PCC Disciplinary Committee Issues Show Cause Notices : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్) ఇటీవల వరంగల్ బీసీ గర్జన సభలో చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వరంగల్ సభలో ఓ వర్గంపై చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఆయనను వివరణ కోరింది. కులగణన నివేదికపై ఇటీవల మల్లన్న చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది.
కరీంనగర్ సీపీకి ఫిర్యాదు : మరోవైపు ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ మల్లన్నపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ సీపీకి ఆ సామాజిక వర్గం వారు ఫిర్యాదు ఇచ్చారు. రాష్ట్రంలో ఒక సామాజిక వర్గంపై ఇష్టానుసారంగా మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. తీన్మార్ మల్లన్నపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ సీఎల్పీ మీటింగ్ - ఆ విషయాలపై ప్రత్యేక చర్చ
నేను కొడితే మామూలుగా ఉండదు - కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్