ETV Bharat / technology

త్వరలో మార్కెట్లోకి నథింగ్ నుంచి నయా స్మార్ట్​ఫోన్- ఈసారి రెండు కాదు, మూడు కెమెరాలతో! - NOTHING PHONE 3 LAUNCH DATE

'నథింగ్ ఫోన్ 3' కెమెరా మాడ్యూల్ రివీల్!- టీజర్​ విడుదల చేసిన కంపెనీ

Nothing Phone 2
Nothing Phone 2 (Photo Credit- Nothing)
author img

By ETV Bharat Tech Team

Published : Jan 27, 2025, 7:22 PM IST

Nothing Phone 3 Launch Date: నథింగ్ తన కొత్త స్మార్ట్​ఫోన్​ను లాంఛ్ చేసేందుకు రెడీ అయింది. గత కొన్ని రోజులుగా దీనిపై కంపెనీ చాలానే టీజర్​లను రిలీజ్ చేస్తోంది. దీంతో త్వరలో ఈ స్మార్ట్​ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ తాజాగా దీని కెమెరా మాడ్యూల్​ను మొదటిసారి అధికారికంగా టీజ్ చేసింది. నథింగ్ తన సోషల్​ మీడియా ప్లాట్​ఫారమ్ ఎక్స్ వేదికగా 7 సెకన్ల వీడియోను పోస్ట్ చేసింది. దీనిలో తన అప్​కమింగ్ ఫోన్ కెమెరా మాడ్యూల్​ను చూపించింది.

ఈ పోస్ట్​లో కంపెనీ 'పవర్ ఇన్ పెర్స్పెక్టివ్' అంటూ క్యాప్షన్​ ఇచ్చింది. ఈ ట్యాగ్​లైన్​తో పాటు ఈ స్మార్ట్​ఫోన్ లాంఛ్ డేట్, టైమ్​ను కూడా రాసుకొచ్చింది. ఈ పోస్ట్​ ప్రకారం నథింగ్ తన అప్​కమింగ్ స్మార్ట్​ఫోన్​ను మార్టి 4, 2025న భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు లాంఛ్ చేయనుంది. అంటే నథింగ్ ఈ ఫోన్‌ను మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC 2025)లో రిలీజ్ చేస్తుంది. అనంతరం భారత్​తో సహా ఇతర దేశాల మార్కెట్​లలోకి ఈ ఫోన్ ఎంట్రీ ఇవ్వనుంది.

టీజర్‌లో కొత్త కెమెరా మాడ్యూల్: కంపెనీ రిలీజ్ చేసిన ఈ టీజర్‌లో అప్​కమింగ్ నథింగ్ ఫోన్ కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది. ఈ అప్​కమింగ్ స్మార్ట్​ఫోన్​ను 'నథింగ్ ఫోన్ 3' పేరుతో రిలీజ్ కావచ్చు. టీజర్​ను చూస్తే కంపెనీ ఈ అప్​కమింగ్ ఫోన్‌లో సరికొత్త కెమెరా మాడ్యూల్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. గతేడాది కంపెనీ ప్రారంభించిన 'నథింగ్ ఫోన్ 2' మోడల్​లో డ్యూయెల్ కెమెరాలతో నిలువుగా కెమెరా మాడ్యూల్‌ను అందించింది.

అయితే ఇప్పుడు దాని అప్​కమింగ్ ఫోన్ టీజర్‌లో నథింగ్ చూపించిన నిలువు కెమెరా మాడ్యూల్‌ను చూస్తే కంపెనీ తన తదుపరి ఫోన్‌లో రెండు కాకుండా మూడు కెమెరా మాడ్యూల్స్​తో తీసుకురానున్నట్లు తెలుస్తోంది. గతేడాది లాంఛ్​ చేసిన ఫోన్ మాదిరిగానే దీనికి టెలిఫోటో లెన్స్‌తో పాటు ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ కెమెరా లెన్స్​ను అందించొచ్చు.

అంతేకాక ఈ స్మార్ట్​ఫోన్ డిజైన్​పై కూడా కొన్ని లీక్స్ వచ్చాయి. వీటి ప్రకారం ఈ ఫోన్‌ ట్రెడిషనల్ యునిక్ ట్రాన్స్పరెంట్ అండ్ ప్రీమియం లుకింగ్​ డిజైన్​తో వస్తుంది. కంపెనీ ఇందులో ప్రాసెసర్​ కోసం కంపెనీ 4nm క్వాల్​కామ్ స్నాప్‌డ్రాగన్ 8s Gen 3 చిప్‌సెట్​ను అందించనున్నట్లు సమాచారం. ఇది 3 GHz వరకు క్లాక్ స్పీడ్​తో వస్తుంది.

ట్రాయ్ ఆదేశాలు- రీఛార్జ్ ప్లాన్​లు ఒకేసారి రూ.210 తగ్గింపు!

శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్​పై భారీ డిస్కౌంట్- ఏకంగా రూ.21వేల వరకు అదిరే బెనిఫిట్స్!

రాయల్​ ఎన్​ఫీల్డ్ డిమాండ్ లేదుగా- ఏకంగా 5లక్షల మంది కొన్న మోడల్ ఇదే!​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.