ETV Bharat / spiritual

శివాలయంలో ఇలా ప్రదక్షిణలు చేస్తే- సమస్త కోరికలు నెరవేరడం తథ్యం! - PRADAKSHINA RULES IN SIVA TEMPLES

శివాలయంలో ప్రదక్షిణలు చేస్తుంటారా? ఈ నియమాలు పాటించడం తప్పనిసరి!

Etv Bharat
Etv Bharat (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2025, 5:01 AM IST

Pradakshina Rules In Siva Temples : సాధారణంగా ఏ గుడికి వెళ్లినా ప్రదక్షిణాలు తప్పకుండా చేస్తాం. కనీసం మూడు ప్రదక్షిణలతో మొదలు పెట్టి 108 ప్రదక్షిణాలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే శివాలయంలో చేసే ప్రదక్షిణకు, మిగతా దేవాలయాలలో చేసే ప్రదక్షిణలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. అది ఏమిటో ఈ కథనంలో తెలుసుకుందాం.

శివాలయంలో ప్రదక్షిణలు ఇలా చేయకూడదు!
లింగపురాణం ప్రకారం ఇతర దేవాలయాలలో చేసిన విధంగా ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. శివాలయంలో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో లింగపురాణంలో స్పష్టంగా వివరించి ఉంది.

సోమసూత్ర ప్రదక్షిణ
శివాలయంలో చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణ అని అంటారు. ఈ చండి ప్రదక్షిణ చేయడం వలన ఎలాంటి ఫలితాలు పొందవచ్చునో పురాణాల్లో వివరంగా పేర్కొన్నారు. లింగపురాణంలో శివాలయంలో చేయవలసిన ప్రదక్షిణ గురించి ఈ విధంగా వివరించారు.

ఇలా మొదలు పెట్టాలి
శివాలయంలో ధ్వజస్తంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి చండీశ్వరుని వరకు వెళ్లాలి. చండీశ్వరుని దర్శించుకొని అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగాలి. ఆ తరువాత మళ్లీ ప్రదక్షిణ మొదలుపెట్టి సోమసూత్రం అభిషేక జలం బయటకు పోవు దారి వరకు వెళ్లి తిరిగి ధ్వజస్తంభం దగ్గరకు రావాలి. అలా వస్తే ఒక ప్రదక్షిణ పూర్తి అవుతుంది. వెనుదిరిగి నందీశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లుగా భావించాలి.

ప్రమదగణాలు ఇక్కడే
ఈ విధం చేసే ప్రదక్షిణ చండి ప్రదక్షిణ లేదా సోమసూత్ర ప్రదక్షిణము అని పేరు. శివ ప్రదక్షిణలో సోమసూత్రాన్ని దాటరాదు. ఎందుకంటే శివునికి అభిషేకం చేసిన జలము సోమసూత్రం నుంచే బయటకు పోతుంది. అంతేకాక అక్కడ ప్రమదగణాలు కొలువై ఉంటారు.

ఒకే ఒక్క ప్రదక్షిణ 10వేల ప్రదక్షిణలతో సమానం
శివాలయంలో ఈ విధంగా ఒకసారి చేసే ప్రదక్షిణం సాధారణ ప్రదక్షిణాల కంటే పదివేల ప్రదక్షిణలతో సమానమని లింగ పురాణంలో వివరించారు. ఇలా మూడు ప్రదక్షిణలు చేయాలి. అయితే పొరపాటున కూడా నంది శివునికి మధ్యలో నడవకూడదు. ఎందుకంటే నందీశ్వరుని చూపులు సదా శివుని మీదే ఉంటాయి. అలాగే చాలా మంది ఏ దేవాలయంలో అయినా తెలియక చేసే పొరపాటు గర్భ గుడి వెనుక భాగాన్ని తాకి నమస్కారం చేస్తారు అలా చేయకూడదు.

ఇలా దర్శనం చేయరాదు
దేవాలయంలో దేవతా విగ్రహానికి ఎదురుగా నిలబడి దర్శనం చేయకూడదు. ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి. ఆ దైవిక శక్తి తరంగాలను భరించే శక్తి మానవమాత్రులకు ఉండదు. ఆ శక్తిని మనం భరించలేం. కనుక దేవాలయానికి వెళితే ఒక పక్కన నిలబడి దేవుని దర్శనం చేసుకోవాలి.

ఓం నమః శివాయ!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంత వరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.