Carrot can Reduce Sugar Levels New Research Revealed : షుగర్ ఎటాక్ అయ్యిందంటే జీవితంలో ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది. తిండి విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. జీవనశైలిలో చాలా మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. తినే తిండిలో మార్పులు చేసుకుంటూ, లైఫ్ లాంగ్ మందులు వాడుకోవడం మినహా, మరో మార్గం లేదని నిపుణులు చెబుతుంటారు. అయితే, క్యారెట్ తినడం ద్వారా సమస్యను చాలా వరకు అదుపులో ఉంచుకోవచ్చని అంటున్నారు.
చాపకింద నీరులా ఒంట్లోకి చేరి, జీవితాన్ని సర్వనాశనం చేస్తున్న షుగర్ పట్ల నిర్లక్ష్యంగా ఉంటే, చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెజబ్బులు మొదలు, కిడ్నీ సమస్యలు, కంటి చూపు తగ్గిపోవడం వంటి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. పరిస్థితి అంతదాకా వెళ్లకూడదంటే, రక్తంలో చక్కెర స్థాయులు పెరగకుండా చూసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. షుగర్ లెవల్స్ పెరగకుండా ఉండాలంటే, చికిత్సతోపాటూ సరైన ఆహారపు అలవాట్లు తప్పకుండా పాటించాల్సిందేనని చెబుతుంటారు.
ఆకు పచ్చని తాజా కాయగూరలు, నట్స్ వంటివి ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తుంటారు. అయితే, సదరన్ డెన్మార్క్, కోపెన్‌హాగన్ యూనివర్సిటీలు ఓ సరికొత్త విషయం చెప్పాయి. టైప్-2 డయాబెటిస్‌ను అదుపు చేయడంలో క్యారెట్ ఎంతో కీలకంగా పనిచేస్తుందని వెల్లడించాయి. దీనికి ఆ వర్సిటీల పరిశోధకులు చెప్పేది ఏమంటే, షుగర్ వ్యాధిని ఎదుర్కోవడానికి జీర్ణవ్యవస్థ చాలా ఆరోగ్యంగా ఉండాలని చెబుతున్నారు. క్యారెట్లకు ఆ శక్తి ఉందట. ఇందులో ఉండే బయోయాక్టివ్ కాంపౌండ్లకి ఆ పవర్ ఉందట. ఇవి మన జీర్ణవ్యవస్థను హెల్దీగా ఉంచడానికి ఎంతో మేలు చేస్తాయట. పొట్ట ఆరోగ్యాన్ని కాపాడటం వల్ల, షుగర్ ట్రీట్మెంట్ నూటికినూరు శాతం ఫలితం ఇస్తుందట. అందువల్ల క్యారెట్లను డైలీ ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
మరి, ఈ క్యారెట్లను ఎలా తీసుకోవాలి అన్నప్పుడు, ఎలా తీసుకున్నా మంచిదేనని పరిశోధకులు సూచిస్తున్నారు. ఉడకబెట్టి తిన్నా, వేయించి తిన్నా, పచ్చివి తీసుకున్నా మంచిదేనట. ఏ రూపంలో తీసుకున్నప్పటికీ చక్కటి ఫలితం ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.
ఆహారంతోపాటు వ్యాయమం రెగ్యులర్‌గా చేయాలన్న విషయం తెలిసిందే. కాంబినేషన్ ఆఫ్ ఎరోబిక్ అండ్ రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్లు చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి అవకాశం ఉంటుందని ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి చెబుతున్నారు. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయని సూచిస్తున్నారు. జిమ్ చేసేటప్పుడు డయాబెటిస్ బాధితులు సరైన షూస్ ధరించాలని చెబుతున్నారు. తద్వారా కాళ్లకు పుండ్లు పడకుండా చూసుకోవచ్చని అంటున్నారు.