Telangana Govt Planning to Bring UTF : అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా నగరాభివృద్ధి కోసం అర్బన్ ట్రాన్స్‌పోర్టు ఫండ్‌ను ఏర్పాటు చేయనున్నారు. నగరంలోని ప్రజా రవాణాకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి కేటాయించనున్నారు. దీనికోసం కొన్ని రకాల సెస్‌లను వసూలు చేస్తారు. హైదరాబాద్ మహానగరం కూడా రోజురోజుకూ విస్తరించడం, ఓఆర్ఆర్ నుంచి ఆర్ఆర్ఆర్‌కు పెరగనుండటంతో భవిష్యత్తులో పెద్దఎత్తున మౌలిక వసతులు అవసరం కానున్నాయి. సింహ భాగం ఆదాయం నగరం నుంచే వస్తున్నప్పటికీ హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ నిధుల కొరత ఎదుర్కొంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక ప్రత్యేక నిధి ఉండటం వల్ల నగర ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టే వీలు ఉంటుంది. విధివిధానాలను ఖరారు చేసేందుకు హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలోని యునిఫైడ్ మెట్రోపాలిట్ ట్రాన్స్‌పోర్టు అథారిటీ అధ్యయనం చేయనుంది.
'ఫ్యూచర్ సిటీ'కి రాచబాట - కొంగరకలాన్ టు రీజనల్ రింగ్‌రోడ్డు వయా 'భావి నగరం'
- నగరంలో రోజు 3వేల కొత్త వాహనాలు విక్రయిస్తున్నారు. వీటికి సంబంధించి ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ రుసుం వస్తుంది. ఈ ఛార్జీల్లో కొంత సెస్ కింద యూటీఎఫ్‌కు మళ్లించే అవకాశముంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ప్రభుత్వం విధించే వివిధ రకాల సెస్‌లతో కొంత మొత్తం వేరుచేసే యేచనలో ఉంది.
- హెచ్‌ఎండీఏ చట్టం ప్రకారం మహానగర పరిధిలో చేపట్టే ప్రతి ప్రాజెక్టులో 1.25 శాతం హెచ్‌ఎండీఏకు డెవలప్‌మెంట్ ఛార్జీలు చెల్లించాలని నిబంధన ఉంది. కానీ ప్రస్తుతం ఇది అమలు కావడం లేదు.
- కొన్ని నగరాల్లో సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లు ఉంటాయి. ఆయా నగరాలకు ఆదాయాం తెచ్చే వ్యాపార, వాణిజ్య ప్రాంతాలు ఇవి. పీక్ అవర్‌లో సొంత వాహనాలతో వెళ్లాలంటే కొంత సెస్ చెల్లించాలి. ప్రస్తుతం అమీర్‌పేట్, సికింద్రాబాద్, అబిడ్స్, మాదాపూర్ లాంటి బీజీ సెంటర్లను సీబీడీలు మార్చి అక్కడ నుంచి ప్రైవేటు వెహికల్స్ నుంచి సెస్ రూపంలో కొంత వసూలు చేసే యోచనలో ఉంది.
- ఈ ప్రక్రియపై సమగ్ర సర్వే నిర్వహించిస ప్రాథమిక, మధ్యకాలిక, ధీర్ఘకాలిక అవసరాలకు తగినట్లు నిధిని ఎలా ఏర్పాటు చేయాలనే విషయమై కసరత్తు చేయనున్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ కాంప్రెన్సివ్ మొబిలిటీ ప్లాన్ రూపకల్పన చేస్తోంది.
15 ఏళ్లు దాటిన వాహనాలు ఇక తుక్కు తుక్కే! - సారథి.వాహన్ పోర్టల్‌లోకి తెలంగాణ