ETV Bharat / bharat

దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు- ఓటు వేసిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము - DELHI POLLS 2025 LIVE UPDATES

Delhi Assembly Polls 2025 Live Updates
Delhi Assembly Polls 2025 Live Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 5, 2025, 6:41 AM IST

Updated : Feb 5, 2025, 9:11 AM IST

Delhi Assembly Polls 2025 Live Updates : దిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 70 స్థానాలకు 699 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. దిల్లీలో మొత్తం 1.56 కోట్ల మంది ఓటర్లు ఉండగా, భారత ఎన్నికల సంఘం 13,766 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్‌ అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. బీజేపీ 68 స్థానాల్లో, ఆ పార్టీ మిత్రపక్షాలు జేడీయూ, లోక్‌జనశక్తి రాం విలాస్‌ పాసవాన్‌ పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేశాయి. పోలింగ్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీగా బలగాలను మోహరించారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఒకే విడతలో పోలింగ్‌ జరగనుండగా ఈనెల 8న ఓట్ల లెక్కింపు జరగనుంది.

LIVE FEED

9:08 AM, 5 Feb 2025 (IST)

  • కొనసాగుతున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు
  • దిల్లీ నిర్మాణ్‌భవన్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

8:32 AM, 5 Feb 2025 (IST)

ఓటు వేసిన రాహుల్‌ గాంధీ

  • కొనసాగుతున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌
  • నిర్మాణ్‌భవన్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌గాంధీ
  • ఓటు హక్కు వినియోగించుకున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌
  • శాంతినికేతన్‌ కేంద్రంలో ఓటు వేసిన కేంద్ర మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురీ
  • ఓటు వేసిన భారత ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ
  • సతీమణితో కలిసి ఓటు వేసిన ఆప్‌ నేత మనీశ్‌ సిసోదియా

8:18 AM, 5 Feb 2025 (IST)

సాంకేతిక లోపంతో నిలిచిన పోలింగ్‌

  • దిల్లీ మాదీపూర్‌ ప్రాంతంలో ఆగిపోయిన ఓటింగ్‌
  • వీవీ ప్యాట్‌లో సాంకేతిక లోపంతో నిలిచిన పోలింగ్‌
  • సాంకేతిక సమస్య పరిష్కరించాక ఓటు వేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి అల్కా లాంబా

7:29 AM, 5 Feb 2025 (IST)

ఓటు వేసిన దిల్లీ బీజేపీ అధ్యక్షుడు

  • కొనసాగుతున్న దిల్లీ ఎన్నికల పోలింగ్‌
  • మయూర్‌ విహార్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా దంపతులు

7:06 AM, 5 Feb 2025 (IST)

ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలి : మోదీ

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్య పండుగను బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. ఓటింగ్​లో కొత్త రికార్డును నెలకొల్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మొదటి సారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న వారికి ప్రధాని మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

7:01 AM, 5 Feb 2025 (IST)

పోలింగ్ ప్రారంభం

మొత్తం 70 స్థానాలకు జరుగుతున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది.

6:51 AM, 5 Feb 2025 (IST)

దిల్లీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అన్ని పోలింగ్​ కేంద్రాల్లో మాక్​ పోలింగ్​ ప్రారంభమైంది.

Last Updated : Feb 5, 2025, 9:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.