ETV Bharat / entertainment

'మా నాన్న జీవించి ఉంటే బాగుండేది'- పద్మ అవార్డ్​పై అజిత్ ఎమోషనల్ - AJITH PADMA AWARD

కోలీవుడ్ స్టార్​ అజిత్​కు పద్మ పురస్కారం- హీరో ఎమోషనల్ ట్వీట్

Ajith Padma Award
Ajith Padma Award (Source : ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2025, 10:28 AM IST

Ajith Padma Award : కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్​ కుమార్​కు పుద్మ పురస్కారం దక్కింది. సినీ పరిశ్రమకు చేసిన సేవలకుగాను కేంద్రం ఆయన్ను దేశంలోనే మూడో అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. పద్మభూషణ్‌తో సత్కరించింది. దీనిపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాస్త ఎమోషనల్ అయ్యారు. ఈ సమయంలో తన తండ్రి ఉంటే బాగుండేదని ఎక్స్​ (ట్విట్టర్​)లో పోస్ట్ షేర్ చేశారు.

'నన్ను పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపిక చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నా. భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ గుర్తింపు వ్యక్తిగత ప్రశంస మాత్రమే కాదు. ఎంతోమంది సమష్టి కృషి, మద్దతుకు నిదర్శనమని భావిస్తున్నాను. కెరీర్​లో ఇండస్ట్రీ నుంచి నాకు ఎంతో మద్దతు దక్కింది. పరిశ్రమలో నాకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. వారందరి ప్రేరణ, సహకారం, మద్దతు కారణంగానే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. ఎన్నో ఏళ్లుగా రేసింగ్‌, షూటింగ్‌లో నాకు సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు'

ఆయన ఉంటే బాగుండు
'ఈ రోజును చూసేందుకు నా తండ్రి జీవించి ఉంటే ఎంతో బాగుండేది. నన్ను చూసి ఆయన గర్వపడేవారు. భౌతికంగా మా మధ్య లేకపోయినా, నేటికీ ఆయన నాతోనే ఉన్నారని అనుకుంటున్నా. నా భార్య షాలిని గత 25ఏళ్ల నుంచి నాకు సహకారంగా ఉంది. ఆమె వల్లే ఇలా ఉన్నాను. నా విజయానికి, సంతోషానికి ఆమె ప్రధాన కారణం. చివరగా నా అభిమానుల గురించి చెప్పాలి. మీ అంచంచలమైన ప్రేమ, మద్దతు కారణంగానే నేను అంకితభావంతో పనిచేయగలుగుతున్నా. ఈ అవార్డు మీ అందరిది. మీ అందరికీ వినోదాన్ని అందించడానికి ఇలానే కష్టపడతాను' అని అజిత్ పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.