Pratidhwani Debate on Illegal Immigration to America : ఫ్లయిట్ వెంట ఫ్లయిట్! అమెరికా నుంచి అమృత్‌సర్ చేరుకుంటున్న అమెరికా విమానాలు అక్రమ వలసదారుల్ని దించి వెళ్లిపోతున్నాయి. తమ దేశంలోకి అక్రమంగా ప్రవేశించారన్న అగ్రరాజ్యం కోణంలో చూస్తే ఇందులో తప్పుబట్టేందుకు, బాధ పడడానికీ లేదు. కానీ భవిష్యత్‌పై ఎన్నో ఆశలతో ఏజెంట్ల మాటలు నమ్మి లక్షల రూపాయల కొద్దీ సమర్పించుకున్న తర్వాత మాకేంటీ దుస్థితి అన్న బాధితుల ఆవేదనలు మాత్రం చాలా మందిని ఆలోచనల్లో పడేస్తున్నాయి.
భవిష్యత్ బావుంటుందనే ఆశతో అప్పులు చేసి, ఆస్తులు అమ్మి పిల్లల్ని విదేశాలకు పంపిస్తున్న తల్లిదండ్రులకూ కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరి చదువుల కోసం, ఉద్యోగాల కోసం అమెరికా, మరో దేశమో వెళ్లాలి అనుకునే వారు ఈ చేదు అనుభవాల్లో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి? చిక్కులు వద్దంటే ఎలా వెళ్లాలి? ఎలా మెలగాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.