ETV Bharat / technology

మహింద్రా కొత్త ఎలక్ట్రిక్ కార్ల ధరలు రివీల్!- ఫస్ట్ బుక్ చేసుకున్నవారికి లైఫ్​టైమ్ వారెంటీ! - MAHINDRA XEV 9E AND BE 6 PRICE LIST

మహింద్రా XEV 9E, BE 6 ధరలు వెల్లడించిన కంపెనీ- బ్యాటరీ ప్యాక్స్​ వారీగా లిస్ట్ ఇదే!

Mahindra XEV 9e and BE 6
Mahindra XEV 9e and BE 6 (Photo Credit- Mahindra & Mahindra)
author img

By ETV Bharat Tech Team

Published : Feb 6, 2025, 7:28 PM IST

Updated : Feb 6, 2025, 7:46 PM IST

Mahindra XEV 9E and BE 6 Full Price List: దేశీయ కార్ల తయారీ సంస్థ మహింద్రా & మహింద్రా ఇటీవలే తన రెండు కొత్త ఈవీలను లాంఛ్ చేసింది. 'XEV 9E', 'BE 6' అనే పేరుతో వీటిని 2024 నవంబర్​లో ప్రారంభించింది. అయితే ఆ సమయంలో కంపెనీ వీటి ప్రారంభ ధరను మాత్రమే ప్రకటించింది. కానీ వేరియంట్ల వారీగా ఈ రెండు ఎలక్ట్రిక్ SUVల ధరలను మాత్రం వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో కంపెనీ ఇప్పుడు ఈ రెండు మోడళ్లకు సంబంధించిన వివిధ బ్యాటరీ ప్యాక్‌ల వేరియంట్​ వారీ ధరలను వెల్లడించింది.

బుకింగ్స్ అండ్ డెలివరీలు: మహింద్రా XEV 9E, BE 6 కార్ల బుకింగ్స్​ కూడా ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు వీటి బుకింగ్​లు 2025, ఫిబ్రవరి 14న ఉదయం 9 గంటల నుంచి అధికారికంగా ప్రారంభం కానున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాక ఈ రెండు కార్లను మొదట బుక్​ చేసుకున్నవారికి లైఫ్​టైమ్ వారెంటీని అందించనున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్​లో వాటి బ్యాటరీలు 10 సంవత్సరాలు లేదా 2,00,000 కి.మీ వారంటీతో వస్తాయి.

ఈ నేపథ్యంలో వీటిని ఇవాళ్టి (ఫిబ్రవరి 6) నుంచే కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రిఫరెన్సెస్​ ఆధారంగా బుకింగ్‌లు చేసుకోవచ్చని వెల్లడించింది. అంటే మహింద్రా ఈ రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లు ప్యాక్ వన్ (59 kW), ప్యాక్ వన్ అబోవ్ (59 kW), ప్యాక్ టూ (59 kW), ప్యాక్ త్రీ సెలెక్ట్ (59 kW), ప్యాక్ త్రీ (79kW) వంటి బ్యాటరీ ప్యాక్​లతో లభిస్తాయి.

వీటిలో 79 kW ప్యాక్ త్రీ వేరియంట్ డెలివరీలు మార్చి 2025లో ప్రారంభమవుతాయి. ప్యాక్ త్రీ సెలెక్ట్ వేరియంట్ డెలివరీలు జూన్ 2025లో, ప్యాక్ టూ వేరియంట్ జులై 2025లో, ప్యాక్ వన్ అండ్ ప్యాక్ వన్ అబోవ్ వేరియంట్‌ల డెలివరీలు ఆగస్టు 2025లో ప్రారంభంకానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Battery PackPrice (ex-showroom)
BE 6XEV 9E
Pack One
(59 kW)
18.90 lakhs21.90 lakhs
Pack One Above
(59 kW)
20.50 lakhs---------------
Pack Two
(59 kW)
21.90 lakhs24.90 lakhs
Pack Three Select
(59 kW)
24.50 lakhs27.90 lakhs
Pack Three
(79 kW)
26.90 lakhs30.50 lakhs

మహిద్రా BE6: మహిద్రా BE6 ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటి​ ఫీచర్లను బట్టి ధరలు ఉంటాయి. మహింద్రా BE6 ధర రూ. 18.90 లక్షల నుంచి ప్రారంభమై రూ. 26.90 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

Mahindra XEV 9E and BE 6 Full Price List
Mahindra XEV 9E and BE 6 Full Price List (Photo Credit- ETV Bharat)

XEV 9E: మహింద్రా XEV 9E ధర రూ. 21.90 లక్షల నుంచి ప్రారంభమై రూ. 30.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

మహింద్రా XEV 9E, BE6 మోడల్స్​ INGLO ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉన్నాయి. వీటి AC వాల్ బాక్స్ ఛార్జర్‌లకు కంపెనీ ప్రీమియం వసూలు చేస్తుంది. వాటి ధరలు పరిశీలిస్తే 7.2 KW AC ఛార్జర్‌కు 50,000, 11.2 KW AC ఛార్జర్‌కి 75,000 రూపాయలుగా ఉన్నాయి.

ఫీచర్లు: మహింద్రా XEV 9E, BE 6 ఎలక్ట్రిక్ కార్లు 175 kW ఛార్జర్ సహాయంతో కేవలం 20 నిమిషాల్లో 20 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయగల అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తాయి. ఇక వీటి పవర్ అండ్ రేంజ్ విషయానికి వస్తే, ఈ రెండు మోడల్‌లలోని 59 kW బ్యాటరీ ప్యాక్ 231bhp శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో 79kW బ్యాటరీ ప్యాక్ 286bhp శక్తిని, 380Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు SUVలు కేవలం 6.7 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలవు. ఇక సింగిల్​ ఛార్జ్​తో మహిద్రా BE 6 మోడల్ 682 కి.మీ, XEV 9E కారు 656 కి.మీ చొప్పున ప్రయాణించగలవని మహింద్రా చెబుతోంది.

సెఫ్టీ​లో కూడా సూపరే!: గత నెలలో (జనవరి) మహింద్రా XEV 9E, BE6 SUVలు భారత్ ఎన్​సీఏపీ క్రాస్​ టెస్ట్​లో 5-స్టార్ రేటింగ్‌ను పొందాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ SUVలూ క్రాష్ టెస్ట్‌లో అత్యధిక స్కోర్​ను సాధించి 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సొంతం చేసుకున్నాయి. అంటే ప్రమాదాల ప్రభావాన్ని తట్టుకునేలా అద్భుతమైన భద్రతా ఫీచర్లతో మహింద్రా ఈ రెండు ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకొచ్చిందని ఈ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ రుజువు చేస్తోంది.

మరోసారి చంద్రుడిపైకి వెళదామా?- చంద్రయాన్-4పై క్లారిటీ వచ్చిందిగా!

డైమండ్ షీల్డ్ గ్లాస్​తో వివో కొత్త ఫోన్- కిందపడినా కూడా ఏం కాదంట!- రిలీజ్ ఎప్పుడంటే?

ఓలా నుంచి రెండు ఎలక్ట్రిక్ బైక్​లు- సింగిల్ ఛార్జ్​తో 501కి.మీ రేంజ్​!

Last Updated : Feb 6, 2025, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.