ETV Bharat / bharat

బడ్జెట్​ సమావేశాలకు అంతా రెడీ- కుంభమేళా VIP కల్చర్​పై చర్చకు విపక్షాల పట్టు! కేంద్రం ఎజెండా ఇదే! - BUDGET SESSION 2025

సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ బడ్జెట్​ సమావేశాలు - కేంద్రం ఎజెండాలో 16 కీలక బిల్లులు

Budget Session 2025
Budget Session 2025 (Getty Image, ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 30, 2025, 5:35 PM IST

Budget Session 2025 : పార్లమెంట్​ బడ్జెట్ సమావేశాలకు సర్వం సిద్ధమైంది. జనవరి 30 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లో ఆర్థిక బిల్లు, బ్యాంకింగ్ రెగ్యులేషన్స్, వక్ఫ్‌ సవరణ బిల్లుతో సహా మొత్తం 16 బిల్లులను పార్లమెంట్​లో ప్రవేశ పెట్టనున్నారు. రెండు విడతలు జరిగే ఈ సమావేశాలు తొలుత జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు జరగనున్నాయి. తొలిరోజు ఉభయ సభల ఉమ్మడి సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అదే 2024-25కు సంబంధించిన ఆర్థిక సర్వేను ప్రవేశ పెడతారు. ఫిబ్రవరి 1న 2025-26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత సమావేశాలు జరగనున్నాయి.

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేంద్రం గురువారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కేంద్రమంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్షానికి అందించింది. ఇందులో వక్ఫ్‌ సవరణ బిల్లు కూడా ఉంది. సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్షాలను కేంద్రం కోరింది. ముఖ్యమైన అంశాలను చర్చించేందుకు సిద్ధమని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. సభ సజావుగా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

వాటిపైనే విపక్షాలు ఫోకస్
మరోవైపు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష ఇండి కూటమి ప్రజలకు చెందిన అన్ని సమస్యలను లేవనెత్తుతుందని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. మహా కుంభమేళా తొక్కిసలాట ఘటన, వీఐపీ సంస్కృతి, నిరుద్యోగం పెరుగుదల, రైతుల దుస్థితిని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తామని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారీ తెలిపారు. ఇండి కూటమి పక్షాలను కలుపుకుకని సామాన్య ప్రజల సమస్యల్ని పార్లమెంటులో లేవనెత్తుతామని ఆయన చెప్పారు. కచ్చతీవు అంశాన్ని అన్నాడీఎంకే ప్రస్తావించింది. ఒడిశాకు ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌ను సభలో ప్రస్తావిస్తామని బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర చెప్పారు. వక్ఫ్‌ బిల్లుపై జేపీసీ నివేదికను వ్యతిరేకిస్తున్నట్లు పలు పార్టీలు వెల్లడించాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.