LIVE : లోక్‌సభ సమావేశాలు - ప్రత్యక్ష ప్రసారం - LOK SABHA SESSION 2025 LIVE
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-02-2025/640-480-23492133-thumbnail-16x9-lok-sabha-session-live.jpeg)
![ETV Bharat Telangana Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/telangana-1716536068.jpeg)
Published : Feb 7, 2025, 11:17 AM IST
|Updated : Feb 7, 2025, 6:00 PM IST
Lok Sabha Session 2025 Live : లోక్‌సభలో బడ్జెట్‌పై చర్చలు జరుగుతున్నాయి. దేశ ఆర్థిక ప్రగతిలో ఎంతో కీలకమైన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో అధికార, విపక్షాలు స్పందించాయి. 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని బీజేపీ కొనియాడింది. కాగా మంగళవారం జరిగిన సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ పదేళ్లో బీజేపీ పాలనలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. గత ప్రభుత్వాలు గరీబీ హఠావో అంటూ కేవలం నినాదంతో అధికారం అనుభవించాయంటూ పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి విమర్శించారు. పేద, మధ్య తరగతి వర్గాల కలలను పూర్తి చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ మంగళవారం జరిగిన సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఇథనాల్ కలపటం వల్ల పెట్రోల్, డీజిల్ భారం తగ్గిందని ప్రధాని మోదీ తెలిపారు.
Last Updated : Feb 7, 2025, 6:00 PM IST