ETV Bharat / business

EMI కట్టేవారికి గుడ్​న్యూస్​- ఐదేళ్లలో తొలిసారి వడ్డీ రేట్లు తగ్గింపు! - RBI RATE CUT

25 బేసిస్‌ పాయింట్లు తగ్గనున్న రెపో రేటు! నిపుణుల అంచనాలు ఎలా ఉన్నాయంటే?

RBI Rate Cut
RBI Rate Cut (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 6, 2025, 7:35 PM IST

RBI Rate Cut : చాలా కాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI రెపో రేటును తగ్గించనున్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం ఆర్‌బీఐ కొత్త గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు (bps) తగ్గించడంపై ప్రకటన చేసే అవకాశం ఉంది. సంజయ్ మల్హోత్రా అధ్యక్షతన జరిగిన మొదటి మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే దాదాపు ఐదేళ్ల తర్వాత రెపో రేటు 6.25%కి చేరనుంది.

కరోనా సంక్షోభం సమయంలో ఆర్థిక వ్యవస్థకు మద్దతుగా ఆర్‌బీఐ 2020 మేలో రెపో రేటును 40 bps తగ్గించి 4% చేసింది. 2022 మేలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం ఆందోళనల కారణంగా రేట్లు పెంచడం ప్రారంభించింది. ఈ రేట్ల పెంపు 2023 మే వరకు కొనసాగింది. ఆ తర్వాత రెపో రేటులో ఎలాంటి మార్పు చేయలేదు.

రెపో రేటు తగ్గింపుపై నిపుణుల అంచనాలు ఇలా
అనేక ఆర్థిక సంస్థలు, ఆర్థికవేత్తలు 25 bps రేటు తగ్గింపును అంచనా వేస్తున్నారు. 2023 ఫిబ్రవరి తర్వాత ఆర్‌బీఐ రెపో రేటును 6.25%కి తగ్గిస్తుందని DBS గ్రూప్ రీసెర్చ్ భావిస్తోంది. BofA గ్లోబల్ రీసెర్చ్ కూడా రేటు తగ్గింపును ఆశిస్తోంది.

అసోచామ్ (ఒక ప్రముఖ ఇండస్ట్రీ చాంబర్) కూడా ఆహార ద్రవ్యోల్బణం తగ్గడం, రబీ పంట దిగుబడులు పెరిగే అవకాశం ఉండటం వల్ల రేటు తగ్గింపు ఉండవచ్చని పేర్కొంది. SBI రీసెర్చ్, బజాజ్ బ్రోకింగ్ రీసెర్చ్ కూడా 25 bps తగ్గింపును అంచనా వేశాయి.

రుణగ్రహీతలు, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
రెపో రేటు తగ్గింపుతో రుణాల వడ్డీ రేట్లు తగ్గుతాయి. రుణగ్రహీతలకు భారీ ఉపశమనం లభిస్తుంది. ఫ్లోటింగ్‌ వడ్డీ రేట్లతో లోన్‌లు తీసుకున్న వారికి ఈఎంఐ భారం తగ్గుతుంది. కొత్తగా లోన్‌ తీసుకునే వారికి తక్కువ వడ్డీకే లోన్‌లు లభిస్తాయి. ప్రస్తుతం హోమ్‌ లోన్‌ వడ్డీ రేట్లు సంవత్సరానికి 8.5% నుంచి 9% మధ్య ఉన్నాయి. 25 నుంచి 50 bps తగ్గింపుతో ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ(నగదు ప్రవాహం) పెరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు.

ఎప్సిలాన్ మనీ సీఈఓ అభిషేక్ దేవ్ మాట్లాడుతూ, ‘కేంద్ర బడ్జెట్‌, మానిటరీ పాలసీ కమిటీ నిర్ణయాలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.’ అని పేర్కొన్నారు.

మరోవైపు యెస్‌ సెక్యూరిటీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ అంబానీ మాట్లాడుతూ, ‘ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇప్పటికీ రేట్ల తగ్గింపునకు అనుకూలంగా లేవు. అయితే ఆర్‌బీఐ తన విధాన వైఖరిని తటస్థంగా ఉండటం నుంచి అనుకూలంగా మార్చవచ్చు. ఇది స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది.’ అని చెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.