ETV Bharat / education-and-career

పార్ట్​టైమ్​ గవర్నమెంట్​ జాబ్ కావాలా? - ఈ పోర్టల్​ ఫాలోకండి - ప్రైవేటు జాబ్స్ కూడా! - NATIONAL CAREER SERVICE PORTAL

- జాబ్‌ కోసం వెతికే వాళ్లకు, జాబ్‌ ఇచ్చే వాళ్లకు వారధిగా "NCS పోర్టల్​" - రిజిస్టర్​ చేసుకున్న ఉద్యోగార్థులకు జాబ్ నోటిఫికేషన్స్

How to Register in National Career Service Portal
How to Register in National Career Service Portal (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 27, 2025, 3:28 PM IST

How to Register in National Career Service Portal: పోటీ ప్రపంచంలో నిరుద్యోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసేవారు కొందరైతే, చిన్నదో, పెద్దదో ఓ ఉద్యోగం ఉంటే చాలనుకునేవారు మరికొందరు. ఈ క్రమంలోనే వివిధ జాబ్​ పోర్టల్స్​లో తమ వివరాలతో రిజిస్టర్​ చేసుకుంటుంటారు. అయితే చాలా మందికి ప్రయివేట్​ జాబ్​ పోర్టల్స్​ గురించే తెలుసు. కానీ గవర్నమెంట్​ జాబ్​ పోర్టల్​ కూడా ఉంది! ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుసు.​ జాబ్‌ కోసం వెతికే వాళ్లకు, జాబ్‌ ఇచ్చే వాళ్లకు వారధిగా కేంద్ర ప్రభుత్వం ఓ పోర్టల్​ను తీసుకోచ్చింది. దాని పేరే "నేషనల్​ కెరీర్​ సర్వీస్​(NCS)". మరి ఈ పోర్టల్​ ఎవరికి ఉపయోగపడుతుంది? ఇందులో ఎలా రిజిస్టర్​ చేసుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల వివరాలు అందించాలనే లక్ష్యంతో సెంట్రల్​ గవర్నమెంట్ 2015లో మిషన్ మోడ్ ప్రాజెక్ట్‌లో భాగంగా ​"నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS)" పోర్టల్​ను ప్రారంభించింది. మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తోంది. యువత కోసం వివిధ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, కెరీర్ కౌన్సెలింగ్, ఒకేషనల్, స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు, ఇంటర్న్‌షిప్స్ వంటి వాటికి సమాచారం ఈ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. అనేక కంపెనీలు NCSలో రిజిస్టర్ అయ్యాయి. ఇవి ఎప్పటికప్పుడు ఉద్యోగ, ఇంటర్న్‌షిప్ వివరాలను పోర్టల్‌లో అప్‌డేట్ చేస్తుంటాయి.

ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి: ఈ పోర్టల్ లో గవర్నమెంట్​ జాబ్స్​, పార్ట్​ టైమ్​ గవర్నమెంట్ జాబ్స్, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉండే పలు ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాల వివరాలు ఉంటాయి. అలాగే వర్క్​ ఫ్రమ్​ హోమ్​, ఫుల్​ టైమ్​, పార్ట్​ టైమ్​, ఇంటర్న్​షిప్, అప్రెంటీస్​కు సంబంధించినవి కూడా ఉంటాయి. అయితే ఈ పోర్టల్​ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోవాలన్నా, జాబ్స్​కు అప్లై చేసుకోవాలన్నా రిజిస్టర్​ చేసుకోవాలి. అది ఎలాగంటే,​

రిజిస్ట్రేషన్​ ప్రాసెస్​ ఇదే:

  • ముందుగా నేషనల్​ కెరీర్​ సర్వీస్​ అధికారిక వెబ్​సైట్​ను ఓపెన్​ చేయాలి. https://www.ncs.gov.in/
  • హోమ్​ పేజీలో కుడివైపు కార్న్​లో Login, Register అనే రెండు ఆప్షన్​లు కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఇప్పటికే రిజిస్టర్​ చేసుకుంటే ఆ వివరాలతో లాగిన్​ అవ్వొచ్చు. లేదు కొత్త యూజర్​ అయితే మాత్రం Register ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • రిజిస్టర్​ యాజ్​ అని Job Seeker ఆప్షన్​ను సెలక్ట్​ చేసుకోవాలి.
  • యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ టైప్‌ అన్న చోట మీ UAN నెంబర్(EPFO)​/ పాన్‌ కార్డ్‌/UAN నెంబర్​(ఈ-శ్రమ్​)/మొబైల్​ నెంబర్​/ ఓటర్‌ ఐడీ కార్డ్‌/పాస్‌ పోర్ట్‌/డ్రైవింగ్‌ లైసెన్స్‌ సెలెక్ట్​ చేసుకుని దానికి సంబంధించిన వివరాలు, డేట్​ ఆఫ్​ బర్త్​ ఎంటర్​ చేసి Check ఆప్షన్​పై క్లిక్​ చేయాలి. దీనినే యూనిక్‌ ఐడెంటిఫికేసన్‌ నెంబర్‌గా గుర్తుంచుకోవాలి.
  • ఆ తర్వాత మీ వ్యక్తిగత వివరాలు, అడ్రెస్​, మెయిల్​ ఐడీ వివరాలు ఎంటర్​ చేయాలి. అలాగే పాస్​వర్డ్​ క్రియేట్​ చేసుకోవాలి. అనంతరం అక్కడ సరిపడా వివరాలు ఎంటర్​ చేసి క్యాప్చా కోడ్​ ఎంటర్​ చేసి Submit ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • రిజిస్ట్రేషన్‌ వివరాలు నమోదు చేశాక మీ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేసన్‌ పూర్తయ్యాక పోర్టల్‌లో లాగిన్‌ అవ్వాలి.

ఉద్యోగాలు ఎలా సెర్చ్​ చేసుకోవాలి? :

  • హోమ్​ పేజీలో కుడివైపు కార్న్​లో Login ఆప్షన్​పై క్లిక్​ చేసి వివరాలు(యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ నెంబర్​, పాస్​వర్డ్​) ఎంటర్​ చేసి సైన్​ ఇన్​ ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.​
  • పోర్టల్ లో లాగిన్ అయ్యాక కింద View/Update NCS Profile ఆప్షన్ కనిపిస్తుంది. దాని కింద ‘Search Job’ బటన్ పై క్లిక్ చేయాలి.
  • కీ వర్డ్, లోకేషన్, ఎక్స్​పెక్టెడ్ శాలరీ, ఆర్గనైజేషన్ టైప్ వంటి పలు వివరాలు ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వాత Search బటన్ పై క్లిక్ చేస్తే మీకు అందుబాటులో ఉన్న ఉద్యోగాల జాబితా కనిపిస్తుంది.
  • వాటిల్లో మీకు ఆసక్తి ఉన్న జాబ్ వద్ద ఉన్న అప్లై బటన్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత Apply ఆప్షన్​పై క్లిక్​ చేసి దరఖాస్తు చేసుకుంటే చాలు.
  • ఇందులో రిజిస్టర్​ చేసుకున్న ఉద్యోగార్థులకు జాబ్ నోటిఫికేషన్స్ కూడా వస్తాయి.
  • నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ పోర్టల్‌లో నమోదు చేసుకునేందుకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ISROలో ఇంటర్న్​షిప్ చేయాలా? అర్హతలు, దరఖాస్తు విధానం వివరాలు ఇవిగో!

టెన్త్​, ఐటీఐ అర్హతతో - రైల్వేలో 32,438 పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.