Five Lack Rupees Theft From A Bike in Nirmal : నిర్మల్ జిల్లా కేంద్రంలోని హోటల్ మయూరి వద్ద పార్క్ చేసిన ఓ ద్విచక్ర వాహన డిక్కీలో నుంచి రూ.5 లక్షలు చోరీ అయ్యాయి. ఈ ఘటన అక్కడి స్థానికులలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే లక్ష్మణ చాంద మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన సిరిగే నరేశ్ అనే వ్యక్తి స్థానిక యూనియన్ బ్యాంకు నుంచి రూ. 5 లక్షల నగదును తన అవసర నిమిత్తం విత్‌డ్రా చేశాడు. అంతలోనే తనకు ఫోన్ రావడంతో తనతో పాటు వచ్చిన అల్లుడు కళ్యాణ్‌కు ఆ డబ్బులను ఇచ్చి బైకు డిక్కీలో పెట్టమని చెప్పాడు.
ముందస్తు ప్రణాళికతోనే కొట్టేశాడు : కళ్యాణ్ ఆ డబ్బులను డిక్కీలో పెట్టిన తర్వాత కొద్ది సేపటికి అతనికీ ఫోన్ రావడంతో డిక్కీకి తాళం వేయకుండా మరిచిపోయి మాట్లాడుతూ బయటకు వెళ్లాడు. దీనిని గమనించిన ఓ దుండగుడు ముందుగా వెళ్లి అక్కడి ప్రాంతాన్ని పరిశీలించాడు. ఎవరు లేరని నిర్ధారణకు వచ్చి వేగంగా ద్విచక్రవాహనం డిక్కీలో నుంచి రూ.5 లక్షలు ఎత్తుకెళ్లాడు. ఫోన్ మాట్లాడిన తర్వాత నరేశ్ వచ్చి చూసేసరికి డబ్బులు లేకపోవడంతో దొంగతనం జరిగినట్లు గుర్తించారు.
సీసీటీవీ ఫుటేజీలో నమోదు : వెంటనే నిర్మల్ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అక్కడున్న సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో నమోదయ్యాయి. బాధితుడు సిరిగే నరేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
Theft at Car Showroom in Nalgonda : కారు షోరూమ్‌లలో నగదు చోరీ.. వీడియో వైరల్
Money stolen from ATM in Hyderabad : ఏటీఎం నుంచి నగదు చోరీ.. 24 గంటల్లోనే పట్టుకున్న పోలీసులు