ETV Bharat / sports

5 వికెట్లు తీసినా నో యూజ్ - మూడో టీ20లో భారత్‌ ఓటమి - INDIA VS ENGLAND 3RD T20

మూడో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం - 26 పరుగుల తేడాతో భారత్‌ ఓటమి

India Vs England 3rd T20
India Vs England 3rd T20 (Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Jan 28, 2025, 11:01 PM IST

India Vs England 3rd T20 : హ్యాట్రిక్‌ విజయంతో దూసుకెళ్లాలనుకున్న టీమ్ఇండియాకు బ్రేక్ పడింది. అయిదు టీ20ల సిరీస్​లో భాగంగా మంగళవారం జరిగిన మూడో మ్యాచ్‌లో 26 పరుగుల తేడాతో ఇంగ్లిష్‌ జట్టు చేతిలో ఓటమిని చవి చూసింది. దీంతో భారత్‌ ఆధిక్యం 2-1కు పడిపోయింది. హార్దిక్‌ పాండ్య (40) మినహా ఇంకెవరూ టాప్‌స్కోర్​ చేయలేదు.

మ్యాచ్​ ఎలా సాగిదంటే?
టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన ఇంగ్లాండ్‌ టీమ్​ 20 ఓవర్లలో 9 వికెట్లకు 171 పరుగులు సాధించింది. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ (51), మిడిలార్డర్‌ బ్యాటర్‌ లివింగ్‌స్టన్‌ (43) మెరుపులు మెరిపించారు. ఇక టీమ్ఇండియా బౌలర్లలో వరుణ్‌ చక్రవర్తి (5/24) ఐదు వికెట్లతో అదరగొట్టాడు. హార్దిక్‌ పాండ్య (2/33), అక్షర్‌ పటేల్‌ (1/19) కూడా తమదైన శైలిలో ఆకట్టుకున్నారు.

అయితే 172 లక్ష్యంతో బరిలోకి దిగిన టీమ్ఇండియా అవసరం లేని షాట్లు ఆడి నిరాశపరిచింది. దీంతో క్రమంగా భారత్‌కు ఓటమి తప్పలేదు. గత మ్యాచ్‌లో మేటి ఇన్నింగ్స్‌తో మెరిసన తిలక్‌ (18)ను అద్భుతమైన బంతితో రషీద్‌ బౌల్డ్‌ చేయడం వల్ల మ్యాచ్‌లో కీలక మలుపుగా నిలిచింది. అంతకంటే ముందు అభిషేక్‌ శర్మ (24), సంజు శాంసన్‌ (3), సూర్యకుమార్ యాదవ్ (14) కూడా అంతంతమాత్రంగానే ఆడారు. దీంతో 48/3తో కష్టాల్లో పడ్డ జట్టును, హార్దిక్, తిలక్‌ ఆదుకోవాలని చూసినప్పటికీ అది

రెండో టీ20లో తిలక్‌తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పిన సుందర్‌ (6) ఈసారి క్రీజులో ఉన్నంతసేపు ఆపసోపాలు పడ్డాడు. అతడి ప్రయాసకు ఒవర్టన్‌ తెరదించాడు. తర్వాత అక్షర్‌ (15) సహకారంతో హార్దిక్‌ పోరాడాడు. క్రీజులో కుదురుకున్నాక ఇద్దరూ బ్యాట్లు ఝళిపించడం వల్ల భారత్‌ పోటీలోకి వచ్చింది. 17 ఓవర్లకు స్కోరు 122/5. చివరి 3 ఓవర్లలో 50 పరుగులు చేయాల్సి ఉంది. 18వ ఓవర్‌ (ఆర్చర్‌) రెండో బంతికి అక్షర్, 19వ ఓవర్‌ (ఒవర్టన్‌) తొలి బంతికి హార్దిక్‌ ఔటైపోవడం వల్ల భారత్‌ ఆశలకు తెరపడినట్లు అయ్యింది.

ఐసీసీ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌గా బుమ్రా- ఫస్ట్ ఇండియన్ పేసర్‌గా రికార్డ్​

గంభీర్ పెర్ఫామెన్స్​పై బీసీసీఐ రివ్యూ - 'అప్పటివరకే టైమ్- లేదంటే వేటు తప్పదు!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.