Andhra Style Mudda Pappu Recipe in Telugu : మెజార్టీ పీపుల్ ఎక్కువగా ఇష్టపడే రెసిపీలలో ఒకటి పప్పు. ఇందులో ఎన్నో రకాల రెసిపీలు ఉన్నాయి. వాటిలో ముద్దపప్పు చాలా ఫేమస్. అయితే, ఈ ముద్దపప్పుని పర్ఫెక్ట్గా చేయడం అందరికీ రాదు. ఆంధ్ర స్టైల్లో పక్కాగా ప్రిపేర్ చేయాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ఇలా చేస్తే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుంటూ తింటారు!
ముఖ్యంగా ఆవకాయ, ఏదైనా పులుసు రెసిపీలోకి దీన్ని సైడ్ డిష్‌గా చేసుకున్నారంటే ఆ కాంబినేషన్ అద్దిరిపోతుంది! లేదంటే వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నా ఆ టేస్ట్ వేరే లెవల్. మరి, ఈ సూపర్ టేస్టీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- కందిపప్పు - అరకప్పు
- పసుపు - అరచెంచా
- ఉప్పు - రుచికి సరిపడా
తాలింపు కోసం :
- నెయ్యి - 2 టేబుల్‌స్పూన్లు
- ఇంగువ - పావుటీస్పూన్
- జీలకర్ర - అరచెంచా
అమ్మమ్మల కాలంనాటి పెసరపప్పు రసం - ఆహాఁ జుర్రుకుంటారు!
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా స్టౌపై కడాయి పెట్టుకొని కందిపప్పుని మీడియం ఫ్లేమ్ మీద, రంగు మారి మంచి సువాసన వచ్చేంత వరకు గరిటెతో కలుపుతూ వేయించుకోవాలి.
- ఆ విధంగా వేయించుకున్నాక దింపేసి కందిపప్పును ఒకసారి శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత స్టౌపై కుక్కర్ పెట్టుకొని కడిగిన కందిపప్పును అందులో వేసుకోవాలి.
- ఆపై ఒకటిన్నర కప్పుల వరకు వాటర్, పసుపు యాడ్ చేసుకొని కలిపి మీడియం ఫ్లేమ్ మీద 6 నుంచి 7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి.
- అలా ఉడికించుకున్నాక కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి ఉప్పు వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా మాష్ చేసుకోవాలి. పప్పుని పలుకులు లేకుండా వెన్నలా ఉండేలా రుబ్బుకోవాలి.
- ఒకవేళ మీకు పప్పు గుత్తితో మాష్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే మిక్సీలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే, మీరు వాటర్ కాస్త ఎక్కువ వేసుకున్నట్లయితే కొద్దిసేపు స్టౌపై ఉడికించుకున్నాక మెత్తగా మాష్ చేసుకోవాలి.
- ఇప్పుడు తాలింపుని ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం స్టౌపై చిన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి వేడయ్యాక ఇంగువ, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
- అనంతరం ఆ తాలింపుని ముందుగా మాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న పప్పులో వేసి మొత్తం కలిసేలా ఒకసారి చక్కగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరంగా ఉండే ఆంధ్ర స్టైల్ "ముద్దపప్పు" రెడీ!
- మరి, నచ్చితే మీరూ ఓసారి ఇలా ముద్దపప్పును ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలంటారు.
రుచిలో ఆహా, ఆరోగ్యపరంగా ఓహో అనిపించే - కమ్మని "క్యాలీఫ్లవర్ శనగపప్పు కర్రీ"!