KCR Comments On MLAs Who Changed Parties : పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. ఆయన సమక్షంలో మంగళవారం స్టేషన్‌ఘన్‌పూర్‌కు చెందిన కీర్తి వెంకటేశ్వర్లు, మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి తదితర నేతలు ఆ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి ఓటమి ఖాయమని, ఆ స్థానంలో రాజయ్య ఎమ్మెల్యేగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆయనతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలందరూ ఓడిపోతారని అన్నట్లు సమాచారం.
తెలంగాణలో ఉప ఎన్నికలు - వారందరూ ఓడిపోవడం ఖాయం: కేసీఆర్ - KCR ON BY ELECTIONS IN TG
పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు ఖాయమన్న కేసీఆర్ - స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరి ఓడిపోతాడని ధీమా
![తెలంగాణలో ఉప ఎన్నికలు - వారందరూ ఓడిపోవడం ఖాయం: కేసీఆర్ KCR Comments On MLAs Who Changed Parties](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/1200-675-23522712-thumbnail-16x9-kcrs.jpg?imwidth=3840)
![ETV Bharat Telangana Team author img](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 11, 2025, 8:00 PM IST