ETV Bharat / state

వివాహేతర సంబంధం - సుపారీ ఇచ్చి మరీ మహిళను హత్య చేయించిన కుటుంబసభ్యులు - KARIMNAGAR MURDER CASE

వివాహేతర సంబంధమే మమత హత్యకు కారణమని పోలీసుల నిర్ధరణ - భర్తతో విడిపోయి సింగరేణి ఉద్యోగి భాస్కర్‌తో ఉంటున్న మమత - మమతకు భాస్కర్‌ భారీగా డబ్బులు ఇస్తున్నాడని కుటుంబం ఆగ్రహం

KARIMNAGAR MURDER CASE
WOMAN MURDER CASE IN KARIMNAGAR (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 7:02 PM IST

Karimnagar Murder Case : కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో గత నెల జనవరి 27న జరిగిన మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఉన్న ఐదుగురు నిందితులను పోలీసులు ఈరోజు (ఫిబ్రవరి 6న) అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం బెల్లంపల్లి పట్టణానికి చెందిన మేడ మమత అనే మహిళ తన భర్త భరత్​తో విభేదాల కారణంగా మంచిర్యాలలో ఉంటోంది. ఒంటరిగా ఉంటూ సింగరేణి ఉద్యోగి భాస్కర్​తో పరిచయం ఏర్పడి అతనితో సాన్నిహిత్యంగా ఉంటుంది. వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.

రూ.5 లక్షల సుపారీ : ఈ వ్యవహారాన్ని గమనించిన భాస్కర్ సోదరి నర్మద తన ప్రియుడు రఘుతో కలిసి మేడ మమత హత్యకు పథకం సిద్ధం చేశారు. సుపారీ హంతకుడు వేల్పుల కల్యాణ్​కు రూ.5 లక్షలు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. మేడ మమతను కల్యాణ్​ హత్య చేసిన అనంతరం నర్మద బావ వెంకటేష్, తండ్రి రాజలింగులు హంతకుడికి రూ.5 లక్షలు చెల్లించారు.

హత్య అనంతరం శివారులో పడేసి : మృతదేహాన్ని సుపారీ హంతకుడు వేల్పుల కల్యాణ్ కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి శివారులో పడేశాడు. ఈ ఘటన అనంతరం కల్యాణ్​ చెన్నై పారిపోగా, పోలీసులు సమాచారం అందుకుని నిందితుడిని పట్టుకున్నారు. మిగతా నలుగురు నిందితులను వారి ఇంటి వద్ద అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరు పరిచారు.

తల్లి శవాన్ని ముక్కలు చేసిన బాత్రూంనే వాడిన పిల్లలు - మీర్​పేట హత్య కేసులో సంచలన విషయాలు

నిందితులను పట్టించిన వాట్సప్ స్టేటస్ - అది ఎలాగంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.