ETV Bharat / spiritual

మోక్షం ప్రసాదించే 'చొల్లంగి అమావాస్య' స్నానం - గ్రామం పేరుతో ఏర్పడ్డ ఈ అమావాస్య విశిష్టత ఇదే? - CHOLLANGI AMAVASYA IN 2025 DATE

ఒక గ్రామంతో పేరుతో ఉన్న ఈ అమావాస్య వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు ఇవే!

Chollangi Amavasya In 2025 Date
Chollangi Amavasya In 2025 Date (ETV Bharat, Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 28, 2025, 12:27 PM IST

Chollangi Amavasya In 2025 Date : గోదావరి నది బంగాళాఖాతంలో కలిసే పవిత్ర సాగర సంగమ ప్రదేశంలో ఉన్న చిన్న గ్రామమే చొల్లంగి. ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఈ గ్రామం వద్ద గోదావరి నది బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ సంగమ ప్రదేశానికి చొల్లంగి అని పేరు. చొల్లంగి అమావాస్య రోజు ఈ సంగమ ప్రాంతంలో భక్తులు పవిత్ర స్నానాలు చేస్తారు కాబట్టి ఈ అమావాస్యకు చొల్లంగి అమావాస్య అనే పేరు వచ్చింది. చొల్లంగి అమావాస్యను మౌని అమావాస్య అని కూడా అంటారు.

చొల్లంగి అమావాస్య విశిష్టత
పుష్య బహుళ అమావాస్యను చొల్లంగి అమావాస్య అని, మౌని అమావాస్య అని అంటారు. పురాణాల ప్రకారం అమావాస్య రోజున గంగ ఆకాశం నుంచి అమృతంగా మారి భూమిపైకి వస్తుందని నమ్మకం. అందుకే ఈ రోజు గంగా నదిలో స్నానం పుణ్యమని భావిస్తారు. అందుకే ఈ చొల్లంగి అమావాస్య చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఈ ఏడాది చొల్లంగి అమావాస్య ఎప్పుడొచ్చింది, ఆ రోజున ఎలాంటి పవిత్ర కార్యాలు చేయాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చొల్లంగి అమావాస్య ఎప్పుడు
తెలుగు పంచాంగం ప్రకారం జనవరి 28 వ తేదీ మంగళవారం రాత్రి 7:30 నుంచి పుష్య బహుళ అమావాస్య తిథి మొదలై మరుసటి రోజు అంటే జనవరి 29 వ తేదీ సాయంత్రం 6:51 నిమిషాల వరకు ఉంది. సూర్యోదయంతో అమావాస్య స్నానాలు చేయాలి కాబట్టి జనవరి 29 వ తేదీనే చొల్లంగి అమావాస్య జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుఝాము 3:30 గంటల నుంచి పుణ్యస్నానాలు చేయడానికి శుభసమయం.

చొల్లంగి అమావాస్య రోజు ఏమి చేయాలి
ఈ రోజు తెల్లవారుఝామున నదీ స్నానం కానీ, సముద్ర స్నానం కానీ చేయాలి. విశేషించి ఈ రోజు చొల్లంగి సాగర సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. నదీ స్నానం చేయడానికి వీలు కానీ వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో పుణ్యనదులను ఆవాహన చేసుకొని స్నానం చేస్తే నదీ స్నానం చేసిన ఫలితం లభిస్తుంది.

పితృదేవతల ప్రీతి కోసం ఇలా చెయ్యాలి
చొల్లంగి అమావాస్య రోజు పితృ దేవతల ప్రీతి కోసం శ్రాద్ధ కర్మలు, తర్పణం చేయాలి. ఇలా చేయడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని శాస్త్ర వచనం.

దానధర్మాలు
చొల్లంగి అమావాస్య రోజు నదీ స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచిన తరువాత నది ఒడ్డునే చేసే దానధర్మాలకు మామూలు కంటే కోటిరెట్ల అధిక ఫలం లభిస్తుంది. ఈ రోజున బ్రాహ్మణులకు అన్నదానం, వస్త్రదానం, గోదానం, ఛత్రదానం, జలపాత్ర, పాదరక్షలు మొదలైనవి దానం చేయడం వలన పితృదేవతలు సంతోషిస్తారు. అలాగే ఈ రోజు కొత్త రాగి పాత్రలో నిండుగా నువ్వులు పోసి పాత్రతో సహా బ్రాహ్మణులకు దానం చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయని విశ్వాసం.

అరుదైన యోగాలు
చొల్లంగి అమావాస్య రోజు మాలవ్య యోగం, అమృత సిద్ధి యోగం వంటి అరుదైన యోగాలు కూడా ఏర్పడనున్నాయి.

చొల్లంగి అమావాస్య పూజా విధానం
ఈ రోజు నిత్యపూజలు యథావిధిగా చేసుకోవాలి. శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించి నువ్వులు బెల్లం నైవేద్యంగా సమర్పించాలి.

చంద్ర దోష నివారణకు ఇలా చేయాలి
సాధారణంగా అమావాస్య రోజు చంద్రకళలు బలహీనంగా ఉంటాయి. అందుకే ఈ రోజు వ్యక్తిగత జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నవారు ఈ పరిహారాలు తప్పకుండా చేయాలి.

  • ఒక తెల్లని నూతన వస్త్రంలో బియ్యం పోసి దానిపై వెండితో తయారైన చంద్రుని ఉంచి దక్షిణ తాంబూలాలతో బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి.
  • నదీ జలాల్లో తెల్లని పువ్వులు, ఆవు నేతితో చేసిన దీపాన్ని విడిచి పెట్టాలి. కాలసర్ప దోషాలు పోగొట్టుకోడానికి ఇలా చేయాలి
  • వెండి నాగుపామును పూజించి ప్రవహించే నీటిలో సమర్పించడం వల్ల కాలసర్ప దోషం వంటివి తొలగిపోతాయి.

ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి ఇలా చేయాలి
కుంకుమపువ్వు కలిపిన బియ్యాన్ని దక్షిణ ముఖంగా ఉండే శంఖంలో వేయాలి. అనంతరం నేతి దీపం వెలిగించి, జపమాలతో ఓం శ్రీ మహాలక్ష్మిదేవ్యై నమః మంత్రాన్ని 11 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

మహా కుంభమేళా రాజ స్నానం
చొల్లంగి లేదా మౌని అమావాస్య రోజు మహా కుంభమేళాలో అత్యంత ముఖ్యమైన మూడవ రాజ స్నానం జరుగనుంది. ఈ సందర్భంగా కొన్ని కోట్ల మంది ప్రయాగరాజ్ లో పుణ్య స్నానాలు ఆచరించనున్నారు. రానున్న మౌని అమావాస్య రోజు మనం కూడా స్నాన దాన జపాలతో మోక్షాన్ని పొందుదాం.

శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.