ETV Bharat / politics

పార్టీ గీత దాటొద్దు - ఏదున్న నాతో చెప్పండి - సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ - CM REVANTH REDDY CLP MEETING

పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం - స్థానిక ఎన్నికలపై దిశానిర్దేశం - ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత ఎమ్మెల్యేలదే

CM Revanth Reddy CLP Meeting
CM Revanth Reddy CLP Meeting (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Feb 7, 2025, 8:57 AM IST

CM Revanth Reddy CLP Meeting : ఎమ్మెల్యేలకు ఏమైనా సమస్యలుంటే పార్టీకి చెప్పాలి కానీ బహిరంగంగా మాట్లాడటం మంచిది కాదని, అలా చేయడం వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతం వెళ్లే ప్రమదముంటుందని, ఎవరూ పార్టీ గీతను దాటొద్దని, ఇలాంటివి ఎవరు చేసినా సహించేది లేదని సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా హెచ్చరించినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్​ తప్పనిసరిగా గెలిచే విధంగా ఉండాలని అందుకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలకు వివరించి చెప్పడానికి అంతా కృషి చేయాలని సూచించినట్లు తెలిసింది. గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సీఎల్పీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం జరిగింది. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, పీసీసీ అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత చివర్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సుమారు ఐదున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశానికి మీడియాను అనుమతించలేదు. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలిలా ఉన్నాయి.

ఎవరికి ఏ సమస్య ఉన్నా చెప్పుకోవడానికి తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు. తనకు చెప్పడం కుదరకపోతే పీసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జికి లేదా ఏఐసీసీ పెద్దలకు ఇలా ఎవరికైనా చెప్పవచ్చని అన్నారు. ఇలా చెప్పుకోవాలనుకునేవారికి కావాలంటే తానే అపాయింట్​మెంట్​ ఇప్పిస్తాని చెప్పారు. పార్టీ సమావేశంలో అన్ని విషయాలు మాట్లాడవచ్చని, అంతే తప్ప బహిరంగంగా మాట్లాడటం, రహస్యంగా గ్రూపులుగా సమావేశం కావడం సరైన విధానం కాదన్నారు. మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలు 70 శాతం వరకు ఉన్నారని, మొదటిసారి కంటే రెండోసారి గెలుపొందడం ముఖ్యమని వివరించారు. రెండోసారి నెగ్గాలంటే ఎప్పుడూ జనంలో ఉండాలి తప్ప హైదరాబాద్‌లో కాదని ఎమ్మెల్యేలకు తెలిపారు.

రైతు, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి : స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పనిచేయాలని సూచించారు. అత్యధిక స్థానాలు నెగ్గేందుకు పార్టీ శ్రేణులంతా కలసి పనిచేయాలిని తెలిపారు. ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండే కార్యకర్తలను కలుపుకొని పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ వర్గీకరణ, కులగణనను విజయవంతంగా పూర్తి చేయడం లాంటి అంశాలతోపాటు కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన రైతు, సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఎమ్మెల్యేకు సూచించారు.

బాధ్యత ఎమ్మెల్యేలదే : రాజకీయాల్లో అనేక అంశాలు ముడిపడి ఉంటాయని, వాటిని అర్థం చేసుకోకుండా బహిరంగంగా ఏమైనా మాట్లాడితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా చెప్పుకోవాలని సూచించారు. ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు విందు పేరుతో కలిశారని, కానీ ఏదో మాట్లాడుకున్నట్లు బయటకు వచ్చిందన్నారు. ఇలాంటి వాటివల్ల మీరు మునగడమే కాదు పార్టీకి నష్టమన్న విషయాన్ని గుర్తుకుపెట్టుకోండని హెచ్చరించారు. మీరు అడిగే వాటిలో కొన్ని చేయగలిగేవి ఉంటాయని, కొన్ని చేయలేనివి ఉంటాయన్నారు. సొంతమా? ప్రజలకు సంబంధించినవా? ఇలా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ఎమ్మెల్యేలు ఎంత బాగా పనిచేస్తే ప్రభుత్వానికి అంత మంచి పేరు వస్తుందని, ప్రభుత్వం చేసే మంచి పనులు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేనన్నారు.

మన పార్టీ చేసింది : ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా ఏడాది పాలనలో చాలా పనులు చేశామన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని తెలిపారు. రుణమాఫీస, రైతుభరోసా, ఉచిత కరెంటు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వంటి హామీలన్నీ అమలు చేస్తున్నామని చెప్పారు. మనం చేసిన పనుల్ని కూడా చేయలేదని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని, వాటిని గట్టిగా తిప్పికొట్టాలని తెలిపారు. గతంలో కులగణన, వర్గీకరణ ఎవరూ చేయలేకపోయారని ఎస్సీ వర్గీకరణ చేస్తామని గత పాలకులు ఎన్నో మాటలు మాట్లాడారని చెప్పారు. బడుగు, బలహీనవర్గాల జనాభా ఎంతో చెప్పాలని, తమకు న్యాయం చేయాలని బీసీలు, వర్గీకరణ చేయాలని ఎస్సీ వర్గాలు దశాబ్దాలుగా పోరాడుతున్నా దేశంలో ఎవరూ చేయలేకపోయారన్నారు. కానీ, తమ ప్రభుత్వం చేసి చూపించిందని తెలిపారు. గత పదేళ్లలో ఎమ్మెల్యేలు నోరువిప్పి మాట్లాడే పరిస్థితి లేదన్నారు.

బీఆర్ఎస్​ హయాంలో మంత్రులు చెప్పినా విన్న పాపానా పోలేదని చెప్పారు. అలాంటి ప్రభుత్వాన్ని కాదని కాంగ్రెస్‌కు ప్రజలు అవకాశం ఇచ్చారని ఇప్పుడు స్వేచ్ఛగా పనిచేసే అవకాశంతో ప్రజలకు వద్దకు పాలన తెచ్చామన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యతను అందరూ తీసుకుని ఆలోచించి వ్యవహరించాలని సూచించారు. పార్టీ నేతలే కాకుండా సామాన్య ప్రజలను సైతం నిత్యం తాను కలుస్తుంటానన్నారు. తనకు ఎవరైనా, ఏమైనా చెప్పే అవకాశం ఉందని తెలిపారు.

"కులగణన సర్వేలో పాల్గొనని వారికి సూపర్‌ ఛాన్స్‌ - వారంతా సమాచారం ఇవ్వొచ్చు"

వాళ్ల సిఫార్సు ప్రకారమే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ - చిట్​చాట్​లో రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో కులసర్వే నివేదిక ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌ - కులాల వారిగా ఎంతమంది ఉన్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.