Tips To Get Good Score in 10th English : పదో తరగతి విద్యార్థులు అతి కష్టంగా భావించే సబ్జెక్టుల్లో ఇంగ్లీష్ ముందు వరుసలో ఉంటుంది. దీంతో వార్షిక పరీక్షల్లో ఎంతో మంది ఉత్తీర్ణత సాధించకపోవడం, మార్కులు తక్కువగా తెచ్చుకోవడం వంటివి జరుగుతుంటాయి. మరోవైపు ఆంగ్ల వార్షిక పరీక్ష రోజు విద్యార్థులు ఆందోళనకు గురి కావడంతో పాటు ఒత్తిడికి సైతం లోనవుతుంటారు. అయితే కొద్దిగా శ్రద్ధ పెడితే ఆంగ్లంలో మంచి మార్కులు సాధించడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు కస్తూరి ప్రభాకర్. త్వరలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జవాబులు రాసే తీరును ఆయన ఈటీవీ భారత్‌కు వివరించారు.
- ఇంగ్లీష్ ఎగ్జామ్ 80 మార్కులకు రాతపరీక్ష ఉంటుంది. మిగిలిన 20 మార్కులు ఫార్మేటివ్ పరీక్షల్ల సాధించిన మార్కుల సగటును జత చేస్తారు.
- మొదటి నుంచి గ్రామర్‌పై పట్టు సాధిస్తే వాఖ్య నిర్మాణం సులభంగా చేయగలుగుతారు.
- ఇంగ్లీష్ అంటే ఉన్న భయాన్ని మనసులోంచి తొలగించాలి.
- ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటూ సందేహాలుంటే ఎప్పటికప్పుడ అడిగి తెలుసుకోవాలి.
- పరీక్షలో పార్టు-ఏ లో ఒక పారా ఇచ్చి అందులో నుంచి ఇచ్చిన నాలుగు ప్రశ్నలకు జవాబులు రాయాలి. పారాగ్రాఫ్‌ను క్షుణ్ణంగా అర్ధం చేసుకుంటే 12 మార్కులు ఏటుపోవు.
- 5 నుంచి ఏడు ప్రశ్నలు సైతం పారాగ్రాఫ్‌లోని ప్రశ్నలకు మూడు, నాలుగు వ్యాఖ్యాల్లో జవాబులు రాయాలి. ఎనిమిదో ప్రశ్నలో 3 సరైన వాఖ్యాలను గుర్తించాలి.
- 9 నుంచి 12 వరకు ప్రశ్నలు ఏదైనా గ్రాఫ్, ఛార్ట్ ఇచ్చి ప్రశ్నలు అడుగుతారు. గ్రాఫ్‌ను మంచిగా పరిశీలిస్తే సమాధానాలు రాయడం చాలా సులభమే.
- ఇక పాఠ్యాంశాల్లో నుంచి కాకుండా బయటి నుంచి పారాగ్రాఫ్ ఇచ్చి అడిగే 13వ కొద్దిగా కష్టమైనదే. మొదటి నుంచి ఆంగ్లంపై మంచి పట్టు సాధించిన వారు ఈ ప్రశ్నకు సైతం సులభంగా సమాధానాలు రాయగలుగుతారు.
- ఇక 14 ప్రశ్న 10 మార్కులకు ఉంటుంది. ఇందులో ఇంటర్వ్యూ, వ్యాసం రాయాల్సి ఉంటుంది.
- పార్టు బీలో సైతం బయటి నుంచి పారాగ్రాఫ్, పద్యంలోని ప్రశ్నలు, వాఖ్య సవరణ, వ్యతిరేక పదాలు, తదితరాలు ఉంటాయి.
- ప్రతి విద్యార్థి పాత మాదిరి ప్రశ్న పత్రాలను చదవడం వల్ల ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయనేది ఐడియా వస్తుంది. తద్వారా వార్షిక పరీక్షలో తడబాటుకు గురయ్యే ప్రమాదం తప్పుతుంది.
- నిత్యం అన్ని సబ్జెక్టులతో పాటు ఆంగ్ల సబ్జెక్టుకు సైతం కొంత సమయం కేటాయించి రివిజన్ చేసుకుంటే, పరీక్ష సులభంగా రాయగలుగుతారు.
పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలా? - ఈ స్మార్ట్ టిప్స్ పాటిస్తే బెటర్!
పదో తరగతి విద్యార్థులకు అలర్ట్ - ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచి మార్కులు పక్కా
టెన్త్ విద్యార్థులకు ఎగ్జామ్ టిప్స్ - సబ్జెక్టుల వారీగా ఈ కిటుకులు గుర్తుంచుకోండి!