Kharge Counter To Modi Parliament Speech : రాజ్యసభలో ప్రధాని మోదీ ప్రసంగంపై కాంగ్రెస్ మండిపడింది. చరిత్రలో నివసించే వ్యక్తి వర్తమానం, భవిష్యత్తును ఎలా నిర్మించగలడని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. రాజ్యసభలో ప్రధాని ప్రసంగం అబద్ధాలు, అర్ధ సత్యాలతో నిండి ఉందని ఆరోపించారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేతుల్లో దేశ భవిష్యత్తు అంధకారమని ఎక్స్‌లో ఖర్గే పోస్ట్ చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఆర్థిక అసమానత, మాంద్యం, రూపాయి పతనం, ప్రైవేటు పెట్టుబడులు పడిపోవడం, విఫలమైన 'మేక్ ఇన్ ఇండియా' గురించి ప్రధాని మాట్లాడకుండా కాంగ్రెస్‌పై దూషణలను కొనసాగించారని పేర్కొన్నారు.
जो व्यक्ति सिर्फ़ इतिहास में रहता है वो वर्तमान और भविष्य का क्या निर्माण करेगा !
— Mallikarjun Kharge (@kharge) February 6, 2025
इस सरकार के हाथों में देश का भविष्य अंधकारमय है।
बेरोज़गारी, महँगाई, आर्थिक असामनता, मंदी, लुढ़कता रूपया, गिरता निजी निवेश और विफ़ल 'मेक इन इंडिया' पर बात करने के बजाय मोदी जी केवल कांग्रेस को…
వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు ఇవ్వడానికిభూస్వామ్యాన్ని రద్దు చేయడానికి రాజ్యాంగానికి మొదటి సవరణను కాంగ్రెస్ చేసిందని ఖర్గే గుర్తు చేశారు. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను రాజ్యాంగ సభకు తీసుకురావడానికి కాంగ్రెస్ తమ సభ్యుడు ఎంఆర్ జయకర్‌ను ముంబయి నుంచి రాజీనామా చేయించిందని తెలిపారు.
నెహ్రూ ప్రభుత్వంలో అంబేడ్కర్ దేశానికి మొదటి న్యాయ మంత్రి అయ్యారని గుర్తు చేశారు. ఇందిరా గాంధీ 'గరీబీ హటావో' కార్యక్రమం పేదరికాన్ని తగ్గించిందని ఖర్గే చెప్పారు. యూపీఏ ప్రభుత్వం 27 కోట్ల మందిని దారిద్య్రరేఖ నుంచి బయటకు తీసుకువచ్చిందన్నారు. ప్రస్తుతం ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలు పొదుపు చేసుకోలేకపోతున్నారని రూపాయి అత్యంత బలహీన స్థాయిలో ఉందని ఖర్గే ఆరోపించారు.
ఇదీ జరిగింది :
'సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్' అనే భావనను కాంగ్రెస్ నుంచి ఆశించడం తప్పిదమే అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగం స్ఫూర్తిదాయకంగా, ప్రభావవంతంగా ఉందని కొనియాడారు. అది మనందరికీ ముందుకు సాగే మార్గాన్ని చూపించిందని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు.
"దేశానికి ఎదురయ్యే సమస్యలను తెలివిగా పరిష్కరించుకోవాలి. ఎప్పుడూ దేశ ప్రగతి గురించే మా ఆలోచన ఉంటుంది. పేదప్రజల ఉన్నతి కోసమే మా కార్యక్రమాలు ఉంటాయి. పదేళ్లుగా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నాం. దశాబ్దాలుగా ఓబీసీలు నిరాశలో కూరుకుపోయారు. ఓబీసీ ఎంపీల ప్రతిపాదనలను కాంగ్రెస్ తిరస్కరించింది. ఓబీసీ ఎంపీల ప్రతిపాదనలను కాంగ్రెస్ తిరస్కరించింది. ఓబీసీ ఎంపీల ఇబ్బందులు, కష్టాలు మేం విన్నాం."
--ప్రధాని నరేంద్ర మోదీ
అసత్య నినాదాలు కాదు- అసలైన అభివృద్ధి చేసి చూపించాం : ప్రధాని మోదీ
'కాంగ్రెస్ నుంచి అది ఆశించడం మన తప్పే'- హస్తం పార్టీపై మోదీ ఫుల్ ఫైర్!