ETV Bharat / opinion

తగ్గుతున్న గనులు, ఏటేలా పెరుగుతున్న నష్టాలు - త్రిశంకుస్వర్గంలో కార్మికులు - SINGARENI MINES REDUCING

సింగరేణిలో క్రమంగా తగ్గుతున్న భూగర్భ గనులు - మూడేళ్లలో 10 గనులను మూసి వేసేందుకు రంగం సిద్ధం - గనులు తగ్గడంతో కార్మికుల్లో ఆందోళన

Underground Mines Gradually Decreasing In Singareni
Underground Mines Gradually Decreasing In Singareni (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 30, 2025, 10:32 PM IST

Underground Mines Gradually Decreasing In Singareni : సింగరేణిలో ఉపరితల గనులకు ప్రాధాన్యత పెరిగింది. కానీ, అది కార్మికుల్లో ఆందోళనకు కారణమైంది. కారణం భూగర్భ బొగ్గుగనుల స్థానంలో ఉపరితల గనులకు ప్రాధాన్యం ఇవ్వడం, ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉండడమే. ఓపెన్‌ కాస్ట్‌ గనుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో లక్షలాది మంది కార్మికులతో కళకళలాడిన సింగరేణి ప్రాంతాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరోవైపు భూగర్భజల వనరులు అడుగంటడంతో పాటు వ్యవసాయం కూడా గణనీయంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు సింగరేణి గనులు ఉపాధి కల్పించే కేంద్రాలు ఉండగా ఇప్పుడు కేవలం ఉత్పత్తి కేంద్రాలుగానే మిగిలిపోతున్నాయనేది కార్మికుల వాదన. మరి ఎందుకీ పరిస్థితి? కార్మికులకు కావాల్సిందేంటి?

తగ్గుతున్న కార్మికుల సంఖ్య : సింగరేణిలో భూగర్భ బొగ్గుగనుల స్థానంలో ఉపరితల గనులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు అధికారులు. దీంతో అత్యధిక మానవశక్తిని వినియోగించి బొగ్గు ఉత్పత్తి చేసిన భూగర్భ గనులు కనుమరుగు అవుతున్నాయి. వాటి స్థానంలో ఉపరితల గనులు ఏర్పాటు చేసి బొగ్గు ఉత్పత్తి చేపడుతున్నారు. గతంలో 56 భూగర్భ గనులుండగా వాటి సంఖ్య ఇప్పుడు 21కి పడిపోయింది. రానున్న కాలంలో మరింత తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. ఆ మేరకు కార్మికుల సంఖ్య కూడా తగ్గుతోంది.

భూగర్భ గనుల కంటే ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఎక్కువగా చేపట్టే అవకాశం ఉండటంతో యాజమాన్యం ఆ దిశగా చర్యలు తీసుకుంది. దీంతో పాటు కొత్త గనుల ఏర్పాటుకు కేంద్రం నూతన చట్టం తీసుకురావడంతో ఉన్న వాటినే సర్దుకుంటూ బొగ్గు ఉత్పత్తి దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. కొత్త గనులు ఏర్పాటు చేయాలంటే వేలంలో పాల్గొనాల్సి ఉంటుంది. కాగా ఇటీవలే సింగరేణి ప్రాంతాల్లోని 4 గనులకు కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహించింది. అందులో 2 గనులను ప్రైవేటు సంస్థలు దక్కించుకున్నాయి. సింగరేణి సంస్థ వేలంలో పాల్గొనకపోవడం వల్ల అవి బయటి వారి చేతుల్లోకి వెళ్లాయి. ఎలాంటి వేలం లేకుండా సింగరేణికి గనులు కేటాయించాలని కోరుతున్నప్పటికీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

గనుల స్థానంలో ఉపరితల గనులు ఏర్పాటు : సింగరేణి వ్యాప్తంగా 35 భూగర్భ గనులు కనిపించకుండా పోయాయి. తాజాగా బెల్లంపల్లి ఏరియాలోని శాంతిఖని గనిని కూడా ఉపరితలగనిగా మార్చేందుకు యాజమాన్యం ప్రణాళికలు చేసింది. రామగుండం రీజియన్‌లో జీడీకే-5, 5-ఎ, 6, 6-ఎ, 6-బి, 7, 7-ఎ, 8, 8-ఎ, 9, 10, 10-ఎ ఇలా మొత్తం 12 భూగర్భ గనులు లేకుండా పోయాయి. వాటి స్థానంలో ఓసీపీ-1, 2, 3, 5లుగా విస్తరించారు. భూగర్భ బొగ్గు గనుల్లో మిగిలిపోయిన నిక్షేపాలను పూర్తి స్థాయిలో వెలికి తీసేందుకు ఉపరితల గనులతోనే సాధ్యం అవుతుందని భావిస్తున్న సింగరేణి ఆదిశగా చర్యలు తీసుకుంది. బెల్లంపల్లి రీజియన్‌లోని గోలేటి, మాదారం, కేకే-1, ఆర్‌కే-1-ఎ, ఆర్‌కే-8, ఎస్‌ఆర్‌పీ-2, ఆర్‌కే-5 బి, ఆర్‌కే-5, 6, 7, న్యూటెక్‌ గనులు భవిష్యత్తు లో ఉపరితల గనిగా మారే అవకాశం ఉంది. కొత్తగూడెంలో వీకే-7, ఇల్లెందులో 21 ఇంక్లైన్‌లను మూసివేసి దాని స్థానంలో ఉపరితల గనిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కొత్తగా మరికొన్ని గనుల స్థానంలో ఉపరితల గనులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశారు.

అపారమైన బొగ్గు నిక్షేపాలున్నప్పటికీ కొత్త గనులు ఏర్పాటుకు అవకాశం లేకపోవడంతో యాజమాన్యం విస్తరణ ప్రాజెక్టుల కింద ఉపరితల గనులను ఏర్పాటు చేస్తోంది. దీని వల్ల కొత్తగా అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. పాత గని కింద మాత్రమే దీనిని గుర్తిస్తారు. పర్యావరణ, ప్రాజెక్టు అనుమతులకు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. అందుకే యాజమాన్యం భూగర్భ గనుల ఏర్పాటు చర్యలు తీసుకుంటోంది. ఇక సింగరేణి సంస్థ కొత్త గనుల కోసం ప్రాజెక్టు నివేదికలు తయారు చేసుకుంది. వాటిని ఏర్పాటు చేసుకోవాలంటే కేంద్రం తీసుకువచ్చిన చట్టం మైన్స్‌ అండ్‌ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ రెగ్యులేషన్‌-MMDR చట్టం ప్రకారం తప్పనిసరిగా వేలంలో పాల్గొంటేనే కొత్త గనులు దక్కించుకోవచ్చు.

సింగరేణి విస్తరించిన పూర్వ 4 జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతంలో అపారమైన బొగ్గు నిక్షేపాలున్నాయి. రాంపూర్, పునుకుడుచిలక, తాడిచెర్ల-2, చండ్రుపల్లి, ములుగులోని బొగ్గు నిక్షేపాల వెలికితీతకు సింగరేణి సంస్థ ప్రణాళికలు రచించింది. దీంతో అనేక రకాలుగా అన్యాయం జరుగుతోందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యంపై కార్మిక సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టన్ను బొగ్గు ధర చాలా తక్కువ : బొగ్గు ఉత్పత్తిలో దేశంలోనే ఎంతో అనుభవం ఉన్న కంపెనీ సింగరేణి. స్థానికంగా, సహజ సిద్ధంగా ఉన్న పరిస్థితులు బొగ్గు ధరపై ప్రభావం చూపుతాయి. ఇక్కడి భూగర్భ స్థితిగతులు బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతున్నాయి. దానిని అధిగమించాలని భావిస్తున్న సంస్థ ఉపరితల గనుల ఏర్పాటుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సింగరేణి కంటే ఇతర బొగ్గు పరిశ్రమల్లో టన్ను బొగ్గు ధర చాలా తక్కువగా ఉంది. సింగరేణితో పోల్చితే వెస్ట్రన్‌ కోల్‌ఫీల్డ్స్, మహానది కోల్‌ఫిల్డ్స్‌లో బొగ్గు ధర తక్కువగా ఉంది. సింగరేణి బొగ్గు ఉత్పత్తికి అయ్యే ఖర్చుతో చూసుకుంటే మార్కెట్‌లో విక్రయిస్తున్న ధర తక్కువే. కానీ అంతకంటే తక్కువకు విక్రయించాలంటే సంస్థకు నష్టాలు తప్పవు. దీనిని ఏ విధంగా అధిగమించాలన్న విషయమై యాజమాన్యం ప్రణాళికలు రచిస్తోంది.

బహిరంగ మార్కెట్‌లో పోటీని ఎదుర్కోవాలంటే తక్కువ ధరకు నాణ్యమైన బొగ్గును విక్రయించడమే మార్గం. బొగ్గు నిక్షేపాలు చాలా లోతుల్లో ఉండటంతో దానిని వెలికి తీసేందుకు ఖర్చు ఎక్కువ చేయాల్సి ఉంటుంది. అదే ఒడిశాలోని మహానది కోల్‌ఫీల్డ్స్‌లో 2 టన్నుల మట్టిని వెలికి తీస్తే ఒక టన్ను బొగ్గు ఉత్పత్తి చేయవచ్చు. సింగరేణిలో కనీసం 6 నుంచి 7 టన్నుల మట్టిని వెలికి తీస్తే తప్ప టన్ను బొగ్గును ఉత్పత్తి చేయలేం. మట్టి తొలగింపునకే సింగరేణిలో ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. దీని వల్ల ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. భూగర్భంలో బొగ్గు పొరలు ఏర్పడ్డ ప్రాంతాలు కనీసం 300 నుంచి 1200 మీటర్ల లోతుల్లో ఉన్నాయి.

రోజుకు 18 గంటలు పని చేస్తే ఆర్థిక భారం తగ్గుతుంది : గోదావరి పరివాహక ప్రాంతంలో బొగ్గు నిక్షేపాలు 19,000 మిలియన్‌ టన్నులకుపైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇవి తక్కువలో తక్కువ 300 మీటర్ల నుంచి అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం మైనింగ్‌ చేస్తున్న గనుల్లో అవి 600 మీటర్ల వరకు వెళ్లాయి. అందులోంచి వెలికి తీయాలంటే పైన ఉన్న మట్టిని తొలగించాల్సి ఉంటుంది. భారీ మొత్తంలో ఉన్న మట్టిని తొలగించేందుకు వెచ్చించే వ్యయం బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. సింగరేణి గనుల్లో యంత్రాల పని గంటలు పెంచుకోవడం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది. ఒక్కో యంత్రం రోజుకు 18 గంటలు పని చేస్తే ఆర్థిక భారం తగ్గుతుంది. ఉపరితల గనుల్లో 19 గంటలు పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలి. సింగరేణిలో మొత్తం 828 యంత్రాలు పని చేస్తున్నాయి. ప్రతి యంత్రం సగటున 4 గంటలు పెంచుకుంటే బొగ్గు ఉత్పత్తి పెరుగుతుంది. ఫలితంగా వ్యయం తగ్గే అవకాశం ఉంటుంది.

ఒక్కో సంవత్సరం 500 కోట్లకుపైగా నష్టం : సింగరేణికి భూగర్భ గనులు గుదిబండగా మారుతున్నాయి. ప్రతి ఏటా నష్టాల మోత మోగిస్తున్నాయి. వీటి వల్ల సంస్థకు ఆర్థిక భారం పడుతోంది. ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి భారీగా వ్యయం అవుతుండటంతో నష్టాల ఖాతా పెరుగుతోంది. సింగరేణిలో 23 భూగర్భ బొగ్గు గనులు ఉన్నాయి. వీటిలో ఒక్కో గనిలో ఒక టన్ను బొగ్గు ఉత్పత్తికి 6 వేల నుంచి 10 వేల ఖర్చు అవుతోంది. కాగా దీనిని 3 వేల చొప్పున విక్రయించాల్సి వస్తుంది. అంటే ప్రతి టన్ను బొగ్గు ఉత్పత్తిపై కంపెనీ అధిక నష్టాన్ని భరించాల్సి వస్తోంది.

కనీసం భూగర్భ బొగ్గుగనుల్లో పని చేసే ఉద్యోగుల వేతనాలకు సరిపడా ఆదాయాన్ని కూడా సమకూర్చుకోలేకపోతోంది. నష్టాలను అధిగమించేందుకు యాజమాన్యం అనేక చర్యలు తీసుకుంటున్నా అవి ఫలించడం లేదు. ప్రతి ఏటా భూగర్భ బొగ్గుగనుల ద్వారా కోట్లలో నష్టం వస్తోంది. ఒక్కో సంవత్సరం 500 కోట్లకుపైగా నష్టం వాటిల్లుతుండగా వీటిని ఉపరితల గనులు, విద్యుత్తు కేంద్రాల ద్వారా సమం చేసుకొనే యత్నం చేస్తోంది సింగరేణి. అందులో వచ్చిన లాభాలను భూగర్భ గనుల్లోని నష్టాలకు పూడ్చుతున్నారు. ఐతే కార్మికులు మాత్రం తమకు తీరని అన్యాయం జరుగుతోందని వాపోతున్నారు.

2030 కల్లా 100 మిలియన్‌ టన్నులకు పెంచేందుకు ప్రణాళిక : రాబోయే మూడేళ్లలో సింగరేణి వ్యాప్తంగా 10 గనులను మూసి వేసేందుకు రంగం సిద్ధమైంది. బొగ్గు నిల్వలు అంతరించి పోవడంతోపాటు ఆయా గనుల్లో ఉత్పత్తి వ్యయం అధికం కావడంతో కేంద్ర ప్రభుత్వం గనులను మూసివేయాలని నిర్ణయించింది. పైగా భూగర్భ గనులను ఉపరితల గనులుగా మారుస్తుండటంతో మూసివేత అనివార్యమైనట్లు తెలుస్తోంది. సింగరేణిలో ఉత్పత్తి సామర్థ్యాన్ని ప్రస్తుతం ఉన్న 65 మిలియన్‌ టన్నుల నుంచి 2024-25 నాటికల్లా 80 మిలియన్‌ టన్నులకు, 2030 కల్లా 100 మిలియన్‌ టన్నులకు పెంచేందుకు ప్రణాళిక రూపొందిండంతో పాత గనులను మూసి వేయాలని నిర్ణయించారు. ఐతే పాత గనుల మూసివేత వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు వాటి స్థానంలో కొత్త గనులను తెరిచి మెరుగైన ఉత్పత్తి సాధించాలనే లక్ష్యంతో కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ ప్రణాళికలు చర్యలు తీసుకుంటుంది.

తగ్గుతున్న బొగ్గు ఉత్పత్తి : ఒకవైపు నష్టాలు వస్తున్నాయని గగ్గోలు పెడుతున్న సింగరేణి యంత్రాల వినియోగంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందన్న ప్రచారం ఉంది. సైడ్‌ డిస్ఛార్జ్‌ లోడర్‌ యంత్రాల పని గంటలు పూర్తిస్థాయిలో వినియోగించుకోవడం లేదు. రోజుకు 18 గంటలు పని చేయాల్సి ఉండగా కేవలం 7 గంటలు మాత్రమే పని చేస్తున్నాయి. దీనిని కనీసం 14 గంటలకు పెంచుకుంటే బొగ్గు ఉత్పత్తి పెరుగుతుంది. లోడ్‌ హాల్‌ డంపర్‌ యంత్రాలు రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నాయి. దీనిని 14 గంటలకు పెంచుకోవాలి. రోజూ పనిచేసే సామర్థ్యం 18 గంటలు కాగా ఆ సమయాన్ని పాటించడం లేదు. రోజుకు కనీసం 50 డ్రిల్స్‌ వేయాలి. కాని 40 డ్రిల్స్‌ మాత్రమే వేస్తున్నారు. దీనివల్ల బొగ్గు ఉత్పత్తి తగ్గుతోంది. కోల్‌కటింగ్‌ ఉద్యోగుల పని గంటలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

సింగరేణి నిర్వహణలో పెరుగుతున్న మహిళల పాత్ర - కీలక విభాగాలకు అధిపతులు వీళ్లే

పదవీ విరమణ చేసిన సింగరేణి కార్మికులకు బోనస్‌ - ఒక్కొక్కరికి ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.