ETV Bharat / state

మనిషి మంచోడు, కానీ! - గురుమూర్తి గురించి ఇరుగుపొరుగు ఆసక్తికర విషయాలు - MEERPET MURDER CASE UPDATES

మీర్‌పేట్‌ కేసు దర్యాప్తులో వెలుగులోకి విస్మయకర విషయాలు - నిందితుడు గురుమూర్తి నేపథ్యం, అతడి ప్రవర్తనపై పోలీసుల ఆరా -

Police INVESTIGATION ON MEERPET MURDER
Meerpet Murder Case Updates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 28, 2025, 7:04 AM IST

Meerpet Murder Case Updates : రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో ఈ నెల 22న వెలుగు చూసిన వెంకట మాధవి హత్య కేసు దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి నేపథ్యం, అతడి ప్రవర్తన గురించి సహోద్యోగులు, స్థానికుల్ని పోలీసులు విచారించారు. దీంతో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి. గురుమూర్తి నేపథ్యం అంతా సాదాసీదాగా ఉందని, కానీ ఇంత కిరాతకంగా ఎలా హత్య చేశాడన్నది అంతుబట్టడం లేదని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

నిందితుడి ప్రవర్తనపై పోలీసుల ఆరా : నిందితుడు గురుమూర్తి డీఆర్‌డీవోలో కాంట్రాక్టు విధానంలో భద్రతా సిబ్బందిగా పని చేస్తున్నట్లు తెలుసుకుని పోలీసులు అక్కడికి వెళ్లారు. అతడి సహోద్యోగుల్ని ఆరా తీసినప్పుడు గురుమూర్తి ఎంతో క్రమశిక్షణతో ఉంటాడని, మృధు స్వభావి, సాయం చేసే వ్యక్తిత్వమని కొందరు చెప్పారు. గురుమూర్తి ప్లాస్టిక్‌ వస్తువులు సైతం వాడడని చెప్పినట్లు తెలుస్తోంది.

అంతా సాదాసీదాగా : ఇరుగు పొరుగుతో ఎక్కువగా మాట్లాడేవాడు కాదని, ఉద్యోగానికి వెళ్లొచ్చినప్పుడు మినహా ఇతర సమయం తమకు కనిపించడన్నట్లు స్థానికులు చెప్పారు. ఇదంతా బాగానే ఉన్నా, అంత జుగుప్సాకరంగా హత్య ఎందుకు చేశాడదన్నది మాత్రం మిస్టరీగా మిగిలిందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. భార్య శవాన్ని ఎలాగైనా మాయం చేయాలని, తాను చంపినట్లు ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో ఇదంతా చేసినట్లు విశ్లేషిస్తున్నారు.

కిరాతకంగా ఎందుకు హత్య చేశాడన్న కోణంలో : హత్య జరిగిన రోజున అంటే ఈ నెల 15వ తేదీ ఏం జరిగిందనే కోణంలో పోలీసులు నిందితుడు గురుమూర్తి నివాసముండే అపార్టుమెంటులోని ఇరుగుపొరుగు నుంచి కొన్ని వివరాలు సేకరించారు. పండుగ మరుసటి రోజు కావడంతో అదే అంతస్తులో ఉండే ఓ వ్యక్తి ఊరు నుంచి ఇంటికొచ్చాడు. అప్పటికే గురుమూర్తి తన భార్యను చంపి ఇంట్లోనే ఉన్నాడు. పొరుగు వ్యక్తి ఇంట్లోకి వెళ్లే సమయంలో దుర్వాసన ఎక్కువగా రావడాన్ని పసిగట్టాడు. అనుమానాస్పదంగా ఉన్నా పండుగ సమయంలో ఎవరో మాంసం వండొచ్చనే భావనతో పట్టించుకోకుండా వదిలేశాడు. కానీ, హత్య చేసి మృతదేహాన్ని ముక్కలు చేసి కాల్చాడని 22వ తేదీన తెలుసుకుని వణికిపోయాడు. అదే రోజు రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయాడు.

యజమాని మినహా మిగిలిన వారంతా ఖాళీ : గురుమూర్తి జీ+2 భవనంలో రెండో అంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. అతడు భార్యను హత్య చేసినట్లు విషయం బయటకొచ్చిన తర్వాత భవనంలో యజమాని మినహా మిగిలిన వారంతా ఖాళీ చేసి వెళ్లిపోయారు. యజమాని ప్రస్తుతం అందుబాటులో లేడు. దర్యాప్తులో భాగంగా కీలక ఆధారాలు సేకరించేందుకు ఇతర రాష్ట్రాలకు చెందిన ఫోరెన్సిక్‌ నిపుణులు సైతం ఇంటిని పరిశీలించారు.

'డెడ్​ బాడీని ఎలా మాయం చేయాలి?' - అంతర్జాలంలో వెతికి ఆనవాళ్లు లేకుండా చేశాడు

ఊర్లో జరిగిన ఆ పెద్ద గొడవ - ఇల్లాలి ప్రాణం తీసే వరకు ఆగలేదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.