ETV Bharat / spiritual

ఫాల్గుణ మాసం స్పెషల్​ - విశేషమైన పండుగల, పుణ్య తిథుల వివరాలివే! - PHALGUNA MASAM 2025

ఫాల్గుణ మాసంలోని విశేషమైన పండుగలు- ముఖ్యమైన తేదీలు ఇవే!

Phalguna Masam 2025
Phalguna Masam 2025 (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 27, 2025, 4:36 AM IST

Phalguna Masam 2025 Festival List : తెలుగు పంచాంగం ప్రకారం ఫాల్గుణ మాసం తెలుగు మాసాలలో చివరిది. ఈ మాసంలో హోలీ, శ్రీలక్ష్మి జయంతి వంటి పండుగలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసే ఫాల్గుణ మాసంలో రానున్న పర్వదినాలు, పుణ్య తిథుల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

మాఘమాసం పూర్తయిన వెంటనే వచ్చే ఫాల్గుణ మాసం వేసవికి ఆరంభంగా చెబుతారు. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 29 వరకు ఉంటుంది

  • ఫిబ్రవరి 28 వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పాడ్యమి:తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు సమాప్తం
  • మార్చి 1 వ తేదీ శనివారం ఫాల్గుణ శుద్ధ విదియ:చంద్రోదయం
  • మార్చి 6 వ తేదీ గురువారం ఫాల్గుణ శుద్ధ సప్తమి: తరిగొండ శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి బ్రహోత్సవాలు ప్రారంభం
  • మార్చి 10 వ తేదీ సోమవారం ఫాల్గుణ శుద్ధ ఏకాదశి: అమలక ఏకాదశి
  • మార్చి 11 వ తేదీ మంగళవారం ఫాల్గుణ శుద్ధ ద్వాదశి:నృసింహ ద్వాదశి
  • మార్చి 12 వ తేదీ బుధవారం ఫాల్గుణ శుద్ధ త్రయోదశి:పక్ష ప్రదోషం
  • మార్చి 14 వ తేదీ శుక్రవారం ఫాల్గుణ శుద్ధ పౌర్ణమి:హోళికా పున్నమి, హోలీ పండుగ, కాముని పున్నమి, శ్రీలక్ష్మి జయంతి, కుమారధార తీర్ధ ముక్కోటి, మీన సంక్రమణం.
  • మార్చి 17 వ తేదీ సోమవారం ఫాల్గుణ బహుళ తదియ/చవితి : సంకష్టహరచవితి
  • మార్చి 18 వ తేదీ మంగళవారం ఫాల్గుణ బహుళ చవితి : శుక్రమౌడ్యారంభం
  • మార్చి 25 వ తేదీ మంగళవారం ఫాల్గుణ బహుళ ఏకాదశి: సర్వేషాం పాపవిమోచన ఏకాదశి, శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి సన్నిధిన పుష్పయాగం
  • మార్చి 26 వ తేదీ బుధవారం ఫాల్గుణ బహుళ ద్వాదశి:అన్నమాచార్య వర్ధంతి
  • మార్చి 27 వ తేదీ గురువారం ఫాల్గుణ బహుళ త్రయోదశి: తిరుపతి శ్రీ కోదండరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
  • మార్చి 28 వ తేదీ శుక్రవారం ఫాల్గుణ బహుళ చతుర్దశి: మాసశివరాత్రి, శుక్రమౌడ్య త్యాగం
  • మార్చి 29 వ తేదీ శనివారం ఫాల్గుణ అమావాస్య: సర్వ అమావాస్య . ఫాల్గుణ మాసం ముగింపు.

చంద్రుడు పౌర్ణమినాడు ఉత్తర లేదా పూర్వ ఫల్గుణ నక్షత్రానికి దగ్గరగా ఉండే ఫాల్గుణ మాసంలో రానున్న పండుగలను, పుణ్య తిథులను శాస్త్రంలో సూచించిన విధంగా జరుపుకుందాం. సకల శుభాలను పొందుదాం. శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.