LIVE : గాంధీభవన్‌లో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై సమావేశం - ప్రత్యక్ష ప్రసారం - MEETING ON CASTE CENSUS
🎬 Watch Now: Feature Video


Published : Feb 14, 2025, 4:04 PM IST
|Updated : Feb 14, 2025, 5:13 PM IST
Power Point Presentaion on Caste Census in Gandhi Bhavan Live : టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కులగణన, వర్గీకరణపై నేతలకు అవగాహన కల్పిస్తున్నారు. గాంధీ భవన్ ప్రకాశం హాల్‌లో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరిస్తున్నారు. అ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీలు హాజరయ్యారు. రాష్ట్రంలో చేపట్టిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ నాయకులకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. కాగా ఇటీవల జరిగిన ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. కులగణన సర్వేకు సంబంధించి పూర్తి వివరాలను సీఎం రేవంతే రెడ్డి అసెంబ్లీలో వివరించారు. తాజాగా ఈ విషయపై నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్య మంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనరసింహ, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ తదిరులు హాజరయ్యారు.
Last Updated : Feb 14, 2025, 5:13 PM IST