బయలుదేరుతారు. సాయంత్రానికి అక్కడికి చేరుకుని హోటల్లో చెకిన్​ అయ్యి ఆ నైట్​కు అక్కడే స్టే చేస్తారు.
  • మూడో రోజు ఉదయం బ్రేక్​ఫాస్ట్​ తర్వాత సఫారీ, కార్బెట్​ వాటర్​ ఫాల్స్​ సందర్శిస్తారు. ఆ తర్వాత నైనితాల్​ స్టార్ట్​ అవుతారు. అక్కడికి రీచ్​ అయిన తర్వాత హోటల్​లో చెకిన్​ అయ్యి ఆరోజు అక్కడే స్టే చేస్తారు.
  • నాలుగో రోజు మొత్తం నైనితాల్​లోని పలు పర్యాటక ప్రదేశాలను విజిట్​ చేసిన తర్వాత హోటల్​కు చేరుకుని ఆ రాత్రికి అక్కడే ఉంటారు.
  • ఐదో రోజు అల్మోరా, ముక్తేశ్వర్​లోని పలు ప్రదేశాలు విజిట్​ చేస్తారు. ఆ రాత్రి కూడా నైనితాల్​లోనే బస చేస్తారు.
  • ఆరో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి దిల్లీకి బయలుదేరుతారు. అక్కడకు చేరుకున్న తర్వాత అక్షరధామ్​ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ రాత్రికి దిల్లీలోనే స్టే చేస్తారు.
  • ఏడో రోజు హోటల్​ నుంచి చెక్​ అవుట్​ అయ్యి కుతుబ్​ మినార్​, లోటస్​ టెంపుల్​ సందర్శిస్తారు. అనంతరం దిల్లీ రైల్వే స్టేషన్​లో డ్రాప్​ చేస్తారు. అక్కడి నుంచి సాయంత్రం 4 గంటలకు దిల్లీ నుంచి ట్రైన్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది. ఆ రాత్రంతా ప్రయాణం ఉంటుంది.
  • ఎనిమిదో రోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో టూర్​ ముగుస్తుంది.

ధర వివరాలు చూస్తే :

1 నుంచి ముగ్గురు ప్రయాణికులకు..

కంఫర్ట్​లో(3A) సింగిల్​ షేరింగ్​కు రూ.60,910, డబుల్​ షేరింగ్​కు రూ.34,480, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.27,020 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.19,960, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.18,440 పే చేయాలి.

స్టాండర్డ్​(SL)లో సింగిల్​ షేరింగ్​కు రూ.58,220, డబుల్​ షేరింగ్​కు రూ.31,630, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.24,120 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.16,970, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.15,440 పే చేయాలి.

4 నుంచి ఆరుగురు ప్రయాణికులకు:

కంఫర్ట్​లో(3A) డబుల్​ షేరింగ్​కు రూ.29,730, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకిరూ.25,530 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.19,960, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.18,440 పే చేయాలి.

స్టాండర్డ్​(SL) డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.26,870, ట్రిపుల్​ షేరింగ్​కు రూ.22,640 చెల్లించాలి. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.16,970, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.15,440 పే చేయాలి.

ప్యాకేజీలో ఉండేవి ఇవే:

  • ట్రైన్​ టికెట్లు(హైదరాబాద్​ - దిల్లీ - హైదరాబాద్​)
  • హోటల్​ అకామిడేషన్​
  • 6 బ్రేక్​ఫాస్ట్​లు
  • సైట్​ సీయింగ్​ కోసం ప్యాకేజీని బట్టి వెహికల్​
  • ట్రావెల్​ ఇన్సూరెన్స్​
  • ప్రస్తుతం ఈ ప్యాకేజీ జనవరి 7వ​ తేదీన అందుబాటులో ఉంది. ఇతర తేదీలు కూడా ఉన్నాయి.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి..

గాడ్స్​ ఓన్​ కంట్రీకి IRCTC సూపర్ ప్యాకేజీ - కేరళ ప్రకృతి సోయగాల్లో తడిసి ముద్దైపోవచ్చు!

IRCTC "టెంపుల్ రన్" - కేరళ, తమిళనాడులో 7 రోజులపాటు దివ్యదర్శనాలు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.