Thandel Twitter Review : టావీవుడ్ స్టార్ హీరో నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్లో తెరకెక్కిన లేెటెస్ట్ మూవీ 'తండేల్'. మత్స్యకారుల బ్యాక్‌డ్రాప్‌లో ఓ ఫీల్ గుడ్ మూవీగా ఇది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈ చిత్రాన్ని చూసిన ఆడియెన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉందంటే?
ప్రస్తుతం ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. సాయి పల్లవి , చైతూ జోడీ బాగుందని, ఇది ఓ డీసెంట్ లవ్ స్టోరీ అని అంటున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచిందని ఓ నెటిజన్ పేర్కొన్నారు.
Blockbuster movie 🔥 🔥 🔥
— Mahesh S (@MaheshS50918717) February 7, 2025
Valentine's week gift🖤
Dsp music🔥🔥🔥#ThandelonFeb7th#NagaChaitanya#SaiPallavi#Thandel#DSP pic.twitter.com/gcUBnqoZR1
Here is the #Review of #Thandel 🚨🚨
— FILMOVIEW (@FILMOVIEW_) February 7, 2025
Its a decent love story with a not so effective Patriotic backdrop!
⭐️⭐️⭐️/5
Best thing about #Thandel is the mesmerising chemistry of lead pair. All the scenes involving #NagaChaitanya and #SaiPallavi came out very well 🔥🔥❤️❤️! #DSP gave… pic.twitter.com/jK6RICuSPu
ఇంకొకరేమో నాగచైతన్య యాక్టింగ్ వేరే లెవెల్లో ఉందని, తన నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని అంటున్నారు. తన ట్రాన్స్ఫార్మేషన్ కూడా చాలా బాగుందని అంటున్నారు.
మరొకరేమో ఇది ఓ మంచి లవ్ ట్రాక్ అని అంటున్నారు. కొంచం దేశభక్తి ఎలిమెంట్స్‌తో ఈ మూవీని ఎండ్ చేసిన తీరు నచ్చిందని అంటున్నారు. ఇది వ్యాలెంటైన్స్ డే గిఫ్ట్ అని కామెంట్ చేస్తున్నారు. ఇక ఇందులో ఫస్ట్ హాఫ్ ఫర్వాలేదనిపించినప్పటికీ, సెకెండాఫ్ అదిరిపోయిందని అంటున్నారు. డీఎస్పీది ఇది బెస్ట్ ఆల్బమ్ అని కామెంట్ చేస్తున్నారు.
#Thandel
— Professor Puli 🐯 (@professorpuli) February 7, 2025
B-L-O-C-K-B-U-S-T-E-R 💥🔥🥵#NagaChaitanya acting 💥🔥
Asalu expect kooda cheyaledu ee range lo transformation vuntadi ani
Especially wedding card scene lo aithe 🔥💥#Saipallavi rocks as usual. Both NC and SP combo has some magic 🪄 @ThisIsDSP pranam pettesadu pic.twitter.com/rNcRU69zX2
#ThandelReview : First Half
— Australian Telugu Films (@AuTelugu_Films) February 7, 2025
- #NagaChaitanya Entry & Tittle Card Career Best 💥💥🔥
- #HilessoHilessa Song & #SaiPallavi
Dance Eye Pleasing 👌👌👌
- #NamoNamahShivaya Song, #NagaChaitanya & #SaiPallavi Dance 💥💥💥🔥🔥
- Chemistry Between Lead Pair ♥️🔥
- Very Good Emotionally… https://t.co/sCwGrolGgT pic.twitter.com/uVSjokqdOa
సినిమా విషయానికొస్తే
శ్రీకాకుళం జిల్లా డి మత్స్యలేశం గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. వేటకు వెళ్లిన పలువురు మత్స్యకారులు పాకిస్థాన్ కోస్ట్ గార్డుకు చిక్కి రెండేళ్లు జైలు శిక్ష అనుభవించిన స్టోరీ లైన్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. గతంలో ఎన్నడూ చేయని సరి కొత్త పాత్రలో చైతూ, డీగ్లామర్ లుక్‌లో సాయి పల్లవి కనిపించనున్నారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుంది. అలాగే సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదలైంది.