Salar Jung Museum Art And Culture Are Available in Google : పురాతన వస్తువులు, చిత్రాలు చూడాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. వెసులుబాటు లేక సుదూర ప్రాంతాలకు వెళ్లి చూడలేని పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గూగుల్ వినూత్న పరిష్కారం తీసుకొచ్చింది. ఆర్ట్స్, కల్చర్‌లో భాగంగా ప్రఖ్యాత సాలార్‌జంగ్ మ్యూజియానికీ చోటు కల్పించింది. అక్కడి అరుదైన వస్తువుల ప్రత్యేకతలను వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేశారు.
- వెబ్‌సైట్‌లో ప్రతి వస్తువుకు సంబంధించిన టైటిల్, ఎక్కడ తయారు చేశారు? దాని ప్రత్యేకత? ఏ కాలం నాటిది లాంటి వివరాలన్నీ ఉంటాయి.
- మ్యూజియంలో భద్రపరిచిన సింబల్స్ ఆఫ్ గ్రోరీ పేరుతో రాజుల దర్పం ప్రతిబింబించేలా సుమారు వెయ్యికి పైగా అరుదైన, ప్రాచీన వస్తువులు వెబ్‌సైట్లో నిక్షిప్తం చేశారు.
- వండర్స్ ఆఫ్ ఫుడ్ పేరుతో నాడు రాజులు ఆడిన చెస్ బోర్డు, రెండో నిజాం సాహన యాత్ర, రాయల్ దక్కనీ కళా పోషణఖు వివరాలను డిజిటలైజ్ చేశారు.
- మ్యూజిక్ ఆఫ్ బ్రాంజ్, ఇండియన్ ఎపిక్స్ ఇన్ ఆర్ట్స్, ఎ గేమ్ ఆఫ్ థ్రోన్స్, హౌ చెస్ కాంకర్డ్ వరల్డ్, భారతదేశ, తెలంగాణ, నిజాం చరిత్రకు సంబంధించిన 1,000పైగా చిత్రాలు అందుబాటులో ఉన్నాయి.
వివరాలను https://artsandculture.google.com/partner/salar-jung-museum లో చూడవచ్చు. వెబ్‌సైట్‌లోకి వెళ్లగానే వివిధ రకాల వస్తువులు కనిపిస్తాయి. కావాల్సిన దానిపై నొక్కగానే ఆ వస్తువుకు సంబంధించిన మొత్తం సమాచారం వస్తుంది.