SCR Canceled 30 Trains : ఖమ్మం రైల్వే స్టేషన్ వద్ద నాన్ ఇంటర్‌లాకింగ్ పనుల నేపథ్యంలో 30 రైళ్లను వేర్వేరు తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఏ. శ్రీధర్ గురువారం ప్రకటించారు. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, భద్రాచలంరోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను ఈ నెల 10 నుంచి 20 (అంటే దాదాపు 11 రోజులు) వరకు రద్దు చేశారు. గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్‌ప్రెస్‌లు వారం నుంచి 11 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని స్పష్టం చేశారు. మరో 9 రైళ్లను దారి మళ్లించి నడపనున్నారు. నాలుగు రైళ్లు 60-90 నిమిషాల ఆలస్యంగా బయల్దేరనున్నట్లు వెల్లడించారు.
రద్దయిన రైళ్లు వాటి తేదీలు : సికింద్రాబాద్-గుంటూరు (17201/17202) గోల్కొండ ఎక్స్‌ప్రెస్: ఫిబ్రవరి 11వ తేదీ నుంచి 21 వరకు
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17233/17234)
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్: ఫిబ్రవరి 10 నుంచి 21 వరకు
- ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, గుంటూరు-సికింద్రాబాద్ (12705/12706) : 10, 11, 15, 18, 19, 20
- శాతవాహన ఎక్స్‌ప్రెస్, విజయవాడ-సికింద్రాబాద్ (12713/12714) : 11, 14, 16, 18, 19, 20
- రద్దయిన జాబితాలో మరికొన్ని రైళ్లు ఉన్నాయి.
- వందేభారత్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్-విశాఖపట్నం (20834) 19, 20 తేదీల్లో 75 నిమిషాలు ఆలస్యంగా, కృష్ణా ఎక్స్‌ప్రెస్, ఆదిలాబాద్-తిరుపతి (17406) 9, 11, 14, 18, 19 తేదీల్లో 90 నిమిషాలు ఆలస్యంగా బయల్దేరుతాయి.
సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు 180 ప్రత్యేక రైళ్లు - టైమింగ్స్ తెలుసా?
ప్రయాణికులకు గుడ్న్యూస్ - త్వరలోనే చర్లపల్లి నుంచి మరో 8 రైళ్ల పరుగులు