JEE Mains 2025 Answer Key Released : జేఈఈ మెయిన్ తొలి విడత పేపర్-1 పరీక్షల ప్రాథమిక 'కీ'నిన్న విడుదల అయ్యింది. జనవరి 22 నుంచి 29 వరకు పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రాథమిక 'కీ' పై అభ్యంతరాలను ఈ నెల 6వ తేదీ రాత్రి 11.50 గంటల లోపు పంపవచ్చని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) వెల్లడించింది. విద్యార్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వెబ్‌సైట్లో పెట్టినట్లు తెలిపింది. జనవరి 23న తొలి విడత భౌతికశాస్త్రంలో ఒక ప్రశ్నను విరమించుకోగా, దానికి 4 మార్కులు కలుపుతారు. 28న సాయంత్రం విడతలోని భౌతికశాస్త్రంలో ఒక ప్రశ్నకు 2 సమాధానాలు మార్చారు. అందులో దేన్ని గుర్తించినా మార్కులు ఇస్తారు. తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా 295 వరకు మార్కులు రావొచ్చని జేఈఈ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 12వ తేదీలోపు పర్సంటైల్ స్కోర్‌ను వెల్లడిస్తామని జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) గతంలోనే ప్రకటించింది.
జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల - అప్పటి వరకు అభ్యంతరాల స్వీకరణ - JEE MAINS ANSWER KEY RELEASED
జేఈఈ మెయిన్ ప్రాథమిక కీ విడుదల - రేపటి వరకు అభ్యంతరాల స్వీకరణ - తెలుగు రాష్ట్రాల్లో గరిష్ఠంగా 295 వరకు మార్కులు రావొచ్చని జేఈఈ నిపుణుల అంచనా
Published : Feb 5, 2025, 7:02 AM IST