LIVE : పారిస్‌లో ప్రధాని మోదీ పర్యటన - ప్రత్యక్ష ప్రసారం - PM NARENDRA MODI LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/640-480-23519991-thumbnail-16x9-modi-live.jpg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 11, 2025, 2:57 PM IST
|Updated : Feb 11, 2025, 3:05 PM IST
PM Narendra Modi Live : 3 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశమయ్యారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో ఇరుదేశాలు సహకరించుకోవాలని, ఈ రంగంలో పరిశోధనలకు పెద్ద పీట వేయాలని ఇరు దేశాలు నిర్ణయించారు. పారిస్‌లో జరిగిన ఏఐ యాక్షన్ సమ్మిట్‌లో ఇరువురు నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ - ఫ్రాన్స్ మధ్య దైపాక్షిక సహకారంపై కూడా ఇరువురు నేతలు చర్చించారు. ఈ సందర్భంగా ఎలిన్ ప్యాలెస్‌లో ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్ ఇచ్చే గౌరవ విందుకు మోదీ హాజరయ్యారు. ఈ విందులో అంతర్జాతీయంగా పేరున్న అనేక టెక్ కంపెనీల సీఈవోలు, అనేక ఇతర విశిష్ట ఆహ్వానితులు పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మోక్రాన్ మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికులు చేసిన త్యాగాలకు నివాళి అర్పించడానికి మార్సెల్లెలోని కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ నిర్వహిస్తున్న మజార్గ్స్ యుద్ధ స్మశానవాటికను సందర్శిస్తారు.
Last Updated : Feb 11, 2025, 3:05 PM IST