IIT Madras Summer Fellowship 2025 : దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థగా ప్రఖ్యాతిగాంచిన ఐఐటీ-మద్రాస్ విద్యార్థులకు సువర్ణావకాశాన్ని అందిస్తోంది. వేసవిలో తమ నైపుణ్యాలను పెంచుకొనే అవకాశాల కోసం ఎదురుచూసే విద్యార్థుల కోసం సమ్మర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌ను అమలు చేస్తోంది. ఇందుకోసం ఆసక్తి గల విద్యార్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. 2 నెలల పాటు కొనసాగే ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌కు ఆసక్తి కలిగిన విద్యార్థులు ఫిబ్రవరి 28 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం ఐఐటీల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రం ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు అనర్హులు. ఈ ఫెలోషిప్‌నకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
పెలోషిప్ ముఖ్య ఉద్దేశం : ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, సైన్సెస్, హ్యుమానిటీస్ విభాగాల విద్యార్థుల్లో ఉన్నత నాణ్యతతో కూడిన అకడెమిక్ రీసెర్చ్‌పై అవగాహన కల్పించడం, తద్వారా ఆసక్తిని పెంపొందించడం.
బీఈ/బీటెక్/బీఎస్సీ (ఇంజినీరింగ్) మూడో సంవత్సరం లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఈ/ఎంటెక్/ఎమ్మెస్సీ ప్రోగ్రామ్‌లలో మూడు/ నాలుగో ఏడాది చదువుతున్నవారితో పాటు మంచి అకడమిక్ రికార్డు కలిగిన ఎమ్మెస్సీ/ఎంఏ/ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ ఫెలోషిప్‌నకు దరఖాస్తు చేసుకొనే అవకాశం కల్పిస్తోంది.
ఇంటర్న్‌షిప్ వ్యవధి : 2 నెలలు. ఇంటర్న్‌షిప్ మే 19 నుంచి మొదలై జులై 18వరకు కొనసాగే అవకాశం ఉంది.
స్టైఫండ్ : నెలకు 15వేల రూపాయల చొప్పున ఇస్తారు.
వసతి : హాస్టల్, భోజన వసతి సౌకర్యం ఉంటుంది. లభ్యతను బట్టి వసతి కోసం డబ్బులు చెల్లించాల్సి ఉండవచ్చు.
ఫెలోషిప్‌లో పాల్గొనే ఇంజినీరింగ్ విభాగాలు ఇవే : ఏరోస్పేస్ ఇంజినీరింగ్, అప్లైడ్ మెకానిక్స్ అండ్ బయో మెడికల్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ డిజైన్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్, ఓషన్ ఇంజినీరింగ్
సైన్స్ విభాగంలో : ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్
హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ : మేనేజ్‌మెంట్ స్టడీస్
ఈ విషయాలను గమనించండి :
- దరఖాస్తులు, ఇతర దస్త్రాలను ఆన్‌లైన్ విధానంలో మాత్రమే పంపాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్ దరఖాస్తులు అనుమతించరు.
- దరఖాస్తుదారులు తమ రిజిస్టర్డ్ ఈ- మెయిల్‌కు పంపిన యూజర్ నేమ్, పాస్‌వర్డ్ ఆధారంగా అప్లికేషన్ స్టేటస్‌ను ట్రాక్ చేసుకోవచ్చు.
- సరిగా పూర్తి చేయనటువంటి దరఖాస్తులను తిరస్కరిస్తారు.
- మీ విశ్వవిద్యాలయం/కాలేజీ హెడ్ మీరు తగిన విద్యార్థి అని ధ్రువీకరించే లేఖను సమర్పించాల్సి ఉంటుంది.
- రిజిస్ట్రేషన్ కోసం క్లిక్ చేయండి.