ETV Bharat / international

సీజ్​ఫైర్ డీల్​ బ్రేక్- లెబనాన్​పై ఇజ్రాయెల్​ దాడి- 22మంది మృతి - ISRAELI ATTACK ON LEBANON

సీజ్​ఫైర్​ గడువు ముగిసినా ఇంకా లెబనాన్​లోనే ఇజ్రాయెల్ దళాలు- లెబనాన్​పై దాడి - 22మంది మృతి

Israeli Attack On Lebanon
Israeli Attack On Lebanon (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 27, 2025, 7:22 AM IST

Updated : Jan 27, 2025, 8:52 AM IST

Israeli Attack On Lebanon : హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల ఒప్పందం ఉల్లంఘనకు గురైంది. దక్షిణ లెబెనాన్‌లో ఆదివారం ఇజ్రాయెల్‌ దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు సహా 22మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 124మందికి పైగా గాయాలపాలయ్యారు. ఈ దాడిలో దాదాపు 20 సరహద్దు గ్రామాలకు చెందిన పౌరులకు గాయాలయ్యాయి.

కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం దక్షిణ లెబెనాన్‌ నుంచి ఇజ్రాయెల్‌ సైన్యం వైదొగాలి. కానీ, గడువు దాటినా ఇంకా నెతాన్యాహు తమ దళాలను ఉపసంహరించలేదు. ఈ నేపథ్యంలో వేలాది ప్రజలు తమ గ్రామాలకు, పట్టణాలకు ఆదివారం తిరిగివచ్చారు. ఇదే సమయంలో కొందరు హెజ్‌బొల్లా జెండాలు పట్టుకొని ఇజ్రాయెల్‌ దళాలు ఉన్న ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి యత్నించగా, ఐడీఎఫ్‌ కాల్పులు జరిపింది.

ఇజ్రాయెల్​ ఇంకా కొన్ని రోజులు లెబనాన్​లోనే ఉండాలనుకుంటోంది. దక్షిణ లెబనాన్​లోని కొన్ని ప్రాంతాల్లో హెజ్​బొల్లా మళ్లీ తమ స్థావరాలను ఏర్పాటు చేసుకోకుండా చూడటానికి లెబనీస్​ ఆర్మీని ఇంకా మోహరించలేదని ఇజ్రాయెల్​ చెబుతోంది. అందుకే తాము ఇంకా కొన్ని రోజులు లెబనాన్​లోనే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పింది.

ఆదివారం నిరసనలను హెజ్​బొల్లా రెచ్చగొట్టిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. కొన్ని ప్రాంతాల్లో తమ దళాలు ఉన్న వద్దకు వస్తున్న అనుమానితులను బెదిరించడానికి హెచ్చరికగా కాల్పులు జరిపినట్లు తెలిపింది. అందులో కొందరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నామని వెల్లడించింది. ఇజ్రాయెల్ కాల్పులతో ఆ ప్రాంతంలో అనిశ్చితి నెలకొంది. దీంతో ఉత్తర గాజాలోని వేలాది మంది పాలస్తీనియన్లు వారి ఇళ్లకు తిరిగిరాలేకపోయారు.

'ఇక ఆపండి- రూల్స్​ ఫాలో అవ్వండి'
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్, లెబనాన్​ పాటించాలని లెబనాన్​ కోసం నియమించిన ఐరాస స్పెషల్ కోఆర్డినేటర్ జీనిస్​ హెన్నిస్ ప్లాస్చెర్ట్​, ఐరాస పీస్​కీపింగ్ ఫోర్స్ విభాగ అధిపతి లెఫ్టినెంట్ జనరల్​ ఆరోల్డో ఎల్ జారో కోరారు. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. నవంబర్​లో చేసి ఒప్పందంలోని అంశాలు ఇక నెరవేరలేదని చెప్పారు.

అమెరికా-ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణకు నవంబరులో ఇజ్రాయెల్‌-హెజ్‌బొల్లా ఒప్పందం చేసుకున్నాయి. దీని ప్రకారం తమ దళాలను 30రోజుల్లో ఉపసంహరించుకోవాలి. కానీ, ఇజ్రాయెల్‌ వైదొలగడానికి మరింత సమయం కోరుతోంది.

Last Updated : Jan 27, 2025, 8:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.