ETV Bharat / state

ఆ ఉక్కు వంతెన ఎప్పటికీ పూర్తయ్యేనో? - మంత్రి ఆదేశించినా పట్టించుకోరా! - FLY OVER IN YADAGIRI GUTTA

యాదగిరిగుట్ట వద్ద ఆగిపోయిన స్టీల్​ వంతెన పనులు - స్వయంగా మంత్రి ఆదేశించినా ముందుకు కదలని పనులు - బిల్లులు రావడం లేదని పనులను ఆపేసిన కాంట్రాక్టర్​

FLY OVER IN YADAGIRI GUTTA
FLY OVER IN YADAGIRI GUTTA (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 6, 2025, 6:18 PM IST

Steel Flyover in Yadagirigutta : యాదగిరిగుట్ట వద్ద మెకలై స్టీల్‌తో నిర్మిస్తున్న 64 మీటర్ల లింక్‌ ఫ్లైఓవర్‌ పనులు దాదాపు 5 నెలలుగా జరగడం లేదు. రానున్న మూడు నెలల్లో అసంపూర్తి పనులు పూర్తి చేయాలని గతేడాది సెప్టెంబరు 18న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంబంధిత అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ పనులలో ఎలాంటి చలనం లేకపోవడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

యాదగిరిగుట్టలో సుందరంగా తీగెల వంతెన (మెకలై స్టీల్‌ ఫ్లైఓవర్‌) నిర్మాణ పనులు పూర్తి చేయాలని గతంలో ప్రభుత్వం సంకల్పించింది. యాదగిరి గుట్టపై ప్రధానంగా రవాణా రద్దీని క్రమబద్ధీకరించి సాఫీగా దర్శన ఏర్పాట్లు జరిగేలా భారీ పై వంతెన నిర్మించేందుకు ఐదేళ్ల క్రితమే నిర్ణయం జరిగింది. 2020 నవంబరులో రూ.34 కోట్ల అంచనాతో ఈ వంతెన త్వరితగతిన నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అనంతరం వెంటనే నిర్మాణ పనులు కూడా ప్రారంభమైయ్యాయి. మొత్తం 450 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో ఈ పనులు కొద్ది మేర జరిగాయి. ఇప్పటికే 386 మీటర్ల మేర పై వంతెన పనులు జరిగాయి. ఇంకా 64 మీటర్ల పై వంతెన లింక్​ పనులు జరగాల్సి ఉంది.

గుట్టపై పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీ : హైదరాబాద్‌, ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు గుట్టకు రాగానే వైకుంఠ ద్వారం నుంచి 2 కిలో మీటర్ల దూరంలో ఉన్న మార్గం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. కార్లు, బస్సులు, ఇతరత్రా భారీ వాహనాలు గుట్టకు కుడివైపు మార్గం నుంచి పైకి వెళుతున్నాయి. ప్రస్తుతం వీరికి రాకపోకలు ఐచ్చికమైనప్పటికి వచ్చేప్పుడు మాత్రం పాత ఘాట్‌రోడ్డు నుంచి గుట్ట దిగి వెళుతున్నాయి.

గతంలో గుట్ట దిగివెళుతుండగా ఓ భారీవాహనం అదుపుతప్పి తీవ్ర ప్రమాదానికి గురైంది. గుట్టకు వెళ్లేందుకు, దిగేందుకు ఈ మార్గం ఇరుకుగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరిగేవి. రహదారులు భవనాల శాఖ ఉన్నతాధికారులు త్వరితగతిన స్పందిస్తే ఈ వంతెనతో భక్తులకు మరింత సౌకర్యంగా మారే అవకాశాలున్నాయి.

యూకే సాంకేతికత పూర్తయితేనే సార్థకత : యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే) నుంచి ప్రత్యేకంగా తీగల వంతెన నిర్మాణ సామగ్రిని తెచ్చేందుకు గతంలో గుత్తేదారు తీవ్రంగా ప్రయత్నించారు. దీని నిర్మాణానికి కావాల్సిన భారీ క్రేన్‌, ఇతర సామగ్రిని కూడా సమకూర్చుకున్నారు. రూ.34 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభమవ్వగా దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఇంకా చేసిన పనులకు బిల్లులు మంజూరు గుత్తేదారుకు కాలేదు. వారు ఆ పనులు అలాగే అర్థాంతరంగా వదిలేసి వెళ్లిపోయారు. ఇంకా 64 మీటర్ల పని ఎప్పుడు పూర్తవుతుందోనని తెలియని పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని సంబంధిత అధికారులను అడగగా వారం రోజుల్లో మరోసారి సంబంధిత కాంట్రాక్టర్​తో మాట్లాడి అసంపూర్తి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

యాదాద్రి ఆలయానికి భారీగా హుండీ ఆదాయం - మొత్తం ఎంత అంటే?

వంతెన కష్టాలు తీరేది ఎప్పుడో...!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.