ETV Bharat / bharat

'జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయండి'- సీబీఐ కోర్ట్​ ఆదేశం - JAYALALITHAA ASSETS CASE UPDATES

జయలలిత ఆస్తుల కేసు- జప్తు చేసిన ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని సీబీఐ కోర్ట్ ఆదేశం

Jayalalithaa
Jayalalithaa (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2025, 11:04 PM IST

Jayalalithaa Assets Case Updates : తమిళనాడు మాజీ సీఎం, దివంగత నటి జయలలితకు చెందిన జప్తు చేసిన ఆస్తులన్నింటినీ ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలని సీబీఐ కోర్ట్ ఆదేశించింది. జయలలిత మేనకోడలు జె.దీప, మేనల్లుడు జె.దీపక్​ దాఖలు చేసిన పిటిషన్​ను జనవరి 1న కర్ణాటక హైకోర్ట్ తోసిపుచ్చిన తరువాత సీబీఐ కోర్ట్ ఈ ఆదేశాలు జారీ చేసింది.

జయలలిత అదాయవనరులకు మించి ఆస్తులు కూడబట్టిన కేసులో దోషిగా తేలారు. కానీ 2016తో ఆమె మరణించిన తరువాత ఆ కేసు విచారణను కోర్టు నిలిపివేసింది. అయితే ఆమె ఆస్తుల జప్తును సుప్రీంకోర్ట్ సమర్ధించింది. అయితే జయలలితపై ఉన్న కేసును కొట్టివేసినందున, ఆమె ఆస్తులను జప్తు చేయకూడదని ఆమెకు చెందిన బంధువులు వాదించారు. అయితే ప్రత్యేక కోర్ట్​ ఈ కేసులో ఇతరులను దోషులుగా నిర్ధరించిందని, అందువల్ల ఆస్తుల జప్తు చెల్లుబాటు అవుతుందని హైకోర్ట్​ తీర్పు ఇచ్చింది.

జయలలిత ఆస్తుల వివరాలు
చెన్నైలోని పోయెస్ గార్డెన్​లోని జయలలిత నివాసం- వేద నిలయం, డీఏ కేసుతో ముడిపడి ఉన్న అనేక భూములు, ఎస్టేట్​లు ఉన్నాయి. అలాగే ఆమె పేరుమీదున్న బ్యాంక్​ డిపాజిట్లు, ఇతర ఆస్తులు ఉన్నాయి. ఇవికాక బంగారు ఆభరణాలు ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.