King In Cricket : క్రికెట్లో 'కింగ్' అనగానే ఎవరికైనా టక్కున విరాట్ కోహ్లీనే గుర్తొస్తాడు. అయితే పాకిస్థాన్ జట్టులో మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌ను కూడా ఆ దేశ అభిమానులు ముద్దుగా కింగ్ అని పిలుచుకుంటారు. కెరీర్ ప్రారంభంలో బాబర్ నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కీలక ఇన్నింగ్స్‌లతో కొద్ది కాలంలోనే కీలక ప్లేయర్‌గా ఎదిగాడు. కానీ, కొంతకాలంగా బాబర్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడు అభిమానులకు, మీడియాకు ఓ ఆసక్తికరమైన విజ్ఞప్తి చేశాడు. ఇక నుంచి తనను కింగ్ అని పిలవొద్దని కోరాడు.
ఒకప్పుడు నిలకడకు మారు పేరైన బాబర్ ఆజామ్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. గతంలో నిలకడైన బ్యాటింగ్‌తో పరుగుల వరద పారించిన బాబర్, మూడేళ్లుగా ఫామ్‌లేమితో తంటాలు పడుతున్నాడు. 2022 డిసెంబర్‌లో టెస్టుల్లో చివరిసారి సెంచరీ చేసిన బాబర్, వన్డేల్లో 2023 ఆగస్టులో శతకం బాదాడు.
ఆ తర్వాత నిలకడలేమి ఆటతో ఇబ్బంది పడుతున్నాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు సౌతాఫ్రికా, న్యూజిలాండ్‌తో జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లోనూ బాబర్ ఆజామ్ తన పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో అతడు 16.50 సగటుతో 33 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో బాబర్ ఆజామ్ ఫ్యాన్స్, మీడియాకు తనను కింగ్ అని పిలవొద్దని విజ్ఞప్తి చేశాడు.
ప్లీజ్ అలా పిలవొద్దు
'దయచేసి నన్ను కింగ్ అని పిలవద్దు. నేను కింగ్ కాదు. ప్రస్తుతం నేను ఆ స్థితిలో లేను. నాపై కొత్త బాధ్యతలు ఉన్నాయి. గతంలో నేను చేసిన పరుగులు, రికార్డులు అన్నీ గతమే. ఇప్పుడు ప్రతీ మ్యాచ్ తాజా సవాలే. నేను వార్తమానంతో పాటు భవిష్యత్తుపై ఫోకస్ పెట్టాలి. అని బాబర్ మీడియాతో వ్యాఖ్యానించాడు.
𝗕𝗮𝗯𝗮𝗿 𝗔𝘇𝗮𝗺 - 🗣️🗣️ " please stop calling me the king. i am not like that. i need to forget the past and look ahead. i need to focus on the present."#BabarAzam #PakistanCricket pic.twitter.com/mP6SXXfD84
— Cricket Insight • (@_CricketInsight) February 13, 2025
క్రికెట్లో 'కింగ్'
టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీని కింగ్ అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. ఆస్ట్రేలియాలో నివసిస్తున్న కునాల్ గాంధీ అనే భారతీయ క్రికెట్ అభిమాని గతంలో ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి గొప్పగా చెప్పడానికి అతడిని 'కింగ్' అని అభివర్ణించాడు. అప్పటి నుంచి కోహ్లీని అభిమానులు కింగ్‌గా పిలుస్తున్నారు.
'సింగ్ ఈజ్ కింగ్': చరిత్ర సృష్టించిన అర్షదీప్- టీ20ల్లో ఆల్‌టైమ్ రికార్డ్
పాకిస్థాన్ కొత్త కెప్టెన్ ప్రకటన- బాబర్‌ను రిప్లేస్ చేసేది అతడే