Trump On Gaza Strip : గాజాను స్వాధీనం చేసుకోవాలని ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. పాలస్తీనియన్లు అందరూ వేరే ఏదైనా ప్రాంతానికి శాశ్వతంగా వెళ్లి స్థిరపడితే గాజా ప్రాంతానికి అమెరికా బాధ్యత తీసుకుని, దాన్ని పునర్నిర్మించాలని కోరుతున్నట్లు చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై నెతన్యాహూతో ట్రంప్ చర్చించారు.
'పాలస్తీనియన్లు వేరే చోట స్థిరపడిన తర్వాత అమెరికా గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంటుంది. యుద్ధంలో భాగంగా అక్కడ ఇజ్రాయెల్ అమర్చిన అత్యంత ప్రమాదకరమైన బాంబులను, ఆయుధాలను నిర్వీర్యం చేసే బాధ్యతను అమెరికా తీసుకుంటుంది. అక్కడ ధ్వంసమైన భవనాలను పునరుద్ధరిస్తాం. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమిత సంఖ్యలో ఉద్యోగాలు, ఇళ్లు కల్పించవచ్చు' అని ట్రంప్ పేర్కొన్నారు.
#WATCH | US President Donald Trump says, " ...the us will take over the gaza strip and we will do a job with it. we'll own it and be responsible for dismantling all of the dangerous unexploded bombs and other weapons on the site and getting rid of the destroyed buildings. create… pic.twitter.com/Kx32qyXRnJ
— ANI (@ANI) February 5, 2025
ఖండించిన హమాస్
గాజాను స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్ ప్రకటించడాన్ని హమాస్ తీవ్రంగా ఖండించింది. ఆయన గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని మిలిటెంట్ సంస్థకు చెందిన సీనియర్ అధికారి సమీఅబు జుహ్రీ మండిపడ్డారు. మా ప్రజలు దీనిని ఆమోదించరాని, వారి భూమి నుంచి వారినే తరలించడమే కాకుండా, ఈ దురాక్రమణను అడ్డుకోవాల్సి ఉంది అని ఓ ప్రకటనలో తెలిపారు.
'వారికి అమెరికా మానవతా సాయం ఉండదు'
మరోవైపు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల ఏజెన్సీ నుంచి అమెరికా వైదొలుగుతుందని ట్రంప్ ప్రకటించారు. ఇక నుంచి పాలస్తీనా శరణార్థులకు అమెరికా మానవతాసాయాన్ని అందించబోదని స్పష్టం చేశారు. ఇప్పటికే యునెస్కో నుంచి వైదొలగాలని, అలాగే ఐరాసకు నిధులు ఆపేయాలన్న ప్రతిపాదనను సమీక్షించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు.
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన అమెరికా యూఎన్ సాధారణ నిర్వహణ బడ్జెట్‌లో 22 శాతం చెల్లిస్తోంది. ఆ తర్వాతి స్థానంలో చైనా ఉంది. ఐరాస దాని సామర్థ్యానికి అనుగుణంగా నడుచుకోవడం లేదని ట్రంప్ ఆరోపిస్తున్నారు.
'ఇరాన్ నాశనం చేయాలని ఆదేశాలిచ్చా'
ఇక తనను చంపాలని చూస్తే మీ నాశనాన్ని మీరు కోరుకున్నట్లే అవుతుందని ఇరాన్‌కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. 'నన్ను హత్య చేస్తే ఇరాన్‌ను సమూలంగా నాశనం చేయాలని ఇప్పటికే నా సలహాదారులకు ఆదేశాలిచ్చా. ఆ దేశంపై గరిష్ఠ ఒత్తిడి తీసుకొచ్చేలా మళ్లీ కఠిన విధానాల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చా. టెహ్రాన్ చమురు ఎగుమతులను పూర్తిగా సున్నాకు తీసుకొచ్చి ఆ దేశ అణ్వాయుధ తయారీ యత్నాలను అడ్డుకోవడమే లక్ష్యంగా వీటిని తీసుకొచ్చాం' అని ట్రంప్ పేర్కొన్నారు.
VIDEO | In the press conference with Israel President Benjamin Netanyahu, US President Donald Trump says, " we had fantastic talks. over the past four years, the us and israeli alliance has been tested more than any time in the history. but the bonds of friendship and affection… pic.twitter.com/gJAoxlmWqs
— Press Trust of India (@PTI_News) February 5, 2025