Bank Holidays in February 2025 : ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకులకు దాదాపు 14 సెలవులు ఉన్నాయి. ప్రత్యేకించి ఆ నెలలోని చివరి వారంలో వివిధ రాష్ట్రాల్లో లోకల్ హాలిడేస్ ఎక్కువగా వస్తాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కు చెందిన బ్యాంకు సెలవుల క్యాలెండర్‌లో ఈమేరకు అధికారిక వివరాలను పొందుపరిచారు. దేశంలోని బ్యాంకులన్నీ ఆర్‌బీఐ క్యాలెండర్ ప్రకారమే సెలవులను పాటిస్తాయి. అయితే లోకల్ హాలిడేలు ఉన్న సమయాల్లోనే కొన్ని రాష్ట్రాల బ్యాంకులకు అదనంగా సెలవులు వస్తుంటాయి. బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లో దినాల్లో ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా లావాదేవీలను పూర్తి చేసుకోవచ్చు.
తేదీల వారీగా బ్యాంకులకు సెలవులు
- ఫిబ్రవరి 3 (సోమవారం) : వసంత పంచమి (హర్యానా, ఒడిశా, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, పశ్చిమ బెంగాల్)
- ఫిబ్రవరి 10 (సోమవారం) : లూసర్ (సిక్కిం)
- ఫిబ్రవరి 12 (బుధవారం) : గురు రవిదాస్ జయంతి (హర్యానా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మిజోరం, పంజాబ్)
- ఫిబ్రవరి 14 (శుక్రవారం) : వసంత పంచమి (ఒడిశా, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్, దిల్లీ)
- ఫిబ్రవరి 14 (శుక్రవారం) : సరస్వతీ పూజ (త్రిపుర, పశ్చిమ బెంగాల్)
- ఫిబ్రవరి 14 (శుక్రవారం) : హోలీ (మేఘాలయ, నాగాలాండ్)
- ఫిబ్రవరి 14 (శుక్రవారం) : షబే బరాత్ (ఛత్తీస్‌గఢ్)
- ఫిబ్రవరి 15 (శనివారం) : లుయి న్గైని(మణిపూర్)
- ఫిబ్రవరి 19 (బుధవారం) : ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి(మహారాష్ట్ర)
- ఫిబ్రవరి 20 (గురువారం) : రాష్ట్ర అవతరణ దినోత్సవం(అరుణాచల్ ప్రదేశ్)
- ఫిబ్రవరి 20 (గురువారం) : రాష్ట్ర దినోత్సవం(మిజోరం)
- ఫిబ్రవరి 25 (మంగళవారం) : మహా శివరాత్రి (కర్ణాటక , కేరళ)
- ఫిబ్రవరి 26 (బుధవారం) : మహా శివరాత్రి(గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, తెలంగాణ, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్)
- ఫిబ్రవరి 28 (శుక్రవారం): లోసార్ (సిక్కిం)