ETV Bharat / state

బీఆర్​ఎస్ నేతలు సర్వేలో పాల్గొనరు - కానీ అవహేళన మాత్రం చేస్తారు : పొన్నం - PONNAM PRABHAKAR ON CASTE CENSUS

బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు మా పార్టీ సిద్ధం - కులగణనపై మాట్లాడిన మంత్రి పొన్నం ప్రభాకర్

Minister Ponnam Prabhakar on Caste Census in Telangana
Minister Ponnam Prabhakar on Caste Census in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2025, 11:12 AM IST

Minister Ponnam Prabhakar on Caste Census in Telangana : కులగణనపై కులసంఘాల నేతలకు వివరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్​ తెలిపారు. కరీంనగర్​ మీడియాతో మాట్లాడిన ఆయన కులగణనను దేశం మొత్తం చేయాలని రాహుల్​ గాంధీ డిమాండ్ చేస్తున్నారన్నారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్​ నేతలు సర్వేలో పాల్గొనరని, అవహేళన మాత్రం చేస్తారని ఎద్దేవా చేశారు. సర్వే పాల్గొన్న వాళ్లకు కులగణనపై మాట్లాడే అవకాశముంటుందని పేర్కొన్నారు.

"కులగణనలో ఏ తప్పు లేదు ఏదైనా తప్పు కనిపిస్తే నా దృష్టికి తీసుకురావాలి. సబ్‌ప్లాన్‌, పథకాల రూపకల్పనకు కులగణన ఉపయోగపడుతుంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులగణన చేయాలని డిమాండ్ ఉంది. ఏళ్ల నుంచి పెండింగ్‌లో ఉన్న చారిత్రక కులగణనను మా ప్రభుత్వం పూర్తి చేసింది. పక్కాగా కులగణన పూర్తి చేశాం. ప్రజలు ఇష్టపూర్వకంగా కులగణన కోసం సమాచారం ఇచ్చారు." - పొన్నం ప్రభాకర్ , బీసీ సంక్షేమ శాఖ మంత్రి

బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీఆర్ఎస్ నేతలు వెనుకబడిన వర్గాలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కులగణనలో ఏ తప్పు లేదన్న ఆయన ఏదైనా తప్పు కనిపిస్తే తన దృష్టికి తీసుకురావన్నారు. సబ్​ప్లాన్​, పథకాల రూపకల్పను ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు.

బీజీపీ ఫ్యూడలిస్టిక్ పార్టీ : స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కులగణన చేయాలని డిమాండ్ ఉందని, ఏళ్ల నుంచి పెండింగ్​లో ఉన్న దీన్ని తమ ప్రభుత్వం పక్కాగా పూర్తి చేసిందని వివరించారు. ఇందులో భాగంగా ప్రజలు ఇష్టపూర్వకంగా సమాచారం ఇచ్చారని చెప్పారు. కులగణన చేయబోమని కేంద్రంలో బీజీపే అఫిడనిట్ ఇచ్చిందని, ఆ పార్టీ ఫ్యూడలిస్టిక్​ పార్టీ అని మంత్రి పొన్నం విమర్శించారు.

"కులగణన సర్వేలో పాల్గొనని వారికి సూపర్‌ ఛాన్స్‌ - వారంతా సమాచారం ఇవ్వొచ్చు"

వాళ్ల సిఫార్సు ప్రకారమే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ - చిట్​చాట్​లో రేవంత్ రెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.